E-Paper
Advertisement

KTR Clarification: డ్రామా ఓపెన్, నిజాలు భయట పెట్టిన కేటీఆర్

KTR Clarification: డ్రామా ఓపెన్, నిజాలు భయట పెట్టిన కేటీఆర్
Advertisement

KTR Clarification: రాజకీయాలు విచిత్రంగా వుంటాయి. సీనియర్ నేతలకు తప్పా, మిగతావారికి అస్సలు అర్థం కాదు. ఎవరు ఎప్పుడు ఏ పార్టీలో ఉంటారో తెలీదు. ముఖ్యనేతలు ఎలాంటి ఎత్తులు వేస్తారో తెలీదు. ఒక్కోసారి కావాలనే ఫీలర్ ఇచ్చి నేతల నాడిని పసిగడతారు. ఈ విషయంలో కేసీఆర్‌కు తిరుగులేదన్నది తెలంగాణలో సీనియర్ నేతల మాట.

కేసీఆర్ రాజకీయాలు మామూలుగా ఉండవు. ప్లాన్ చేశారంటూ ఎలాంటి పార్టీ, నేతలయినా ఆయన బుట్టలో పడాల్సిందే. ఈ విషయాన్ని తెలంగాణలో కాకలు తీరిన రాజకీయ నేతలు అప్పుడప్పుడు చెబుతున్నారు. ఆగస్టు 15న బీఆర్ఎస్ ఆఫీసులో కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. సంచలన విషయాలు బయటపెట్టారు.

Advertisement

బీఆర్ఎస్ పార్టీ విలీనంపై క్లారిటీ ఇచ్చేశారు కేటీఆర్. బీజేపీతో చీకటి ఒప్పందం ఉంటే ఐదు నెలలు కవిత జైలులో ఉండేదా? అని అన్నారు. కవిత బెయిల్ కోసం ఢిల్లీ వెళ్తే..బీజేపీతో చీకటి ఒప్పందాలు చేసుకున్నా రంటూ జరుగుతున్న ప్రచారానికి ఫుల్‌స్టాప్ పెట్టేశారు. ఈ విషయం బీజేపీ నేతలకు బాగానే అర్థమైంది.

ALSO READ: వరలక్ష్మీ వ్రతం ఎఫెక్ట్..భారీగా పెరిగిన పూల ధరలు

Advertisement

కొద్దిరోజుల కిందట కేటీఆర్, హరీష్‌రావు ఢిల్లీ వెళ్లారు. కవిత బెయిల్ కోసం సీనియర్ అడ్వకేట్లతో మంత నాలు జరిపారు. అదే సమయంలో బీఆర్ఎస్ నుంచి ఓ ఫీలర్ బయటకువచ్చింది. బీజేపీలో విలీనం కోసం బీఆర్ఎస్ కీలక నేతలు చర్చలు జరుపుతున్నారని అందులోని సారాంశం. ఆ విషయం లీక్ చేసిందే బీఆర్ఎస్ నేతలు. పైగా దానికి కాంగ్రెస్ నేతలకు లింకు చేసే ప్రయత్నం చేశారు కేటీఆర్. ఇదంతా కేసీఆర్ మార్క్ రాజకీయాలని అంటున్నారు కాంగ్రెస్ నేతలు.

తెలంగాణ బీజేపీ నేతలను ఏమాత్రం నోరెత్తకుండా కేసీఆర్ వేసిన ప్లాన్‌లో భాగమేనన్నది కాంగ్రెస్ నేతల మాట. ఈ క్రమంలో కొద్దిరోజులుగా బీజేపీ నేతలు సైలెంట్‌గా ఎందుకు ఉన్నారని అంటున్నారు. ఒకప్పుడు బీజేపీ నేతలు ఒంటికాలి మీద లేచి కారు పార్టీపై విరుచుకుపడేవారు. ఇప్పుడు వారంతా సైలెంట్ అయ్యా రు. మరి దీనికి కారణమేంటన్నది అసలు ప్రశ్న. నిప్పు లేనిదే పొగరాదని.. కేసీఆర్ మార్క్ రాజకీయా లంటే ఇలాగే ఉంటాయని అంటున్నారు కాంగ్రెస్ వాదులు.

Related News

హైదరాబాద్ MVSR కాలేజీ దాండియా వేడుకల్లో ఘోర ప్రమాదం.. ఇద్దరు మృతి!

క్యూనెట్ రూ.10,000 కోట్ల కుంభకోణం.. మరో కీలక నిందుతుడు అరెస్ట్?

వాహన ఫిట్‌నెస్ టెస్ట్ విధానంలో.. తెలంగాణ సర్కార్ కీలక మార్పులు..?

మూసీ తరహాలోనే హుస్సేన్ సాగర్ ప్రక్షాళన.. సర్కార్ సంచలన నిర్ణయం!

తెలంగాణ ప్రభుత్వ ఆఫీసుల్లో.. ఏసీల వాడకం పై కొత్త రూల్స్ ఇవే..?

విద్యాసంస్థల్లో దాడులా.. కాంగ్రెస్ అనుబంధ సంఘాలకు పీసీసీ మాస్ వార్నింగ్!

గత ఏడాది కంటే భారీగా పెరిగిన విద్యుత్ వాడకం.. ఓక్కరోజులోనే ఇంత వాడేసారా..?

తెలంగాణ నిరుద్యోగులకు భారీ గుడ్ న్యూస్.. రానున్న 2, 3 రోజుల్లో నోటిఫికేషన్!

Big Stories

Advertisement
×