E-Paper
Advertisement

జనసేన అధినేత పవన్ వ్యాఖ్యలపై కేటీఆర్ హాట్ కామెంట్స్.. అన్నింటికీ వాళ్లే అసలు కారణం

జనసేన అధినేత పవన్ వ్యాఖ్యలపై కేటీఆర్ హాట్ కామెంట్స్..  అన్నింటికీ వాళ్లే అసలు కారణం
Advertisement

KTR: జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేసిన కామెంట్స్‌పై బీఆర్ఎస్ వర్కింగ్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. దేశంలో ఏ రాష్ట్రంలో ఎన్నికలు జరిగినా పోటీ చేయవచ్చారు. కానీ పోటీ చేయాలనే ప్రాంత ప్రజల గురించి? అస్థిత్వం గురించి మాట్లాడేటప్పుడు ఆలోచించాలన్నారు. పవన్.. గతంలోనూ తెలంగాణలో పోటీ చేశారని, మాటలు జాగ్రత్తగా మాట్లాడాలన్నారు. మిమ్మల్ని ఎవరూ ఆపలేదని, తెలంగాణ ఆవిర్భావం రోజున సమావేశం పెట్టాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు కేటీఆర్.

పవన్ కల్యాణ్‌పై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కీలక వ్యాఖ్యలు

Advertisement

కేసీఆర్‌ను తెలంగాణ ‘OG’గా అభివర్ణించిన కేటీఆర్..  పవన్ కల్యాణ్‌ అంశంపై ఆయన మాట్లాడారు.  ఇటీవల పవన్ కల్యాణ్ సినిమా ‘OG’ వచ్చిందని,  ఇప్పుడు ఓ విషయం గుర్తు చేస్తున్నామని అన్నారు. తెలంగాణకు OG కేసీఆర్ ఉన్నారని,  మా రాష్ట్రం గురించి కేసీఆర్ చూసుకుంటారని ఆయన చాలని వ్యాఖ్యానించారు.

ప్రాంతీయ వాదం ఉగ్రవాదం కంటే ప్రమాదమని పవన్ కళ్యాణ్ అంటున్నారని, పొట్టి శ్రీరాములు.. మద్రాస్ నుండి ఆంధ్ర వేరుపడాలని 58 రోజుల పాటు ఆత్మ బలిదానం చేసుకున్నారని అన్నారు. అది కూడా ప్రాంతీయ వాదం అంటారా అని ప్రశ్నించారు. ప్రాంతీయ వాదంతో తెలంగాణకు వచ్చే పరిశ్రమలను గుజరాత్‌కి తీసుకెళ్లిపోయారని గుర్తు చేశారు. జాతీయ వాదం ముసుగులో చేస్తున్న ఆర్ధిక ప్రాంతీయ వాదం కరెక్టేనా? మోదీ కేవలం గుజరాత్‌కి పీఎంగా వ్యవహరించడం కరెక్టేనా? దీనికి సమాధానం చెబుతారా పవన్ కళ్యాణ్ అని సూటిగా ప్రశ్నించారు.

Advertisement

జాతీయ వాదం ముసుగులో ఆర్ధిక ప్రాంతీయ వాదం మాటేంటి?

ప్రతి కథలో నాయకుడు-ప్రతినాయకుడు ఉంటారని అన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. తెలంగాణ కథలోనూ శకుని, మారీచుడు వంటి పాత్రలు ఉన్నాయని ఆరోపించారు. ఆనాడు బలవంతంగా ఆంధ్ర-తెలంగాణను కాంగ్రెస్ కలిపిందన్నారు. కలిపిన కొన్నాళ్ల తర్వాత మళ్లీ ఉద్యమం మొదలైందన్నారు. 1969 నాటి ఉద్యమంలో వందలాది ప్రాణాలను బలిగొన్నది కాంగ్రెస్ పార్టీయేనని ఆరోపించారు.

తెలంగాణలోని నాలుగు కోట్ల ప్రజలు తన కుటుంబమని కేసీఆర్ భావించారని, ఆ నలుగురి కోసం తెలంగాణ వచ్చిందంటూ ప్రత్యర్థులు విష ప్రచారం చేశారని దుమ్మెత్తిపోశారు. రాజకీయాల్లో అధికారం అనేది ఎవరికీ శాశ్వతం కాదని, తాము ఎల్లప్పుడూ అధికారంలో ఉంటామని ఎవరైనా భావిస్తే వారు మూర్ఖులే అవుతారని అన్నారు.

ALSO READ: బీజేపీ లేకుంటే తెలంగాణ లేదు-బీజేపీ చీఫ్ 

అధికారం పోయిందనే బాధ ఏ మాత్రం లేదన్నారు. మా మీద అన్ని ప్రచారాలు చేసినా ఏ మాత్రం పట్టించుకోలేదన్నారు. మమకారంతో పని చేస్తే.. అహంకారమని ముద్ర వేశారని తెలిపారు. తెలంగాణ వచ్చాక ప్రాంతాలుగా విడిపోయినా, ప్రజలుగా కలిసి ఉండాలని తాము భావించామన్నారు.

 

 

 

 

 

 

Related News

ప్రపంచ స్థాయి చదువులంటే ఇదేనా? ఫీజు బకాయిల పెండింగ్‌పై హరీశ్ రావు నిలదీత

1000 రోజుల పాలన కాదు.. 1000 అబద్ధాల పాలన.. కాంగ్రెస్‌పై రాంచందర్ రావు ఫైర్

సత్తుపల్లిలో భూవివాదం కలకలం.. కోర్టు ఉత్తర్వులు ఉన్నా తహసీల్దార్ నివేదిక రైతుల ఆగ్రహం!

మెదక్ జిల్లాలో వింత ఘటన.. కుక్క పిల్లలకు పాలిస్తున్న వరాహం

పార్టీలో నుండి కవితను అందుకే తొలగించారు: ప్రశాంత్ రెడ్డి క్లారిటీ!

మహబూబాబాద్ జిల్లాలో షాకింగ్ సీన్.. లగ్జరీ కారులో వచ్చి మేకల దొంగతనం కలకలం

ఆమె మా బోధన్ కోడలు.. కవిత పై మాజీ ఎమ్మెల్యే షకీల్ సంచలన వ్యాఖ్యలు

హైదరాబాద్‌లో ఓటర్ల వెరిఫికేషన్.. నోటీసులిచ్చినా దక్కని స్పందన!

Big Stories

Advertisement
×