BigTV English
Advertisement

YSRCP: జగన్‌కు, చంద్రశేఖర్‌రెడ్డికి ఎక్కడ చెడింది?.. వైసీపీకి నెల్లూరు తలనొప్పి!

YSRCP: జగన్‌కు, చంద్రశేఖర్‌రెడ్డికి ఎక్కడ చెడింది?.. వైసీపీకి నెల్లూరు తలనొప్పి!

YSRCP: నెల్లూరును క్లీన్‌ స్వీప్ చేసిన వైసీపీకి.. ఇప్పుడదే జిల్లాలో తలనొప్పి తీవ్రమైంది. ఎందుకిలా? సీనియర్ నాయకుడు ఆనం, జగన్‌కు నమ్మినబంటులా పనిచేసిన కోటంరెడ్డి, ఫ్యామిలీ ఫ్రెండ్‌గా చెప్పుకునే మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి ఎందుకు ఎదురుతిరిగారు? మొదటి రెండు పేర్లు ఊహించినవే అయినా.. సడెన్‌స్టార్‌లా తెరపైకి వచ్చారు ఉదయగిరి ఎమ్మెల్యే. ఆయన వ్యవహారశైలిపై జోరుగా చర్చ జరుగుతోంది. ఇంతకీ.. జగన్‌కు, చంద్ర శేఖర్ రెడ్డికి ఎక్కడ చెడింది?


నెల్లూరు జిల్లా.. ప్రస్తుతం ఏపీ రాజకీయాలను వేడెక్కించేస్తోంది. అధికార పార్టీ నుంచి సస్పెండ్ అయిన నలుగురిలో ముగ్గురు.. ఈ జిల్లా నుంచే ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అందులో కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఆనం రామనారాయణ రెడ్డి.. గతం నుంచే పార్టీకి, అధినేత జగన్ కు వ్యతిరేకంగా మాట్లాడుతూ.. వార్తల్లోకెక్కారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో వీరు కచ్చితంగా వైసీపీకి ఓటేయ్యరని తేలిపోయింది. అయితే అనూహ్యంగా మరో ఇద్దరు ఎమ్మెల్యేలు టీడీపీ అభ్యర్థికి విజయాన్ని అందించారు. అందులో ఒకరు ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి. ఎన్నికల్లో ఓటేసిన తర్వాత ఆయన ఎవరికీ అందుబాటులో లేకుండా పోవడం.. మొబైల్ కూడా స్విచ్ఛాఫ్ రావడంతో.. టీడీపీ క్యాండిడేట్ కు ఓటేసిన వారిలో చంద్రశేఖర్ రెడ్డి కూడా ఉన్నారని తేలిపోయింది.

గత కొన్ని నెలలుగా.. పార్టీకి దూరంగా ఉంటూ వస్తున్న మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి.. హైకమాండ్ పై అసంతృప్తితో ఉన్నారు. తనకు వ్యతిరేంగా ఉన్న వారిని పార్టీ ప్రోత్సహిస్తోందని.. దాన్ని సహించబోనట్లు పలుసార్లు బాహాటంగానే స్పందించారు. ఎంతమంది నేతలు వచ్చినా.. ఉదయగిరిలో తానే గొప్ప నేత అని కూడా ప్రకటించారు.


ఓదార్పు యాత్ర నుంచి చంద్రశేఖర్ రెడ్డి.. జగన్ వెంటే ఉన్నారు. పార్టీ పరంగా జిల్లాలో తనకంటూ ప్రత్యేకతను తెచ్చుకున్నారు. అయితే 2019 లో ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాతే.. ఆయన వ్యవహారశైలిలో పూర్తిగా మార్పు కనిపించింది. నియోజకవర్గంపై పట్టు సాధించేందుకు చర్యలు చేపట్టిన చంద్రశేఖర్ రెడ్డి.. తన సన్నిహితురాలైన శాంతకుమారిని.. రాజకీయాలోకి తీసుకువచ్చి ప్రచార కార్యదర్శి పదవిని ఇప్పించారు. అక్కడితోనే ఆగకుండా.. నియోజకవర్గంలో పరోక్షంగా పార్టీ బాధ్యతలను ఆమెకు అప్పగించారు. ఇది చాలామంది స్థానిక నేతలకు రుచించలేదు. స్థానిక సంస్థల ఎన్నికలలో పార్టీ కోసం పనిచేసిన వారిని కాకుండా.. ఆర్థికంగా ప్రయోజనం కలిగించిన వారికి పదవులు ఇచ్చారనే ఆరోపణలు వచ్చాయి. ఎమ్మెల్యే తీరుకు వ్యతిరేకంగా వివిధ మండలాల్లో నేతలు ధర్నాలు కూడా చేశారు.

ఈ పరిణామాలతో ఉదయగిరిపై ఫోకస్ పెట్టిన వైసీపీ హైకమాండ్.. మాజీ ఎమ్మెల్యే వంటేరు వేణుగోపాల్ రెడ్డిని నియోజకవర్గానికి పంపించారు. వివిధ మండలాల్లో పర్యటించిన వంటేరుకు.. ఎమ్మెల్యే వ్యతిరేకులంతా మద్దతుగా నిలిచారు. దీన్ని సహించలేని చంద్రశేఖర్ రెడ్డి.. తాను ఎమ్మెల్యేగా ఉండగా.. మరో నేతకు ఎలా మద్దతిస్తారంటూ.. ప్రశ్నించారు. మొన్నటి ఉగాది వేడుకల్లో కూడా పార్టీలో తనపై ఉన్న వ్యతిరేకతను బయటపెట్టారు. సీఎం జగన్.. తనకేమాత్రం విలువ ఇవ్వడం లేదని.. అటెండర్ కంటే హీనంగా చూస్తున్నారనే కామెంట్లు చేశారు. అంతటితో ఆగకుండా.. వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో వైసీపీ గెలవడం కష్టమనే వ్యాఖ్యలు.. ఆయన కొంపముంచినట్లు తెలుస్తోంది.

