BigTV English

KTR Admits BRS Fault | కేసీఆర్ ఏకపక్ష నిర్ణయాలే ఓటమికి కారణం.. కేటీఆర్ అంగీకరించినట్లే!

KTR Admits BRS Fault | తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బిఆర్ఎస్ ఓటమికి కేసీఆర్ ఏకపక్ష నిర్ణయాలే కారణమని క్రమంగా బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అంగీకరిస్తున్నటలు తెలుస్తోంది. త్వరలో జరిగబోయే లోక్ సభ ఎన్నికలకు పార్టీని సంసిద్ధం చేయాలని ఆయన ఇటీవల పార్టీ కార్యకర్తలతో సమావేశాలు నిర్వహిస్తాన్నారు. ఈ క్రమంలో అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఓటమికి గల కారణాలను బయటపెడుతున్నారు.

KTR Admits BRS Fault | కేసీఆర్ ఏకపక్ష నిర్ణయాలే ఓటమికి కారణం.. కేటీఆర్ అంగీకరించినట్లే!
Political news in telangana

KTR Admits BRS Fault(Political news in telangana):


తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బిఆర్ఎస్ ఓటమికి కేసీఆర్ ఏకపక్ష నిర్ణయాలే కారణమని క్రమంగా బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అంగీకరిస్తున్నటలు తెలుస్తోంది. త్వరలో జరిగబోయే లోక్ సభ ఎన్నికలకు పార్టీని సంసిద్ధం చేయాలని ఆయన ఇటీవల పార్టీ కార్యకర్తలతో సమావేశాలు నిర్వహిస్తాన్నారు. ఈ క్రమంలో అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఓటమికి గల కారణాలను బయటపెడుతున్నారు.

ఆ కారణాలలో ప్రథమంగా పార్టీ పేరుని టిఆర్ఎస్ నుంచి బిఆర్ఎస్‌గా మార్చడమే జరిగిన పెద్ద తప్పు అని సీనియర్ నేత ఖానాపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి ద్వారా చెప్పించారు. ఈ పార్టీ పేరు మర్చే నిర్ణయం కేసీఆర్ ఏకపక్షంగా తీసుకున్నది. అలాగే దళిత బంధు పథకంతో భారీ ఓట్లు దండుకోవచ్చని భావించినా.. దాని అమలులో సరిగా జరగలేదని చెప్పారు. ఈ పథకం ద్వారా కొందరు మత్రమే లాభపడ్డారు. చాలామంది దరఖాస్తుదారులకు ప్రభుత్వం మొండి చెయ్యి చూపడంతో వారందరూ అధికార బీఆర్ఎస్‌పై కోపంతో ఎన్నికల్లో ఇతర పార్టీలకు ఓటు వేసినట్లు తెలిపారు.


అలాగే రైతు బంధు పథకం ఫలాలు వందల ఎకరాలున్న భూస్వాములకు, వ్యవసాయం చేయని బీడు భూముల యజమానులు పొందుతున్నారని ప్రతిపక్ష పార్టీలు చెబుతున్నా కేసీఆర్ సర్కార్ పెడచెవిన పెట్టాయి. ఇప్పుడు మాత్రం బడా భూస్వాములకు రైతు బంధు పథకం ఇవ్వడం తప్పేనని అంగీకరిస్తున్నారు.

ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలు తమ నియోజకవర్గంలోని సమస్యలు చెప్పుకుందామని ప్రయత్నిస్తే.. కేసీఆర్, కేటీఆర్ అందుబాటులో ఉండేవారు కాదు. కానీ ఇప్పుడు మాత్రం కేటీఆర్ కార్యకర్తలు, ఎమ్మెల్యేలు అందరితో కలుస్తూ ఉంటామని, తరచూ సమావేశాలు నిర్వహించి వారి అభిప్రాయాలు తెలుసుకుంటామని చెబుతున్నారు.

తాము చేసిన తప్పులు ఇప్పుడు ఒక్కొక్కటిగా ఒకవైపు అంగీకరిస్తూనే.. బీఆర్ఎస్ 39 సీట్లు వచ్చాయి కాబట్టి కాంగ్రెస్ కాదు మేమే గెలిచామని చెప్పుకుంటున్నారు. పైగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చేసి.. కేసీఆర్ సినిమా చూపిస్తారని బెదిరిస్తున్నారు. ఇలా చెప్పడం ఒక రకంగా అహంకారమే. ఈ అహంకారమే బీఆర్ఎస్ ఓడిపోవడానికి అన్ని కారణాల కంటే అతి ముఖ్యమైనది. తమ తప్పులు తెలుసుకోవడమే కాదు వాటిని సరిదిద్దుకోవాలి. మరి లోక్ సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ భవిష్యత్తు ఎలా ఉంటుందో చూద్దాం.

Related News

TGPSC Group-1: గ్రూపు-1 వివాదం కీలక మలుపు.. హైకోర్టులో మరో అప్పీలు

Medaram Maha Jatara: మేడారం మహాజాతర డిజిటల్ మాస్టర్ ప్లాన్ విడుదల

Sammakka-Saralamma: వనదేవతలు సమ్మక్క- సారలమ్మలు అన్ని గమనిస్తున్నారు.. కేంద్రంపై సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు

CM Revanth Reddy: సమ్మక్క-సారక్కలకు నిలువెత్తు బంగారం సమర్పించిన సీఎం రేవంత్

Heavy Rains: మరో అల్పపీడనం.. నాలుగు రోజులు వర్షాలు దంచుడే దంచుడు..

Hyderabad News: పండగ సమీపిస్తున్న వేళ.. జోరుగా నాన్ డ్యూటీ లిక్కర్, అధికారులు ఉక్కుపాదం

Hyderabad News: హైదరాబాద్‌ వాసులకు సూచన.. ఆ ప్రాంతాల్లో 24 గంటలపాటు తాగునీటి సరఫరా బంద్

Medaram: నేడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మేడారం పర్యటన

Big Stories

×