E-Paper

BRS Strategy: రాష్ట్రంలో గులాబీ దళం సరికొత్త వ్యూహం.. టార్గెట్ 6 నెలలు..?

BRS Strategy: రాష్ట్రంలో గులాబీ దళం సరికొత్త వ్యూహం.. టార్గెట్ 6 నెలలు..?
Advertisement

BRS Strategy: స్వేచ్ఛ బ్యూరో: గత పాలనలో ప్రజలకు మా పైన కొన్ని అంశాల్లో అసంతృప్తి ఉన్నది. ప్రజలు సూచించిన లోపాలను సరిచేసుకొని ముందుకు పోతున్నాం. ఆత్మపరిశీలన చేసుకున్నాము. పార్టీ నాయకత్వం నుంచి కింది కార్యకర్త వరకు ప్రతి ఒక్కరం ఆత్మవిమర్శ చేసుకొని ముందుకు పోతున్నాము. గతంలో జరిగిన పొరపాట్లు భవిష్యత్తులో జరగకుండా ఉంటాయి. అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు.

గులాబీ దళం సరికొత్త వ్యూహాం..

రాష్ట్రంలో తిరిగి పూర్వవైభవాన్ని సంతరించుకోవడమే లక్ష్యంగా గులాబీ దళం సరికొత్త వ్యూహాలకు పదును పెడుతోంది. గత ఎన్నికల ఫలితాల అనంతరం క్యాడర్‌లో నెలకొన్న నైరాశ్యాన్ని తొలగించి, పార్టీని క్షేత్రస్థాయి నుంచి పునర్నిర్మించేందుకు ‘టార్గెట్ 6 నెలలు’ యాక్షన్ ప్లాన్‌ను సిద్ధం చేసింది. రాబోయే ఆరు నెలల కాలంలో పార్టీని తిరుగులేని శక్తిగా మార్చడమే ధ్యేయంగా సభ్యత్వ నమోదు, కమిటీల పునర్వ్యవస్థీకరణ, కేడర్‌కు శిక్షణ కార్యక్రమాలపై బీఆర్‌ఎస్ అధిష్టానం ప్రత్యేక దృష్టి సారించింది. ఒకవైపు అంతర్గతంగా పార్టీని పటిష్టం చేసుకుంటూనే, మరోవైపు ప్రస్తుత ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడమే లక్ష్యంగా ద్విముఖ వ్యూహాన్ని రచిస్తోంది.

నూతన కమిటీలు..

Advertisement

పార్టీకి అసలైన బలం కార్యకర్తలే అనే భావనతో, త్వరలోనే రాష్ట్రవ్యాప్తంగా విస్తృత స్థాయిలో సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. సభ్యత్వం పూర్తయిన వెంటనే గ్రామ, మండల, నియోజకవర్గ, జిల్లా స్థాయిల్లో నూతన కమిటీలను నియమించేందుకు సిద్ధమవుతుంది. క్రియాశీలకంగా పనిచేసే నాయకులకు మాత్రమే కమిటీల్లో ప్రాధాన్యత దక్కనుంది. పార్టీ కోసం పనిచేసే వారికే సభ్యత్వాలు ఇవ్వబోతున్నారు. గత ఎన్నికల అనంతర పరిణామాలను విశ్లేషించుకున్న పార్టీ నాయకత్వం, ఈ ఆరు నెలల కాలంలో పార్టీ నిర్మాణాన్ని సమూలంగా మార్చాలని నిర్ణయించింది. పాత, కొత్త కలయికతో బూత్ స్థాయి కమిటీలను పునర్వ్యవస్థీకరిస్తారు.

Also read: కోమటిరెడ్డి బ్రదర్స్.. కాంగ్రెస్ మార్క్ మంత్రి మార్పు..!

డిజిటల్ గుర్తింపు కార్డులు..

Advertisement

పార్టీ కోసం అహర్నిశలు శ్రమించే ముఖ్య కేడర్‌ను గుర్తించి, వారికి ప్రత్యేకంగా డిజిటల్ గుర్తింపు కార్డులను పంపిణీ చేయనున్నారు. ఇది కార్యకర్తల్లో నూతనోత్తేజాన్ని, పార్టీ పట్ల యాజమాన్య భావాన్ని పెంచుతుందని అధినాయకత్వం భావిస్తోంది. గతంలో కంటే భిన్నంగా ఈసారి శిక్షణా తరగతులను హైదరాబాద్‌కే పరిమితం చేయకుండా, అన్ని జిల్లా కేంద్రాల్లోని పార్టీ కార్యాలయాల్లోనే నిర్వహించాలని నిర్ణయించారు.పార్టీ సిద్ధాంతాలు, గత ప్రభుత్వ హయాంలో జరిగిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజల్లోకి ఎలా తీసుకెళ్లాలో ఈ శిక్షణలో వివరిస్తారు. సబ్జెక్టు నిపుణులతో శిక్షణ ఇవ్వనున్నారు. సోషల్ మీడియాను సమర్థవంతంగా వాడుకుంటూ, విపక్షాల విమర్శలను తిప్పికొట్టేలా కేడర్‌ను సన్నద్ధం చేయబోతున్నారు. ఇకపై జిల్లాల్లోనేముఖ్య నేతలంతా అందుబాటులో ఉంటూ, స్థానిక కార్యకర్తలకు నిరంతరం దిశానిర్దేశం చేసేలా ప్రణాళికలు రూపొందించిన్నట్లు సమాచారం.

