BigTV English

ministers RK Roja : మాజీ మంత్రి రోజా పై సీఐడీ విచారణకు ఆదేశం

ministers RK Roja : మాజీ మంత్రి రోజా పై సీఐడీ విచారణకు ఆదేశం

CID case filed on AP ex ministers RK Roja..Dharmana Krishnadas: మాజీ మంత్రి రోజా.. ఒకప్పటి వెండితెర అందాల రాణి. సినిమాలు, రియాలిటీ షోల తో పాపులర్ అయిన రోజా రాజకీయ రంగంలోనూ ఒక వెలుగు వెలిగారు. మొదట తెలుగు దేశం పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరించిన రోజా.. తర్వాత వైఎస్ జగన్ పార్టీ మారారు. తన నోటి దురుసుతో వివాదాస్పద వ్యాఖ్యలు చేసి గతంలోనూ చిక్కులు కోరి తెచ్చుకున్నారు. చంద్రబాబు నాయుడు జైలులో ఉన్నప్పుడు కూడా ఆయనపై కౌంటర్ ఎటాక్ చేసి తెలుగు తమ్ముళ్ల ఆగ్రహానికి గురయ్యారు. పవన్ కళ్యాణ్ పర్సనల్ లైఫ్ ను సైతం టార్గెట్ చేసి మాట్లాడారు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికలలో ఘోర ఓటమి చవిచూశారు.


ఆడుదాం..అక్రమాలు

రోజా మంత్రిగా ఉండగా ఆడుదాం ఆంధ్రా పేరుతో ఓ కార్యక్రమం నిర్వహించారు. మంత్రి ధర్మాన కృష్ణదాస్ కూడా ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం వహించి అన్నీ దగ్గరుండి చూసుకున్నారు. ఇందు కోసం ఏకంగా రూ.150 కోట్ల మేరకు ఖర్చుపెట్టారు. గ్రామీణ క్రీడలను ప్రోత్సహించే లక్ష్యంతో పూర్తిగా ప్రజాధనంతో ఈ కార్యక్రమం నిర్వహించారు. అయితే ఇందులో భారీ ఎత్తున కుంభకోణం జరిగిందని అప్పట్లో మంత్రులు రోజా, ధర్మానపై టీడీపీ నేతలు అనుమానాు వ్యక్తంచేశారు.
ఆడుదాం ఆంధ్రా అంటూ వైసీపీ నేతలు అరాచకం సృష్టించారని.. అసలైన టాలెంట్ ఉన్న క్రీడాకారులను పక్కన పెట్టి తమ ఇష్టారీతిన ఎంపిక చేసి ఏకపక్షంగా వ్యవహరించారు. పైగా నిధులన్నీ స్వాహా చేశారు. ప్రత్యేకంగా అధికార పక్షం వాళ్లే నియమ నిబంధనలు అమలు చేశారు. పైగా ఆడుదాం ఆంధ్రా కార్యక్రమాన్ని ఎన్నికలలో ప్రచారాస్త్రంగా సైతం ఉపయోగించుకున్నారు.


అరెస్ట్ తప్పదా?

ఇప్పుడు అధికారంలో ఉన్న తెలుగుదేశం నేతలు ఆడుదాం ఆంధ్రా పేరుతో 150 కోట్ల స్కామ్ జరిగిందని మంత్రులు రోజా, ధర్మాన కృష్ణదాస్ అక్రమాలపై చర్యలు తీసుకోవాల్సిందిగా సీఐడీకి ఫిర్యాదు చేశారు. వీగి అక్రమాలపై విచారణ జరిపించేందుకు సీఐడీ సిద్ధమయింది. ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకున్న సీఐడీ శాఖ ఏపీలోని ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ కు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఇక ఏ క్షణమైనా రోజా అరెస్ట్ జరగవచ్చని ప్రచారం జరుగుతోంది.

Related News

AP new rule: ఏపీలో కొత్త రూల్.. పాటించకుంటే జరిమానా తప్పదు!

King cobra sanctuary: ఏపీకి సర్‌ప్రైజ్ గిఫ్ట్.. పెద్ద ఎత్తున కింగ్ కోబ్రాలు వచ్చేస్తున్నాయ్!

Visakha: విశాఖ దుర్ఘటనపై ఎన్నో అనుమానాలు.. గ్యాస్ బండ కాదా, మరేంటి?

Pulivendula: పులివెందులలో హై టెన్షన్.. వివేకానంద పుట్టిన రోజు, సునీత సంచలన వ్యాఖ్యలు

Nara Lokesh: రప్పా రప్పా అంటే రఫ్ఫాడిస్తారు జాగ్రత్త.. లోకేష్ పవర్ ఫుల్ పంచ్

Vizag Harbour News: విశాఖలో ఫిషింగ్ హార్బర్ వద్ద ఘోర ప్రమాదం.. ఐదుగురు అక్కడికక్కడే మృతి!

Big Stories

×