ఐ ప్యాక్ బృందం నిర్వహించిన సర్వేలో కూడా మేకపాటిపై నియోజకవర్గంలో వ్యతిరేకత ఉందని.. వచ్చే ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండాలని సూచించినట్లు తెలుస్తోంది. 2024 లో అధికారంలోకొచ్చాక.. ఎమ్మెల్సీ పదవి ఇస్తామనే ఆఫర్ చేసినట్లు తెలుస్తోంది. దీంతో వచ్చే ఎన్నికల్లో తనకు టికెట్ రాదనే విషయాన్ని గ్రహించిన చంద్రశేఖర్ రెడ్డి.. పార్టీ కార్యాకలాపాలకు మరింత దూరంగా ఉంటూ వచ్చారు.

గతంలో కడపలో చాలా ఏళ్లుగా నివాసమున్నచంద్రశేఖర్ రెడ్డికి.. వివిధ పార్టీల నేతలతో పరిచయాలు ఉన్నాయి. టీడీపీకి చెందిన మాజీ ఎమ్మెల్సీ ఒకరు.. ఆయనకు సన్నిహితంగా మెలుగుతున్నారనే ప్రచారం ఉంది. ప్రస్తుతం ఎమ్మెల్సీ ఎన్నికలు రావడంతో.. ఓటు కోసం చంద్రశేఖర్ రెడ్డిని ఒప్పించే బాధ్యతను.. టీడీపీకి చెందిన ఆ మాజీ ఎమ్మెల్సీకి పార్టీ అధిష్టానం అప్పగించిందనే ప్రచారం ఉంది. మూడు, నాలుగు రోజులుగా ఈ వ్యవహారం జరుగుతున్నా.. అధికార పార్టీ నేతలు కానీ, ఇంటెలిజెన్స్ అధికారులు కానీ గుర్తించలేకపోయారు. ఆర్థికంగా భారీ ప్రయోజనం కలిగిస్తామని టీడీపీ నేతలు హామీ ఇచ్చినట్లు తెలిసింది. ఓటు వేసే ముందుగా కొంత మొత్తం.. ఓటు వేసిన అనంతరం మరికొంత మొత్తం ఇచ్చేట్టుగా అవగాహన కుదిరిందని వైసీపీకి చెందిన నేతలు ఆరోపిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో తనకు ఎలాగూ టికెట్ రాదని భావించే.. చంద్రశేఖర్ రెడ్డి పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డట్లు చెబుతున్నారు.

నెల్లూరు జిల్లాకు చెందిన మరో ఎమ్మెల్యే విషయంలో కూడా టీడీపీ నేతలు ప్రయత్నించారని.. బేరం కుదరకపోవడంతో ఆయన అంగీకరించలేదనే ప్రచారం జరుగుతోంది. ఏదేమైనా.. నెల్లూరు జిల్లాలో బలంగా ఉందనుకున్న వైసీపీ.. ప్రస్తుత పరిణామాలను ఎలా ఎదుర్కుంటుందనేది ఆసక్తికరంగా మారింది.

Related News

Visakhapatnam: విశాఖలో సీఐఐ సదస్సుకు భారీ ఏర్పాట్లు.. 40 కోట్లతో సర్వాంగ సుందరంగా పనులు

Visakhapatnam Incident: అమ్మా నా కోడలా.. దొంగ పోలీస్ ఆట ఆడి.. అత్తను ఎలా లేపేసిందంటే..!

APSRTC Google Maps: గూగుల్ మ్యాప్స్ లో ఏపీఎస్ఆర్టీసీ సేవలు.. బస్ టికెట్లు బుకింగ్ ఇకపై ఈజీ

AP Ration Card eKYC: ఏపీలో రేషన్ కార్డుదారులకు బిగ్ అలర్ట్.. వెంటనే ఇలా చేయకపోతే కార్డు రద్దు.. స్టేటస్ ఇలా చెక్ చేసుకోవచ్చు

Tirumala: డిసెంబర్ 30 నుంచి జనవరి 8 వరకు వైకుంఠ ద్వార దర్శనం.. త్వరలోనే టికెట్లు జారీ: టీటీడీ ఈవో

Tirupati Laddu Controversy: తిరుమల లడ్డు కల్తీ నెయ్యి కేసులో సీబీఐ సిట్ దూకుడు.. కీలక నిందితుడు అరెస్ట్

AP Investments: ఏపీకి భారీగా తరలివస్తున్న పెట్టుబడులు.. లక్షల కోట్ల విలువైన ప్రాజెక్టులకు ఆమోదం..

MSK Prasad: ఎమ్మెస్కే ప్రసాద్ ప్రోటోకాల్ వివాదం.. సీఎం చంద్రబాబు సీరియస్

Big Stories

×