E-Paper
Advertisement

ఈవీఎంల విశ్వ‌స‌నీయత‌పై అందుకే అనుమానాలు! పేప‌ర్ బ్యాలెట్ విధానాన్ని ప‌ట్టించుకునేవారెక్క‌డా?

ఈవీఎంల విశ్వ‌స‌నీయత‌పై అందుకే అనుమానాలు! పేప‌ర్ బ్యాలెట్ విధానాన్ని ప‌ట్టించుకునేవారెక్క‌డా?
Advertisement

ప‌శ్చిమ బెంగాల్‌ అగ్ని ప్ర‌మాదంలో 4వేల ఈవీఎంలు ద‌గ్ధం కావ‌డం.. ఈవీఎంల విశ్వ‌స‌నీయ‌త‌పై మ‌ళ్లీ అనుమానాల‌ను రేకెత్తించింది. ముందు నుంచి ఇక్క‌డ మ‌మ‌త బెన‌ర్జీ ఆరోపిస్తున్న ప్ర‌ధాన ఇష్యూ ఇదే. ఇప్ప‌డు ఏకంగా ఇవే త‌గుల‌బ‌డ్డాయి అంటే.. దీని వెనుక ఎవ‌రి హ‌స్త‌మైనా ఉందా? అస‌లు ఇవి కావాల‌నే కాల్చేశారా? అనే అనుమానాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. ఈ ఘ‌ట‌న ఈవీఎంల విశ్వ‌సనీయ‌త‌పైనే కాదు.. కేంద్ర ప్ర‌భుత్వం తీరుపైనా అనుమానాల‌ను రేకెత్తిస్తున్నాయి. ఈవీఎంలు ట్యాంప‌రింగ్ అవుతున్నాయ‌నేది అన్నీ పార్టీలు గ‌గ్గోలు పెట్టే అంశ‌మే.

ఒక్క అధికారంలో ఉన్న పార్టీ త‌ప్ప‌.. మిగిలిన ప్ర‌తిప‌క్షాల‌న్నీ దీనిపై అనుమానాలు వ్య‌క్తం చేస్తున్నాయి. ప‌శ్చిమ‌బెంగాల్‌లో స‌ర్ విధానం ద్వారా దాదాపు 90 ల‌క్ష‌ల ఓట‌ర్ల‌ను తొల‌గించార‌నేది ఓ కార‌ణ‌మైతే.. అక్క‌డి సీఎం.. మ‌మ‌త బీజేపీ ఈవీఎంల ట్యాప‌రింగుకు పాల్ప‌డింద‌ని ఓపెన్‌గానే ఆరోప‌ణ‌లు చేశారు. అవి భ‌ధ్ర‌పరిచిన భ‌వనాన్ని త‌గిన కాప‌లా కాయ‌ల‌న్నారు. ఏవేవోచేసినా.. అంతిమంగా ఆమె అనుకున్న‌ట్టే జ‌రిగింది. ఓడిన త‌రువాత కూడా దీన్ని బ‌లంగా తీసుకుపోగ‌లిగింది మ‌మ‌త‌. కానీ ఆమె వేద‌న అర‌ణ్య రోద‌నే అయ్యింది.

Advertisement

తాజాగా ఆ అగ్ని ప్ర‌మాదం అనేక అనుమానాల‌కు తావిస్తోంది. మ‌ళ్లీ ఈవీఎం ట్యాంప‌రింగ్ ఇష్యూను బ‌య‌ట‌కు తీసుకురాగా.. పేప‌ర్ బ్యాలెట్ విధానం పై చ‌ర్చ వ‌చ్చేలా చేసింది. ఈ ఘట‌న‌ అంద‌రినీ అల‌ర్ట్ చేసింద‌నే చెప్పాలి. ప‌దే ప‌దే మోడీ, అమిత్ షాలు త‌మ పార్టీ నేత‌ల‌కు చెబ‌తూ ఉంటారు. ముందు మీరు.. మ‌న పార్టీని మూడు, నాలుగు స్థానాల నుంచి రెండో స్థానానికి తీసుకురండి.. మొద‌టి స్థానానికి ఎలా తీసుకురావాలో మాకు తెలుసు అని. అంటే మొత్త‌మే ఆ రాష్ట్రంలో పార్టీ ఉనికిలో లేకుండా ఉండి…ఒక్క‌సారిగా గెలిచి అధికారం సాధిస్తే ఎవ‌రికైనా అనుమానం వ‌స్తుంది.

