E-Paper
Advertisement

మూడేళ్లలో రూ.4.5 లక్షల కోట్ల అప్పు.. ఆ డబ్బు ఏమైంది? రేవంత్ సర్కార్‌పై కేటీఆర్ నిప్పులు!

మూడేళ్లలో రూ.4.5 లక్షల కోట్ల అప్పు.. ఆ డబ్బు ఏమైంది? రేవంత్ సర్కార్‌పై కేటీఆర్ నిప్పులు!
Advertisement

KTR Allegations: కాంగ్రెస్ గత మూడేళ్ల పాలనలో రూ.4.5 లక్షల కోట్ల అప్పులు చేసిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. ఆ డబ్బుతో తెచ్చిన పథకాలు, కట్టిన ప్రాజెక్టులు ఏంటో చెప్పాలని సవాలు విసిరారు. బీఆర్ఎస్ తన పదేళ్ల పాలనలో చేసిన అప్పులు రూ.2.80 లక్షల కోట్లు మాత్రమేనన్న కేటీఆర్.. ఆ నిధులతో ఎన్నో పనులు చేసిందని వ్యాఖ్యానించారు. రైతు బంధు, కాళేశ్వరం ప్రాజెక్టు, 32 జిల్లాలో కలెక్టరేట్లు నిర్మించిందని చెప్పారు. అదే సమయంలో హైదరాబాద్ లో ఏకంగా 42 ఫ్లై ఓవర్లను నిర్మించినట్లు కేటీఆర్ స్ఫష్టం చేశారు.

మరోవైపు రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ తిరిగి అధికారంలోకి రావడం ఖాయమని కేటీఆర్ స్పష్టం చేశారు. 2028 నాటికి రాజకీయం ఏటీఎం గడువు ముగుస్తుందని ఎద్దేవా చేశారు. సీఎం రేవంత్ ఢిల్లీ పర్యటనలకు సంబంధించి పదికి పది మార్కులు ఇవ్వొచ్చని సెటైర్లు వేశారు. అయితే గత ఎన్నికల్లో బీఆర్ఎస్ 1.85 శాతం ఓట్ల తేడాతోనే ఒడిపోయిందని కేటీఆర్ అన్నారు. అరచేతిలో ప్రజలకు స్వర్గం చూపించి.. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందన్నారు. ఈసారి ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా ప్రజలు బీఆర్ఎస్ కు పట్టం కడతారని కేటీఆర్ దీమా వ్యక్తం చేశారు.

Advertisement

Also Read: విశాఖకు బే-టెక్ హంగులు.. సైబరాబాద్ తరహాలో అభివృద్ధి.. సీఎం చంద్రబాబు మాస్టర్ ప్లాన్!

మరోవైపు రాష్ట్రంలో కమిషన్ల పేరిట భారీగా దోపిడి జరుగుతోందని కేటీఆర్ అన్నారు. ఈ విషయాన్ని కాంగ్రెస్ ఎమ్మెల్యే చెబుతున్నారని పేర్కొన్నారు. అటు సీఎం అమెరికా, దావోస్ పర్యటన సందర్భంగా.. రాష్ట్రానికి వచ్చిన పెట్టుబడులు ఎన్నో చెప్పాలని కేటీఆర్ నిలదీశారు. ఎంత మంది యువతకు ఉపాధి వచ్చిందో చెప్పాలన్నారు. తాజాగా నిర్వహించిన భారత్ సమ్మిట్ 2.0 కు ఖజానా నుంచి రూ.100 కోట్లు ఖర్చు చేసిందని.. దాని వల్ల తెలంగాణ ఏం లాభపడిందో చెప్పాలని ప్రశ్నించారు.

Advertisement

Also Read: పాక్ మంత్రికి కేంద్రం షాక్.. తాజ్‌మహల్‌కు నో ఎంట్రీ.. షాంఘై సదస్సుకే పరిమితం!

Tags

Related News

హెచ్‌సీయూలో ఫుడ్ పాయిజన్.. 30 మందికి పైగా విద్యార్థులకు అస్వస్థత

ప్రగతినగర్ వాసులకు గుడ్ న్యూస్.. అంబీర్ చెరువు పనులు షురూ!

సాగర్‌ వివాదంలో అసలు దోషులెవరు? అధికారులదా.. ప్రభుత్వానిదా?

‘విదేశీ గడ్డపై భారత్ పరువు తీస్తున్నారు’.. రాహుల్‌ గాంధీపై కిషన్ రెడ్డి ధ్వజం!

మంత్రులు, సీఎం తీరుపై ఎమ్మెల్యేల అసంతృప్తి నిజమేనా? 27న సందీప్ ముందు తేలనున్న లెక్క!

అక్రమ అండాల కేసులో హైకోర్టు సీరియస్.. ఐవీఎఫ్ కేంద్రాల తీరుపై తీవ్ర ఆగ్రహం

ఉపాధి కోసం వచ్చిన యువతిపై అఘాయిత్యం.. నిందితుడికి 20 ఏళ్ల జైలు శిక్ష!

Big Stories

Advertisement
×