BigTV English

2036 Olympics | గుజరాత్‌లోనే 2036 ఒలింపిక్స్‌ : అమిత్ షా

2036 Olympics | ఒలింపిక్స్‌ క్రీడలు 2036 సంవత్సరంలో ఇండియాలో జరుగుతాయని కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఆశాభావం వ్యక్తం చేశారు. ఒకవేళ భారత్‌లో ఈ ప్రతిష్ఠాత్మక క్రీడలు జరిగితే వాటి నిర్వహణ గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్‌లో ఉంటుందని అమిత్ షా తెలిపారు.

2036 Olympics | గుజరాత్‌లోనే 2036 ఒలింపిక్స్‌ : అమిత్ షా

2036 Olympics | ఒలింపిక్స్‌ క్రీడలు 2036 సంవత్సరంలో ఇండియాలో జరుగుతాయని కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఆశాభావం వ్యక్తం చేశారు. ఒకవేళ భారత్‌లో ఈ ప్రతిష్ఠాత్మక క్రీడలు జరిగితే వాటి నిర్వహణ గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్‌లో ఉంటుందని అమిత్ షా తెలిపారు.


అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ క్రికెట్‌ స్టేడియం వద్ద సర్దార్‌ పటేల్‌ కాంప్లెక్స్‌ ఒలంపిక్స్ క్రీడలకు వేదిక కావొచ్చని ఆయన వ్యాఖ్యానించారు. ఒలింపిక్స్‌ నిర్వహణ కోసం భారత ప్రభుత్వం బిడ్‌ సమర్పిస్తుందని ఇంతకుముందు ప్రధాన మంత్రి మోదీ చెప్పిన విషయం అమిత్ షా గుర్తు చేశారు. ఒలింపిక్స్‌ నిర్వహణ కోసం ప్రధాన మంత్రి రూ.4600 కోట్లు కేటాయించినట్లు కూడా తెలిపారు.

షా సొంత నియోజకవర్గమైన గాంధీనగర్‌లో ఓ క్రీడా కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా వెళ్లారు. అక్కడ చేసిన ప్రసంగంలో ఆయన ఈ విషయాలు వెల్లడించారు. ఎంపీలంతా తమ తమ నియోజకవర్గాల్లో క్రీడలను ప్రోత్సహించే దిశగా కార్యక్రమాలను చేపట్టాలని ప్రధాని మోదీ సూచించారని ఆయన తెలిపారు.


2036 Olympics, conduct, Ahmedabad, Gujarat, Amit Shah, Gandinagar, Sports news,

Related News

Arshdeep Singh: పాకిస్థాన్ ను దారుణంగా ట్రోల్ చేసిన అర్ష్ దీప్‌…Final Match, What’s Happening…అంటూ

Asia Cup 2025 : రింకూ సింగా మజాకా.. కార్డు పైన రాసి మరి… విన్నింగ్ షాట్ ఆడాడు.. అదృష్టం అంటే అతడిదే

Mohsin Naqvi: ట్రోఫీతో పరారైన పాకిస్థాన్ చీఫ్ న‌ఖ్వీ….బీసీసీఐ సంచ‌ల‌న నిర్ణ‌యం

Asia Cup 2025 Prize Money : టీమిండియాకు రూ.200 కోట్లకు పైగా ప్రైజ్ మనీ… బీసీసీఐ ఎన్ని కోట్లు ఇచ్చిందంటే..?

Abrar Ahmed-Sanju Samson: అబ్రార్ కు ఇచ్చిప‌డేసిన‌ టీమిండియా ప్లేయ‌ర్లు..సంజూ ముందు ఓవ‌రాక్ష‌న్ చేస్తే అంతేగా

IND Vs PAK : టీమిండియాను ఓడించేందుకు పాక్ కుట్రలు… గాయమైనట్లు నాటకాలు ఆడి.. అచ్చం రిషబ్ పంత్ నే దించేశాడుగా

Salman Ali Agha cheque: పాక్ కెప్టెన్ స‌ల్మాన్ బ‌లుపు చూడండి…ర‌న్న‌ర‌ప్ చెక్ నేల‌కేసికొట్టాడు

Asia Cup 2025 : ట్రోఫీ లేకుండానే సెలబ్రేట్ చేసుకున్న టీమ్‌ఇండియా.. పాండ్య ఫోటో మాత్రం అదుర్స్

Big Stories

×