E-Paper
Advertisement

Sunburn Festival: సన్‌బర్న్‌కు నో పర్మిషన్.. మాదాపూర్ పీఎస్‌లో కేసు..

Sunburn Festival: సన్‌బర్న్‌కు నో పర్మిషన్.. మాదాపూర్ పీఎస్‌లో కేసు..
Advertisement

Sunburn Festival: సన్‌బర్న్‌ కార్యక్రమంపై మాదాపూర్‌ పీఎస్‌లో కేసు నమోదైంది. ఈవెంట్ నిర్వాహకులతో పాటు బుక్ మై షో పై కూడా కేసు నమోదు చేశారు. పోలీసుల అనుమతి తీసుకోకుండా ఈవెంట్‌ ఏర్పాట్లు చేసుకోవడమే కాకుండా.. టిక్కెట్లు విక్రయించడంపై కేసు నమోదైంది. హైటెక్ సిటీలోనీ యోలో ఏరినాను ఈవెంట్ కోసం నిర్వాహకులు బుక్‌ చేశారు. అనుమతి లేకపోయిన టికెట్లు అమ్మకున్నారు. దీంతో ఈ వ్యవహరంపై రేవంత్‌ రెడ్డి సర్కారు సీరియస్ అయింది. గతంలోనూ న్యూ ఇయర్ సన్ బర్న్ కార్యక్రమం.. అనేక వివాదాలకు కారణమైంది.

ఈ ఈవెంట్‌లో అసాంఘిక కార్యకలాపాలకు అనుమతి ఇవ్వద్దంటూ 2017లోనే కాంగ్రెస్ ఆందోళన చేసింది. ఈవెంట్ కోసం దేశంలోని వివిధ రాష్ట్రాల నుండి యువత హాజరవుతూ ఉంటారు. యువత ఆసక్తిని సన్ బర్న్ నిర్వాహకులు క్యాష్ చేసుకుంటున్నారు. ఆన్‌లైన్‌లో టికెట్ల అమ్మకంపై ముఖ్యమంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. నిర్వాహకుడు సుమంత్, బుక్ మై షో నిర్వాహకులను పిలిపించి సైబరాబాద్ సీపీ అవినాష్ మహంతి వార్నింగ్ ఇచ్చారు. ఇప్పటివరకూ పోలీసులు ఈవెంట్ నిర్వహణకు అనుమతి ఇవ్వకపోవడంతో సన్‌బర్న్ కార్యక్రమంపై సందిగ్ధత నెలకొంది.

Related News

జైల్లో ప్రజ్వల్ రేవణ్ణ లీలలు.. ఫోన్ ఓపెన్ చేసి చూసిన అధికారులకు మైండ్ బ్లాక్!

Illu Illalu Pillalu Today Episodes: తిరుపతి పెళ్లి అయిపోయిందోచ్.. వేధవతికి మైండ్ బ్లాక్.. ఇది అస్సలు ఊహించలేదు మావా..

కూటమిలో అసంతృప్తి.. జగన్‌కి ప్లస్ అవుతుందా?

పాడుబడిన పాత దేవాలయంలో దెయ్యం… కాలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే డిఫరెంట్ హర్రర్ థ్రిల్లర్ స్ట్రీమింగ్ తెలుగులో

Karthika Deepam 2 Serial Today Episode September 11th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ చెంప పగుల గొట్టిన జ్యోత్స్న       

నా జీవితంలోకి వచ్చిన వ్యక్తికి ఆస్కార్ ఇవ్వొచ్చు.. జయం రవి భార్య పోస్ట్ వైరల్!

Karthika Deepam 2 Serial Today Episode September 9th ‘కార్తీకదీపం2’ సీరియల్‌: రాజీ కోసం కార్తీక్ దగ్గరకు వెళ్లిన దక్షిణమూర్తి 

ఇంద్రకీలాద్రి ట్రస్ట్ బోర్డ్ లో కీలక బాధ్యత… కృతజ్ఞతలు తెలిపిన సుస్మిత కొణిదెల !

Big Stories

Advertisement
×