E-Paper
Advertisement

KTR: కేసీఆర్ చెప్పుకు ఉన్న దూళికి కూడా సమానం కాలేవు.. రేవంత్‌పై కేటీఆర్ ఆగ్రహం

KTR: కేసీఆర్ చెప్పుకు ఉన్న దూళికి కూడా సమానం కాలేవు.. రేవంత్‌పై కేటీఆర్ ఆగ్రహం
Advertisement

KTR : జనగామలో జరిగిన నూతన సర్పంచుల ఆత్మీయ సమ్మేళనంలో.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, సీఎం రేవంత్ రెడ్డిపై నిప్పులు చెరిగారు. కేసీఆర్ వేసుకున్న చెప్పుకు ఉన్న దూళికి కూడా సమానం కాలేవని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

కేసీఆర్‌ను ఉరితీయాలన్న సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై మాజీ మంత్రి కేటీఆర్ ఫైర్ అయ్యారు. తెలంగాణను కాంగ్రెస్ ఏళ్ల తరబడి పట్టిపీడిందని అన్నారు ఆయన. ప్రత్యేక తెలంగాణ కోసం చావు నోట్లో తలపెట్టారని గుర్తు చేశారు కేటీఆర్.

Advertisement

రేవంత్ రెడ్డికి తిట్టడం తప్ప ఇంకోటి తెలియదు. కేసిఆర్‌ను మొలకత్తనీయనని శపధం చేస్తున్నావ్ అంటూ కేటీఆర్ మండిపడ్డారు. తెలంగాణను మొలిపించిన మొగోడు, మొనగాడు కేసీఆర్. నీవల్ల ఊదు కాలదు, పీరు లేవదు. కేసీఆర్ వెంట్రుక కూడా పీకలేరు అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.

ఇటీవల స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలపై మాట్లాడుతూ.. ఈ విజయం కార్యకర్తల కృషి ఫలితమని, నాయకుల గొప్పతనం కాదని అన్నారు. అలాగే ప్రతిపక్ష నేతలపై మాట్లాడటం, కేసులు నమోదు చేయడం, పోలీసులు ఇంటికి వచ్చి బెదిరిస్తున్నారని కేటీఆర్ ఆరోపించారు.

Advertisement

సీఎం రేవంత్ రెడ్డిపై కేటీఆర్ ఘాటుగా స్పందించారు. పేమెంట్ సీట్ ముఖ్యమంత్రి అంటూ తీవ్రంగా విమర్శించారు. రాహుల్ గాంధీకి మూటలు మోసుడు తప్ప ఏం తెలియదు అంటూ సైటైరికల్ కామెంట్స్ చేశారు.

ముఖ్యమంత్రి చెక్ డ్యామ్ లు పేలుతుంటే కళ్ళప్పగించి చూస్తున్నాడని, కృష్ణా, గోదావరి బే సిన్లపై అవగాహన లేకుండా కేసీఆర్‌కు కాంగ్రెస్ నేతలు నీళ్ల గురించి చెప్తున్నారని ఎద్దేవా చేశారు.

వ్యవసాయం రంగంలో మళ్లీ యూరియా కొరత మొదలైందని కేటీఆర్ పేర్కొన్నారు. వరంగల్ పర్యటనలో రాహుల్ గాంధీ 70 లక్షల మంది రైతులకు హామీలు ఇచ్చి వెళ్లాడు. కానీ అవి ఇప్పటివరకు అమలు కాలేదని విమర్శించారు. రాహుల్ గాంధీ లీడర్ కాదు రీడర్ అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

Also Read: ఢిల్లీలా మారడం ఖాయం! హైదరాబాద్ కాలుష్యంపై శ్రీధర్ బాబు చెప్పింది వింటే

ఆయనకు రాసిచ్చింది చదవడం మాత్రమే తెలుసు. రాహుల్ గాంధీ మాటలు నమ్మి యువత కాంగ్రెస్ కు ఓట్లు వేశారు. 420 హామీలు ఇచ్చి మోసం చేసినందుకు రాహుల్ గాంధీని ఉరితీయాలి అని ఆరోపించారు.

 

Related News

స్పీడ్ పెంచిన రేవంత్ రెడ్డి.. రేపటి నుంచి సొంత గడ్డపై రెండు రోజుల పర్యటన !

అసదుద్దీన్ ఒవైసీ అసలైన దేశభక్తుడు.. సంతోష్‌నగర్ స్టీల్ ఫ్లైఓవర్ ప్రారంభంలో సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు!

సాగర్‌కి శని పట్టింది.. ఆ ఇద్దరు మంత్రులే కారణం:మిర్యాల గూడలో రెచ్చిపోయిన KTR

31 ఏళ్ల కాంగ్రెస్ బంధం.. అధిష్టానానికి కొండా సురేఖ కన్నీటి లేఖ!

కేబినెట్ నుంచి ఔట్.. సురేఖకు ముందు బర్తరఫ్ అయిన మంత్రులు వీళ్లే!

రేవంతే పట్టుబట్టి నన్ను తీసేశారు..సీఎం పై సంచలన కామెంట్స్!

నన్ను అడగకుండా ఎలా బర్తరఫ్ చేస్తారు?.. అధిష్ఠానంపై మంత్రి కొండా సురేఖ ఫైర్!

సురేఖ అక్కా నేనున్నాను, పార్టీలోకి రావాలని కేఏపాల్ ఆహ్వానం

Big Stories

Advertisement
×