అందుకే ఈ విధ‌మైన గేమ్ ప్లే చేస్తుందా అని ప్ర‌తిప‌క్షాలు దుమ్మెత్తి పోస్తున్నాయి. బీజేపీ ఏం చేసినా..మోడీ ఏం చేసినా.. అది దేశం కోసం, ధ‌ర్మం కోసం అనే ట్యాగ్‌లైన్ బ‌లంగా తీసుకుపోవ‌డం మూలంగా చాలా సందర్బాల్లో ప్ర‌జాస్వామ్యం కంటే.. ఇక్క‌డ ఈ నినాదాలే బ‌లంగా పనిచేస్తున్నాయ‌నిపిస్తోంది. అంత‌లా బ‌లంగా జనాల‌ను త‌మ వైపున‌కు తిప్పుకోగ‌లిగింది మోడీ మానియా. ఇందులో డౌట్ లేదు. ఈవీఎంల ట్యాంప‌రింగు విష‌యంలో బీజేపీ పై మొద‌టి నుంచి అనుమానాలున్నాయి అంద‌రికీ. బాహాటంగానే దీనిపై మాట్లాడుతున్నా.. ఇది పాత చింత‌కాయ ప‌చ్చ‌డిలాగే అయ్యింది త‌ప్ప‌. సీరియ‌స్‌గా ఎవ‌రూ తీసుకోవ‌డం లేదు.

Advertisement

పేప‌ర్ బ్యాలెట్ విధానంపై ఒత్తిడి పెంచిన‌ట్టే పెంచిన ప్ర‌తిప‌క్షాలు ఆ త‌రువాత సైలెంట్ అయ్యాయి. అభివృద్ది చెందిన దేశాలే ఈవీఎంల‌ను తిర‌స్క‌రించి.. పేప‌ర్ బ్యాలెట్‌కు పోతున్నాయ‌ని, మ‌న‌మెందుకు పోవ‌ద్ద‌నే డిమాండ్‌లు, నిర‌స‌న‌లు వ్య‌క్త‌మ‌వుతున్నా కేంద్రం దీనిపై నోరు మెద‌ప‌డం లేదు. తాజాగా బెంగాల్ ఘ‌ట‌న‌తో ఇది మ‌ళ్లీ చ‌ర్చ‌కు తెర‌లేపింది. ఇంకా దీనిపై ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షాలు ఆరోప‌ణ‌లు చేయ‌లేదు. కానీ ఆ ఇష్యూను కూడా ఇంత వ‌ర‌కు ట‌చ్ చేయ‌క‌పోవ‌డం.. ఆ పార్టీలు ఈ విష‌యాన్ని లైట్‌గా తీసుకున్నాయా? అనే చ‌ర్చా న‌డుస్తున్న‌ది.

Related News

బొద్దింక‌ల ఎఫెక్ట్‌.. జంత‌ర్‌మంత‌ర్ ఎత్తేయ‌లేదు.. కానీ కండిష‌న్స్ అప్లై.. !

నన్ను మించిన‌ విద్యాశాఖ మంత్రి ఉన్న‌డా? పాస్ మార్కులు వేసిండ్రు.. ఇదే ప‌నితీరుకు గీటురాయి!

హైడ్రాను పీకి అవ‌త‌ల పాడేస్తాం.. బీఆరెస్ స్టాండ్ క‌రెక్టేనా? జ‌నామోదం ఎంత‌? సిటీ ఈ దుస్థితికి కార‌ణం ఎవ‌రు?

బీజేపీ నేత‌ల‌ది జెన్‌బీ మంత్రం… ఓటు బ్యాంకును సంతృప్తి ప‌రిచేందుకు తిక్క మాట‌లు త‌ప్ప‌వు మ‌రి!

మాకూ కావాలి బుల్డోజ‌ర్లు.. జిల్లాల నుంచి హైడ్రాకు డిమాండ్…! ఇదో కొత్త కోణం..

వాన‌ల మురిపెం.. వ‌రేసుకుంటే బ‌త‌కం! పెడచెవిన పెడుతున్న రైతు..

లేడీ సివంగులు.. ఆ ఇద్ద‌రు ఐఏఎస్ ఆఫీస‌ర్లు.. క‌బ్జాల‌పై బుల్డోజ‌ర్లు ఎక్కించి..!

హైడ్రా ఆగ‌దు.. మీ ఆట‌లు సాగ‌వు! రంగ‌నాథే ఉంట‌డు.. క‌బ్జాదారుల ప‌ని ప‌డ‌త‌డు!

Big Stories

Advertisement
×