Indiramma Indlu Updates: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు పెద్ద పీఠ వేస్తోంది. వాళ్లకు అనుకూలమైన నిర్ణయాలు తీసుకుంటోంది. రానున్న ఎన్నికల్లో ఎక్కువ సీట్లు మహిళలకు సీట్లు ఇవ్వాలని నిర్ణయించింది. తాజాగా రెండేసి లక్షలు ఇచ్చేందుకు సిద్ధమైనట్టు తెలుస్తోంది. ఇంతకీ ఏ విషయంలో అనుకుంటున్నారా? అక్కడికే వచ్చేద్దాం.
ఇల్లాలు ఉంటే ఇంటికి అందం. ఇల్లాలు లేకుంటే ఆ ఇంటిని చూడలేము. అందుకే మహిళల సంక్షేమం కోసం తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. తాజాగా అలాంటి నిర్ణయం తీసుకుంది. స్థలం ఉన్నవారు ఇందిరమ్మ ఇళ్లు నిర్మించుకునేందుకు ప్రభుత్వం ఆర్థిక సాయం చేస్తోంది.
ప్రభుత్వం ఇచ్చేది 5 లక్షలు మాత్రమే. ఇల్లు కట్టుకోవాలంటే తక్కువలో తక్కువ ఎలాగ లేదన్నా రూ.10 లక్షలు అవుతుంది. నిధుల్లేక ఇల్లు కట్టుకునేందుకు చాలామంది ముందుకు రాలేకపోతున్నారు. ఈ విషయాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం గుర్తించింది. స్వయం సహాయక సంఘాల సభ్యులు ఇల్లు కట్టుకునేందుకు మహిళలకు ప్రత్యేకంగా రుణాలు ఇవ్వాలని డిసైడ్ అయ్యింది.
అయితే ఈ రుణం 50 వేల నుంచి రెండు లక్షల వరకు ఉండనుందని సమచారం. దీనివల్ల పేద, మధ్య తరగతి బిగ్ రిలీఫ్. వేగంగా తమ తమ ఇల్లు నిర్మించుకోవచ్చు. ఆ ఇంట్లో ఉంటూనే మరింత అందంగా తీర్చిదిద్దుకునేందుకు వీలైవుతుంది. అందుకే ప్రభుత్వం రుణాలు ఇవ్వాలని భావిస్తోంది. ప్రస్తుతం ఇందిరమ్మ ఇల్లు నిర్మాణాల తీరును ప్రభుత్వం పరిశీలిస్తోంది.
ALSO READ: మాట నిలబెట్టుకున్న రేవంత్ సర్కార్
ఆ లిస్టును దగ్గర పెట్టుకొని అధికారులు గమనిస్తున్నారు. ఎవరైనా ఇల్లు నిర్మించుకోలేక ఇబ్బంది పడితే ఆ ఇంటికి సంబంధించిన మహిళ ఎవరైనా డ్వాక్రా గ్రూపులో ఉన్నారా? లేరా? అనేదానిపై ఆరా తీస్తున్నారు. వారికి రుణం రూపంలో నిధులు ఇప్పిస్తున్నారు. కొన్ని జిల్లాల్లో ఇప్పటికే పైలట్ ప్రాజెక్టుగా మొదలైంది. ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయనుంది.
మహిళా సంఘాల్లో సభ్యులైన వారికే రుణాలు ఇవ్వనున్నారు. ఇందుకు కారణాలు లేకపోలేదు. ఆయా సంఘాల్లో ఎక్కువగా పేదలు, మధ్య తరగతి వారే ఉంటున్నారు. వారు రుణాలు తీసుకుంటే తప్పనిసరిగా చెల్లిస్తున్నారని అంచనాకు వచ్చింది. రుణం తీసుకున్న తర్వాత గ్రూపులో మిగతావారు ఆయా రుణాలు చెల్లించేలా బాధ్యత తీసుకుంటున్నారు.
ఈ ప్రాసెస్ వల్ల రుణాల చెల్లింపులు సులువుగా జరుగుతుందని అంచనా వేసింది. అందుకే గ్రూపుల్లో చేరిన మహిళలకే రుణం. ప్రతీ డ్వాక్రా గ్రూపులో టీమ్ లీడర్ ఉంటారు. గ్రూపులోని మహిళలకు ఎలాంటి ప్రయోజనాలు కలిగించాలన్నా తొలుత లీడర్‌కి చెప్పాలి. ఆ విధంగా అధికారులు ఆయా గ్రూపుల హెడ్‌లతో మాట్లాడి రుణాలు ఇప్పించే పనిలో పడ్డారు.
ఈ వ్యవహారాలను జిల్లా రూరల్ డెవలప్మెంట్ ఏజెన్సీ చూస్తోంది. రుణాలు కచ్చితంగా చెల్లిస్తామని భావించినవారికే రెండు లక్షల వారికే ఇస్తున్నారు. తీసుకుంటున్న రుణాన్ని 10 వాయిదాల్లో తిరిగి చెల్లించాలి. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం కోసం ప్రభుత్వం 5 లక్షలు ఇస్తోంది.
ప్రభుత్వం ఇచ్చే రుణాల నుంచి రుణం చెల్లించేలా ప్లాన్ చేశారు. త్వరలో మున్సిపాల్టీల్లో మహిళలకు వాటిని ఇవ్వనున్నారు. తీసుకున్న రుణాలు ఇంటి నిర్మాణం కోసం ఉపయోగిస్తున్నారో లేదా అధికారులు ఎప్పటికప్పుడు తనిఖీ చేస్తారు. మొత్తానికి మహిళలకు ఆ విధంగా రుణాలు అందజేస్తోంది కాంగ్రెస్ ప్రభుత్వం.