Bhadrachalam Temple Land: తెలంగాణలో రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయా? బీఆర్ఎస్-బీజేపీల మధ్య మాటల యుద్ధం తీవ్రమవుతుందా? రాముడి భూములు కబ్జా వ్యవహారాన్ని తెరపైకి తెచ్చారు కేటీఆర్. ఈ విషయంలో తెలంగాణ బీజేపీ చీఫ్ మౌనంగా ఎందుకున్నారని ప్రశ్నించారు. కేటీఆర్ కామెంట్స్‌పై తెలంగాణ బీజేపీ రియాక్ట్ అవుతారా? అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
ఏపీలో భద్రాచలం ఆలయ భూముల కబ్జాపై మాజీ మంత్రి కేటీఆర్ రియాక్ట్ అయ్యారు. రాముడి భూములు కబ్జా అవుతున్నా తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామచందర్ రావు ఎందుకు సైలెంట్‌గా ఉన్నారని ప్రశ్నించారు. 889 ఎకరాల భూమి కబ్జా అయినా బీజేపీ కనీసం ఒక్క మాట కూడా మాట్లాడలేదన్నారు. రాజకీయ పొత్తులు పక్కన పెట్టి భద్రాచలం దేవస్థానం భూములను కాపాడేందుకు ముందుకు రావాలన్నారు.
హైకోర్టు ఉత్తర్వులను అమలు చేసేలా చూడాలన్నారు. ఇంతకీ భద్రాచలం ఆలయ భూములు ఏపీ కబ్జా చేయడమేంటి? ఇటీవల ఆలయ ఈవో రమాదేవిపై పురుషోత్తపట్నం గ్రామస్తులు ఎందుకు దాడికి పాల్పడ్డారు? దీనివెనుక అసలు కథేంటి? ఇంకాస్త లోతుల్లోకి వెళ్తే..
ఇటీవల భద్రాచలం సీతారాముల ఆలయ భూములపై రగడ జరుగుతోంది. శ్రీరాముడి ఆలయానికి సంబంధించి భూములు ఆక్రమణకు గురవుతున్నాయి. దీనిపై భూఅక్రమణదారులు- దేవాదాయ శాఖ ఉద్యోగుల మధ్య వివాదం తారాస్థాయికి చేరింది. ఈ క్రమంలో అక్కడికి వెళ్లిన ఆలయ ఈవో రమాదేవిపై పురుషోత్తపట్నం గ్రామస్థులు దాడి చేశారు. ఇంతకీ గ్రామస్తులు దాడి వెనుక అసలు కారణమేంటి?
ALSO READ: మహిళలకు ఊహించని తీసి కబురు, ఇంకెందుకు ఆలస్యం
ఏపీ విభజన తర్వాత పురుషోత్తపట్నం గ్రామం ఆంధ్రప్రదేశ్‌లో కలిసింది. ఆలయానికి సంబంధించి ఏపీ, తెలంగాణల్లో 1300 ఎకరాలు భూములు ఉన్నాయి. అందులో పురుషోత్తపట్నం గ్రామంలో 889 ఎకరాల భూమి ఉంది. ఆ గ్రామం అల్లూరు సీతారామరాజు జిల్లాలో ఉంది. కొన్నాళ్లుగా ఆ భూములపై వివాదం సాగుతోంది.
అయితే దేవాదాయ శాఖ ఆయా భూముల్లో నిర్మాణాలు చేపట్టాలని నిర్ణయించింది. ఇప్పటికే గోశాల నిర్మిస్తోంది కూడా. దాన్ని గ్రామస్తులు అడ్డుకున్నారు. ఈ వ్యవహారంపై న్యాయస్థానంలో వివాదం నడుస్తోంది. కొద్దిరోజుల కిందట ఆ భూమి దేవస్థానానికి అప్పగించాలని ఏపీ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.
అంతకుముందు ప్రభుత్వం దేవాలయ భూములపై పాస్‌బుక్‌లు ఆ గ్రామస్తులకు అందజేసింది. ప్రస్తుతం ఆ గ్రామస్తులు నిర్మాణాలు చేస్తున్న విషయం తెలుసుకున్న ఆలయ ఈవో రమాదేవి అక్కడికి వెళ్లారు. ఆమెపై గ్రామస్తులు దాడి చేయడాన్ని తెలంగాణ ప్రభుత్వం తీవ్రంగా ఖండించింది.
దేవాదాయ భూములను కబ్జా చేస్తే పీడీ యాక్ట్ కింద కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు మంత్రి కొండా సురేఖ. ఈ వ్యవహారంపై తెలంగాణ బీజేపీ చీఫ్ రామచందర్‌రావుని కేటీఆర్ సూటిగా ప్రశ్నించారు. దీనిపై బీజేపీ నేతలు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.
ఏపీలో భద్రాచలం ఆలయ భూముల కబ్జాపై కేటీఆర్ కామెంట్స్..
రాముడి భూములు కబ్జా అయినా బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు రామచందర్ రావు ఎందుకు మౌనంగా ఉన్నారు?
889 ఎకరాల భూమి కబ్జా అయినా బీజేపీ నుంచి ఒక్క మాట కూడా లేదు
రాజకీయ పొత్తులు పక్కన పెట్టి భద్రాచలం దేవస్థానం భూములను కాపాడేందుకు ముందుకు… pic.twitter.com/NqAHeeLTXI
— BIG TV Breaking News (@bigtvtelugu) July 11, 2025