బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు వరుసగా షాకుల మీద షాకులు తగులుతున్నాయి. అసెంబ్లీలో ఆయన మాట్లాడే మాటలు రివర్స్‌లో తిరిగి వస్తున్నట్టు తెలుస్తున్నది.అధికార పక్షాన్ని కట్టడి చేయడానికి ఆయన చేసే ప్రతి విమర్శ మరల ఆయనకే మిస్ ఫైర్ అవుతున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఎందుకుంటే గతంలో పదేండ్లు రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నది. ఆయన సైతం పదేండ్లు కేబినెట్ మంత్రిగా పలు శాఖలు నిర్వహించారు. ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రిగా ఆయన కొనసాగారు.తన హయాంలో జరిగిన అభివృద్ధి ఇప్పుడు లేదని, కేవలం రియల్ ఎస్టేట్ బెదిరింపులు, కమీషన్లు, బిల్డర్ల నుంచి టాక్సులు వసూలు చేసి ఢిల్లీకి సంచుల్లో మూటలు పంపిస్తున్నారని కేటీఆర్ పదే పదే సర్కారు మీద విమర్శలు చేస్తూ వస్తున్నారు.
గత ప్రభుత్వంలో మూసీ సుందరీకరణ కోసం సుమారు రూ.5 వేల నుంచి రూ.10 కోట్ల మేర ఖర్చు చేసినట్టు అప్పట్లో ప్రచారం జరిగింది. దీనిపై నాటి బీఆర్ఎస్ సర్కార్ అంచనాలు ఆమేరకు ఉన్నాయి. డీపీఆర్ సైతం నాడు తయారు చేశామని,మళ్లీ ఇప్పుడు కొత్త డీపీఆర్ అవసరం లేదని కేటీఆరే పలు సందర్భాల్లో అన్నారు. అదే సమయంలో మూసీ సుందరీకరణ పేరిట సర్కారు రూ. వేల కోట్ల వరకు ఖర్చు చేస్తున్నదని ఆయన ఆరోపిస్తుండగా.. ఇటీవల సీఎం రేవంత్ అంచనా వ్యయంపై క్లారిటీ ఇచ్చారు. రూ.7,500 కోట్ల మేర మూసీకి..రూ.75 కోట్లు గాంధీ విగ్రహ ఏర్పాటుకు అని వెల్లడించారు. అయితే, మూసీ పునరుజ్జీవం డీపీఆర్ రెడీ కాకముందే ఎందుకు కూల్చివేతలు చేపడుతున్నారని కేటీఆర్ ప్రశ్నించారు. దీనికి మంత్రి శ్రీధర్ బాబు, భట్టి విక్రమార్క స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. గతంలో రూ. పది వేల కోట్ల వరకు ఖర్చు చేసినా ఎందుకు మూసీ సుందరీకరణ పూర్తి కాలేదని ప్రశ్నించారు. డీపీఆర్ ప్రస్తుతం ప్రిపరేషన్ దశలో ఉందని మంత్రి శ్రీధర్ బాబు క్లారిటీ ఇచ్చారు.
కేటీఆర్ తాను మంత్రిగా ఉన్న సమయంలో ఎన్నో అంతర్జాతీయ సంస్థలు హైదరాబాద్ వచ్చాయని, రూ. లక్షల కోట్ల పెట్టుబడులు తీసుకువచ్చామని పేర్కొన్నారు.కానీ, కాంగ్రెస్ హయాంలో వచ్చిన పెట్టుబడుల మీద క్లారిటీ లేదని, పేరుకే పెట్టుబడులు వచ్చాయని ప్రకటించుకున్నారని, అందులో ఎన్ని కంపెనీలతో ఒప్పందాలు జరిగాయి? ఎన్ని గ్రౌండింగ్ అయ్యాయి? లెక్క చూపించాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. దీనికి ఐటీ మంత్రి శ్రీధర్ బాబు స్పందిస్తూ.. తమ హయాంలో జరిగిన ఎంవోయూలు అన్నింటిని ఆన్‌లైన్‌లో ఉంచామని, కావాలంటే చెక్ చేసుకోవాలని మంత్రి శ్రీధర్ బాబు కేటీఆర్‌కు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.
Komatireddy Venkat Reddy: కాంగ్రెస్‌లో మళ్లీ పీసీసీ చీఫ్ పై చర్చ.. అసలు కోమటిరెడ్డి మాటల వెనుక ఆంతర్యమేంటి?
దీనికి తోడు ఆరు గ్యారెంటీలు, కమీషన్లు, దందాలపైనా కేటీఆర్ చేసిన వ్యాఖ్యలకు మంత్రులు దీటుగా జవాబిచ్చారు. గత పదేండ్లలో రాష్ట్రంలో జరిగిన దోపిడీ కళ్ల ముందే కనిపిస్తున్నదని, కాళేశ్వరం, ఫోన్ ట్యాపింగ్ కేసు, ఈ కార్ ఫార్ములా రేసు కేసు, డ్రగ్స్ కేసులు ఇవన్నీ కళ్లముందే కనిపిస్తున్నాయని, ప్రజలు సైతం చూస్తున్నారని గుర్తుచేశారు. అధికారంలో ఉన్నప్పుడు పేదల ఇండ్లను బీఆర్ఎస్ కూల్చలేదా? కల్వకుంట్ల కుటుంబంలో వారికి ఫాంహౌజ్‌లు ఎలా వచ్చాయని, గతంలో మంత్రులు ఇష్టానుసారంగా ప్రభుత్వ నిధులను దుర్వినియోగం చేశారని, అవినీతి కూడా భారీగా జరిగిందని పేర్కొన్నారు. గత సర్కారు వల్లే ఏపీ, తెలంగాణకు మరోసారి జల వివాదాలు ఏర్పడ్డాయని విమర్శించారు. గత ప్రభుత్వంలో జరిగిన అవినీతి అక్రమాలపై ప్రస్తుతం విచారణ జరుగుతోందని, త్వరలోనే వారికి శిక్ష పడుతుందని మంత్రులు వార్నింగ్ ఇచ్చారు.