BigTV English

KTR: లోక్ సభ ఎన్నికలకు సమయాత్తం కావాలి.. పార్టీ నేతలకు కేటీఆర్ ఆదేశం..

KTR: లోక్ సభ ఎన్నికలకు సమయాత్తం కావాలి.. పార్టీ నేతలకు కేటీఆర్ ఆదేశం..

KTR: లోక్ సభ ఎన్నికలకు సమయాత్తం కావాలని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ పార్టీ నేతలను ఆదేశించారు. సోమవారం చేవెళ్ల అసెంబ్లీలో బీఆర్ఎస్ నేతలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ అసెంబ్లీ ఎన్నికల ఓటమితో కుంగిపోవద్దన్నారు. ఓటమిపాలైన బీఆర్ఎస్ అభ్యర్థులే నియోజకవర్గ ఇంచార్జులుగా ఉంటారన్నారు. నియోజక వర్గంలో విస్తృతంగా పర్యటించి ప్రజలకు అందుబాటులో ఉండాలని పార్టీ నేతలకు పిలుపునిచ్చారు.


అనంతరం చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి మాట్లాడుతూ నన్ను చేవెళ్ల ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయమని కేటీఆర్ చెప్పారన్నారు. గెలుపే లక్ష్యంగా పని చేయాలని దిశానిర్ధేశం చేశారు. తెలంగాణ అంటేనే బీఆర్ఎస్. బీఆర్ఎస్ రాష్ట్రంలో అనేక సంక్షేమ పథకాలు అమలు చేసిందన్నారు.

బీఆర్ఎస్ ఏం చేయలేదని కాంగ్రెస్ నాయకులు చెప్పడం విడ్డూరమన్నారు. బీఆర్ఎస్ త్వరలోనే ఖాళీ అవుతుందని , కాంగ్రెస్, బీజేపీ చేస్తున్న అస్యత ప్రచారాన్ని తిప్పి కొట్టాలని పిలుపునిచ్చారు. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిన స్థానాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని రంజిత్ రెడ్డి దిశానిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డ, ఎమ్మెల్యేలు , మాజీ ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.


Tags

Related News

NTR: సారీ నన్ను క్షమించండి.. ఈవెంట్ తర్వాత ఎన్టీఆర్ స్పెషల్ వీడియో

Mother’s Love: అమ్మకు ప్రేమతో.. హ్యాపీ మదర్స్ డే..!

Cm Revanth Reddy: నేడు పాల‌మూరుకు సీఎం.. రూ.110 కోట్ల‌తో ఎలివేటెడ్ కారిడార్ రోడ్డుకు శంకుస్థాప‌న‌!

Pawan Kalyan: ఇష్టం వ‌చ్చిన‌ట్టు మాట్లాడితే తొక్కిప‌ట్టి నార‌ తీస్తాం.. రోజా, కోడాలికి ప‌వ‌న్ స్ట్రాంగ్ వార్నింగ్!

Chadrababu Naidu vs YS Jagan: తిరుమల డిక్లరేషన్ రగడ.. గెలిచిందెవరు?

Chiranjeevi: చిరు చేసిన పనికి గుండె ఆగిపోయినంత పనైంది- తెలుగు హీరోయిన్..!

Big Stories

×