BigTV English

KTR: కవితకు ‘మోదీ సమన్లు’.. జుమ్లా-హమ్లా.. ‘మోదానీ’పై కేటీఆర్ విమర్శలు

KTR: కవితకు ‘మోదీ సమన్లు’.. జుమ్లా-హమ్లా.. ‘మోదానీ’పై కేటీఆర్ విమర్శలు

KTR: కేటీఆర్‌లో ఫ్రస్టేషన్ కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. ప్రెస్‌మీట్ పెట్టి మోదీపై తీవ్ర విమర్శలు చేశారు. కవితకు ఈడీ నోటీసులు ఇవ్వడంపై మండిపడ్డారు. కేంద్రం చేతిలో సీబీఐ కీలుబొమ్మ, ఈడీ తోలుబొమ్మ అంటూ ఫైర్ అయ్యారు. ప్రతిపక్షాలపై కేసుల దాడి.. ప్రజలపై ధరల దాడి జరుగుతోందని అన్నారు.


ఎమ్మెల్సీ కవితకు ఇచ్చింది ఈడీ సమన్లు కావని.. అవి మోదీ సమన్లు అంటూ కేటీఆర్ విమర్శించారు. దేశంలో జుమ్లా, లేదంటే హమ్లా నడిపిస్తున్నారని.. 8 ఏళ్లుగా విపక్షాలను టార్గెట్ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటివరకు విపక్షాలపై 5,422 కేసులు పెట్టారని.. బీజేపీలో చేరే విపక్ష నేతలను కేసుల నుంచి విముక్తి చేస్తున్నారంటూ ఏపీకి చెందిన సుజనా చౌదరి, సీఎం రమేశ్ విషయాన్ని గుర్తు చేశారు. బీఆర్ఎస్ నేతలే టార్గెట్‌గా ఇప్పటికే 12 మందిపై ఈడీ, సీబీఐ, ఐటీ దాడులు జరిగాయని మండిపడ్డారు.

బీజేపీ డబుల్ ఇంజిన్ సర్కార్ మోడల్‌పైనా కేటీఆర్ సెటైర్లు వేశారు. ఇక ఇంజిన్ మోదీ అయితే, మరో ఇంజిన్ అదానీ అని.. రెండూ కలిసి డబుల్ ఇంజిన్ ‘మోదానీ’ అంటూ ఫైర్ అయ్యారు.


గౌతమ్ అదానీ ఎవరి బినామీ? ఆయనపై కేసులు, దాడులు ఎందుకు జరగవు? అని కేటీఆర్ ప్రశ్నించారు. అదానీ, మోదీ బినామీ అని.. అది ఆయన సొంత కంపెనీ అని ఆరోపించారు. అదానీ కోసం అనేక పాలసీలు మార్చారని.. అక్రమంగా పోర్టులు, ఎయిర్‌పోర్టులు కట్టబెట్టారని, శ్రీలంకలో ప్రాజెక్ట్ ఇప్పించారని.. అదానీ పోర్టులో డ్రగ్స్ దొరికినా విచారణ ఉండదని.. మోదీ-అదానీలపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు కేటీఆర్.

Related News

Mother’s Love: అమ్మకు ప్రేమతో.. హ్యాపీ మదర్స్ డే..!

Cm Revanth Reddy: నేడు పాల‌మూరుకు సీఎం.. రూ.110 కోట్ల‌తో ఎలివేటెడ్ కారిడార్ రోడ్డుకు శంకుస్థాప‌న‌!

Pawan Kalyan: ఇష్టం వ‌చ్చిన‌ట్టు మాట్లాడితే తొక్కిప‌ట్టి నార‌ తీస్తాం.. రోజా, కోడాలికి ప‌వ‌న్ స్ట్రాంగ్ వార్నింగ్!

Chadrababu Naidu vs YS Jagan: తిరుమల డిక్లరేషన్ రగడ.. గెలిచిందెవరు?

Chiranjeevi: చిరు చేసిన పనికి గుండె ఆగిపోయినంత పనైంది- తెలుగు హీరోయిన్..!

Krithi Shetty: లైంగిక వేధింపులపై ఉప్పెన బ్యూటీ ఊహించని కామెంట్స్.. అది కావాలంటూ..!

Big Stories

×