ప్రభుత్వ వైఫల్యాలపై ‘గులాబీ’ గళం!

ఒకవైపు పార్టీ అంతర్గత బలోపేతంపై దృష్టి పెడుతూనే… మరోవైపు ప్రస్తుత ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టేందుకు బీఆర్‌ఎస్ యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసింది. ఎన్నికల సమయంలో ఇచ్చిన గ్యారంటీలు, హామీల అమలులో ప్రభుత్వం విఫలమైందనే అంశాన్ని ప్రధాన అస్త్రంగా మార్చుకోబోతుంది. ప్రజా సమస్యలపై పోరాటాలు: రైతాంగ సమస్యలు, రుణమాఫీలో జాప్యం, నిరుద్యోగ భృతి, శాంతిభద్రతల వంటి అంశాలపై క్షేత్రస్థాయిలో ప్రజల పక్షాన నిలబడి పోరాటాలు, ధర్నాలు నిర్వహించేందుకు రూట్ మ్యాప్ సిద్ధం చేస్తున్నారు. అంతర్గతంగా సంస్థాగత బలోపేతం బహిరంగంగా ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలపై రాజీలేని పోరాటం.

రెండంచుల వ్యూహం..

ఈ రెండంచుల వ్యూహంతో రాబోయే ఆరు నెలల్లో తెలంగాణ రాజకీయాల్లో మళ్లీ గులాబీ జెండాను రెపరెపలాడించాలని బీఆర్‌ఎస్ గట్టి పట్టుదలతో ఉంది. ప్రజా పోరాటాలు ప్రభుత్వ వైఫల్యాలు పై నిరంతరం గలం పాలని భావిస్తూ ధర్నా చౌకు లో, కలెక్టరేట్ల ధర్నాలు.. నిరసన కార్యక్రమాలు.. చేపడుతూ క్యాడర్లోని అసంతృప్తిని పోగొట్టేందుకు పార్టీలో తబ్దతకు తెరదించుతూ రాబోయే ఆరు నెలల్లో సరికొత్త జోష్తో ప్రజల్లోకి వెళ్ళేందుకు గులాబి పార్టీ వ్యూహాత్మక అడుగులు వేస్తుంది. ఆరు నెలల టార్గెట్ పార్టీ భవిష్యత్తుకు దిక్సూచిగా మారబోతుందని నేతలు అభిప్రాయపడుతున్నారు.

Also read: ఫ్యూచర్ కార్ల కోసం మారుతి AI వ్యూహం.. ఇక కొత్త మోడల్స్ తయారీ మరింత వేగవంతం!

Related News

కాంగ్రెస్, బీఆర్ఎస్ ఒక్క ఇల్లు కూడా కట్టలేదు.. అంబర్‌పేట వేదికగా కిషన్ రెడ్డి ధ్వజం!

అవసరమైతే నేనూ రోడ్డు మీదికి వస్తా.. అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్!

మహిళలను కోటీశ్వరులను చేస్తే రాజీనామా చేస్తా.. రేవంత్‌కు కేటీఆర్ సవాల్!

నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. రాహుల్ గాంధీ బర్త్‌డే వేళ గాంధీ భవన్‌కు 100 కంపెనీలు!

బిఆర్ఎస్ ఓట్లు లేపేయడమే కాంగ్రెస్, బిజేపి టార్గెట్.. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సంచలనం!

ఓటర్ల జాబితాపై కాంగ్రెస్ స్పెషల్ ఫోకస్.. ఇబ్రహీంపట్నంలో ఎంపీ చామల కీలక వ్యాఖ్యలు!

Telangana Health: ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో ఆరోగ్య శాఖ మార్క్.. రికార్డు స్థాయిలో పూర్తి చేసిన పనులివే..?

హైదరాబాద్‌లో కాక్రోచ్ జనతా పార్టీ నిరసన.. విద్యార్థులు, యువత రాక, ​పేపర్ లీకేజీలపై ఆగ్రహం

×