Qi Symbol: ఫోన్ ఛార్జర్‌పై Qi అనే గుర్తు కనిపిస్తే చాలామంది దాని అర్థం ఏమిటని ఆలోచిస్తారు. ముఖ్యంగా వైర్‌లెస్ ఛార్జర్‌లు, కార్ ఛార్జింగ్ ప్యాడ్‌లపై ఈ గుర్తు ఎక్కువగా కనిపిస్తుంది. Qi అంటే వైర్‌లెస్ ఛార్జింగ్ కోసం ఉపయోగించే ఒక సాధారణ ప్రమాణం. అంటే.. ఈ గుర్తు ఉన్న ఛార్జర్‌తో Qi సపోర్ట్ చేసే ఫోన్‌ను కేబుల్ లేకుండానే ఛార్జ్ చేయవచ్చు. ఛార్జర్ నుంచి ఫోన్‌కు విద్యుదయస్కాంత శక్తి ద్వారా పవర్ చేరుతుంది. అందుకే వేర్వేరు కంపెనీల ఫోన్లు, ఛార్జర్లు ఒకదానితో ఒకటి పనిచేసే అవకాశం ఉంటుంది.
Qi టెక్నాలజీలో ఛార్జర్‌లోని ట్రాన్స్‌మిటర్, ఫోన్‌లోని రిసీవర్ మధ్య విద్యుదయస్కాంత ఇండక్షన్ జరుగుతుంది. ఫోన్‌ను ఛార్జింగ్ ప్యాడ్‌పై సరైన స్థానంలో ఉంచినప్పుడు పవర్ ఫోన్ బ్యాటరీకి చేరుతుంది. ఈ టెక్నాలజీని వైర్‌లెస్ ఛార్జింగ్‌గా మనం పిలుస్తాం. Qi రాకముందు కొన్ని కంపెనీలు తమ సొంత టెక్నాలజీలను ఉపయోగించేవి. Powermat, Palm Touchstone వంటి ప్రమాణాలు కూడా ఉన్నాయి. అయితే మార్కెట్‌లో ఎక్కువగా అందుబాటులోకి వచ్చినది Qi కావడంతో చివరికి అదే ప్రధాన ప్రమాణంగా మారింది.
2010లో వచ్చిన మొదటి Qi ప్రమాణం కేవలం 5W పవర్‌తో పనిచేసేది. తర్వాత ఛార్జింగ్ స్థిరత్వం, భద్రత, ఇతర వస్తువులను గుర్తించే సదుపాయాలు మెరుగయ్యాయి. 2017లో వచ్చిన EPP ద్వారా కొన్ని డివైజ్‌లలో 15W వరకు ఫాస్ట్ వైర్‌లెస్ ఛార్జింగ్ సాధ్యమైంది. 2023లో Qi2 వచ్చింది. ఇందులో మ్యాగ్నెటిక్ అలైన్‌మెంట్ ఉండటంతో ఫోన్, ఛార్జర్ కరెక్టుగా ఒకే స్థానంలో ఉండేలా సహాయపడుతుంది. 2025లో Qi2 25W రూపంలో మరింత ముందుకు వెళ్లింది.
ఫోన్‌ను బయటకు చూసి Qi సపోర్ట్ ఉందో గుర్తించడం సాధ్యం కాదు. అందుకే ఫోన్ బాక్స్, యూజర్ మాన్యువల్ లేదా కంపెనీ అధికారిక స్పెసిఫికేషన్లను చూడాలి. అక్కడ Qi లేదా Qi2 సపోర్ట్ గురించి వివరాలు ఉంటాయి. ముఖ్యంగా ఫోన్ ఎంత వాట్ల వైర్‌లెస్ ఛార్జింగ్‌కు మద్దతు ఇస్తుందో కూడా తెలుసుకోవడం మంచిది.
Qi సపోర్ట్ ఉన్న ఫోన్‌ను సాధారణ Qi ఛార్జర్‌తో ఛార్జ్ చేయవచ్చు. కానీ ఫోన్ కంపెనీలు అందించే ప్రత్యేక వైర్‌లెస్ ఛార్జింగ్ టెక్నాలజీలతో ఎక్కువ స్పీడ్ లభించొచ్చు. ఉదా: OnePlus ఫోన్లలో AirVOOC వంటి టెక్నాలజీలు వేగంగా ఛార్జ్ చేయడానికి ఉపయోగపడతాయి. కాబట్టి ఫోన్‌కు గరిష్ఠ ఛార్జింగ్ స్పీడ్ కావాలంటే.. కంపెనీ సూచించిన అనుకూల ఛార్జర్‌ను ఉపయోగించడం మంచిది. సాధారణ Qi ఛార్జర్ మాత్రం దాని సామర్థ్యానికి తగ్గట్టుగానే పవర్ ఇస్తుంది. అందుకే ఛార్జర్ కొనేటప్పుడు Qi వెర్షన్, పవర్ సామర్థ్యం, మీ ఫోన్‌కు ఉన్న సపోర్ట్‌ను ఒకసారి చెక్ చేస్తే సరైన ఛార్జర్‌ను ఎంచుకోవచ్చు.