E-Paper
Advertisement

కొత్త పార్టీలు వస్తుంటాయి.. పోతుంటాయి.. క‌విత‌ కొత్త పార్టీపై కేటీఆర్ కీల‌క‌ వ్యాఖ్య‌లు

కొత్త పార్టీలు వస్తుంటాయి.. పోతుంటాయి.. క‌విత‌ కొత్త పార్టీపై కేటీఆర్ కీల‌క‌ వ్యాఖ్య‌లు
Advertisement

KTR response on Kavitha TRS party: క‌ల్వ‌కుంట్ల క‌విత ప్ర‌క‌టించిన‌ కొత్త పార్టీపై బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. కవిత ‘టీఆర్‌ఎస్‌’ (TRS) పేరుతో కొత్త పార్టీని స్థాపించడంపై స్పందిస్తూ రాజకీయాల్లో చాలా పార్టీలు వస్తుంటాయి.. పోతుంటాయని ఆయన ఎద్దేవా చేశారు. భారతదేశంలో 25 ఏళ్లు పూర్తి చేసుకున్న రాజకీయ పార్టీలు చాలా తక్కువని, ఈ కొత్త పార్టీని తాము పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదని కేటీఆర్ కొట్టిపారేశారు. కేసీఆర్ గురించి చాలా మంది చాలా రకాలుగా మాట్లాడుతున్నారని, వాటన్నింటికీ సమాధానం చెప్పాల్సిన పని లేదన్నారు. తెలంగాణ భవన్‌లో కేసీఆర్ అధ్యక్షతన జరిగిన బీఆర్‌ఎస్ రాష్ట్ర కార్యవర్గ సమావేశం ముగిసిన అనంతరం కేటీఆర్ మీడియాతో మాట్లాడారు.

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును పాకిస్థాన్ విభజనతో పోలుస్తూ మాట్లాడటం తెలంగాణ అస్తిత్వాన్ని అవమానించడమేనని ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్లమెంటులో బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య చేసిన వ్యాఖ్యలను కేటీఆర్ తీవ్రంగా ఖండించారు. ప్రస్తుతం లోక్‌సభలో బీఆర్ఎస్ ఎంపీలు లేని లోటు స్పష్టంగా కనిపిస్తోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తేజస్వి సూర్య మాట్లాడుతున్న సమయంలో సభలో ఒక్క బీఆర్ఎస్ ఎంపీ ఉన్నా అతడిని నిలదీసి క్షమాపణలు చెప్పించి ఉండేవాళ్లమని ధీమా వ్యక్తం చేశారు.

Advertisement

కేసీఆర్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో పలు కీలక తీర్మానాలు చేశామని కేటీఆర్ వెల్లడించారు. తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న అన్ని వర్గాలకు, సబ్బండ వర్గాలకు మరియు సకల జనులకు ధన్యవాదాలు తెలుపుతూ తీర్మానం చేసినట్లు పేర్కొన్నారు. రాష్ట్రంలో కొనసాగుతున్న అరాచక కాంగ్రెస్ పాలనకు వ్యతిరేకంగా పోరాడాలని సమావేశంలో నిర్ణయాలు తీసుకున్నామని చెప్పారు. పార్టీ ఏర్పాటుకు దారి తీసిన పరిస్థితులను కేసీఆర్ ఈ సమావేశంలో వివరించారని, కేవలం తెలంగాణ ప్రయోజనాలే పరమావధిగా బీఆర్ఎస్ అడుగులు వేస్తుందని స్పష్టం చేశారు.

గత బీఆర్ఎస్ ప్రభుత్వ పథకాల విశిష్టతను గుర్తు చేస్తూ రైతుబంధు వంటి పథకాలను ఐక్యరాజ్యసమితి (UN) సైతం ప్రశంసించిందని కేటీఆర్ గుర్తుచేశారు. రైతులను ఆదుకోవడంలో తమ ప్రభుత్వం దేశానికే దిక్సూచిగా నిలిచిందన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులపై ప్రజలు ఆలోచించాలని, బీఆర్ఎస్ ఎప్పుడూ తెలంగాణ ప్రజల పక్షానే ఉంటుందని ఆయన పునరుద్ఘాటించారు. రాజకీయంగా ఎన్ని శక్తులు ఎదురైనా కేసీఆర్ నాయకత్వంలో పార్టీ మరింత బలోపేతం అవుతుందని కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు.

Advertisement

Read Also: డ్రగ్స్ కేసుల్లో సెలేబ్రిటీలను పట్టుకుని జైల్లో పెట్టండి.. పోలీసులకు సీఎం రేవంత్ రెడ్డి సంచలన ఆదేశాలు

Related News

కేటీఆర్ వచ్చే వేళ మిర్యాలగూడలో పొలిటికల్ హీట్.. కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ మధ్య వార్!

ఢిల్లీలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి అవార్డ్స్ 2026.. సీఎం రేవంత్ రెడ్డి స్పీచ్ వైరల్!

యూట్యూబ్‌లో చూసి నకిలీ నోట్ల తయారీ.. కానీ చివరికి ఎలా చిక్కాడంటే..?

హుజూరాబాద్‌లో మళ్లీ కాకరేపుతున్న రాజకీయ వేడి.. కాంగ్రెస్ వైఫల్యాలపై కౌశిక్ రెడ్డి భారీగా ధర్నా!

క్రికెట్ గ్రౌండ్ కోసం చెరువు కబ్జా చేస్తారా.. పట్టించుకోని అధికారులు!

ఆయనకు అన్నీ ఆశలు, కోరికలే ఉన్నాయి.. కేటీఆర్‌పై జగ్గారెడ్డి షాకింగ్ కామెంట్స్!

తెలంగాణలో భారీ డిఫెన్స్ ఎక్స్‌పో.. రాజ్‌నాథ్ సింగ్‌కు రేవంత్ స్పెషల్ ఇన్విటేషన్!

కుషాయిగూడ పీహెచ్‌సీలో ఊహించని పరిణామం.. డాక్టర్‌గా మారిన డీఎంహెచ్‌ఓ!

Big Stories

Advertisement
×