E-Paper
Advertisement

గ్యాస్ ధరల పెంపుపై కడిగిపారేసిన కేటీఆర్.. కేంద్రానికి అల్టిమేటం!

గ్యాస్ ధరల పెంపుపై కడిగిపారేసిన కేటీఆర్.. కేంద్రానికి అల్టిమేటం!
Advertisement

LPG Price Hike: తెలంగాణ భవన్‌ వేదికగా భారత రాష్ట్ర సమితి (BRS) వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కేంద్ర ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. మే డే సందర్భంగా కార్మికులకు శుభాకాంక్షలు చెప్పాల్సింది పోయి, గ్యాస్ సిలిండర్ ధరలను భారీగా పెంచి మోదీ ప్రభుత్వం సామాన్యుల నడ్డి విరిచిందని ఆయన మండిపడ్డారు. దేశ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఒకేసారి 1000 రూపాయల మేర కమర్షియల్ సిలిండర్ ధరను పెంచడం దుర్మార్గమని, దీనిని వెంటనే ఉపసంహరించుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.

హైదరాబాద్‌లో ప్రస్తుతం కమర్షియల్ సిలిండర్ ధర రూ. 3,315కు చేరడం వల్ల హోటళ్లు, రెస్టారెంట్లు నడపలేని పరిస్థితి ఏర్పడిందని కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. దీనివల్ల కేవలం యజమానులే కాకుండా, వాటిలో పనిచేసే లక్షలాది మంది కార్మికులు ఉపాధి కోల్పోయే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ఇప్పటికే అంతర్జాతీయ పరిణామాల వల్ల సామాన్యుడి బతుకు భారమైందని, ఇలాంటి సమయంలో ఈ పెంపు పుండు మీద కారం చల్లినట్టు ఉందని విమర్శించారు. చివరకు బ్యాచిలర్లు వాడే చిన్న సిలిండర్లను కూడా వదలకుండా ధరలు పెంచడం దారుణమన్నారు.

Advertisement

కేంద్రం అనుసరిస్తున్న విధానాల వల్ల ఒకవైపు రూపాయి విలువ పాతాళానికి పడిపోతుంటే, మరోవైపు గ్యాస్ ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయని కేటీఆర్ ఎద్దేవా చేశారు. గతంలో ఉద్యోగాలు అడిగితే పకోడీలు వేసుకోమన్న ప్రధాని, ఇప్పుడు పెంచిన ధరలతో ఆ పకోడీలు కూడా వేసుకోలేని పరిస్థితికి ప్రజలను నెట్టారని విమర్శించారు. పెట్రోల్, డీజిల్‌పై సెస్‌ల పేరుతో రూ. 65 ఉండాల్సిన ధరను రూ. 110 దాటించారని, దీనివల్ల నిత్యావసర వస్తువుల ధరలు పెరిగి సామాన్యుడు బతకడమే కష్టంగా మారిందని పేర్కొన్నారు.

ఈ అడ్డగోలు ధరల పెంపుపై ప్రజల తరపున రాజీలేని పోరాటం చేస్తామని కేటీఆర్ స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వం తక్షణమే స్పందించి పెంచిన పెట్రోల్, డీజిల్ , గ్యాస్ ధరలను తగ్గించాలని, లేదంటే ప్రజాగ్రహానికి గురికాక తప్పదని ఆయన హెచ్చరించారు. సామాన్యుడి జేబుకు చిల్లు పెడుతున్న బీజేపీ ప్రభుత్వ తీరును ఎండగట్టాల్సిన సమయం ఆసన్నమైందని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.

Advertisement

Also Read: ఆర్టీసీలో కలకలం.. లంచం అడిగిన అధికారికి ‘చెప్పు’తో బుద్ధి చెప్పిన కండక్టర్!

Related News

రేవంత్‌ కేబినెట్‌లోకి మరో ఫైర్‌బ్రాండ్.. హైకమాండ్‌తో విజయశాంతి మంతనాలు, ఆ శాఖ కోసం పట్టు

సొంత పార్టీని ముంచేస్తున్న నేతల దూకుడు.. కాంగ్రెస్‌ పార్టీలో నెక్స్ట్ ఏ సీనియర్ టార్గెట్?

స్పీడ్ పెంచిన రేవంత్ రెడ్డి.. రేపటి నుంచి సొంత గడ్డపై రెండు రోజుల పర్యటన !

అసదుద్దీన్ ఒవైసీ అసలైన దేశభక్తుడు.. సంతోష్‌నగర్ స్టీల్ ఫ్లైఓవర్ ప్రారంభంలో సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు!

సాగర్‌కి శని పట్టింది.. ఆ ఇద్దరు మంత్రులే కారణం:మిర్యాల గూడలో రెచ్చిపోయిన KTR

31 ఏళ్ల కాంగ్రెస్ బంధం.. అధిష్టానానికి కొండా సురేఖ కన్నీటి లేఖ!

కేబినెట్ నుంచి ఔట్.. సురేఖకు ముందు బర్తరఫ్ అయిన మంత్రులు వీళ్లే!

రేవంతే పట్టుబట్టి నన్ను తీసేశారు..సీఎం పై సంచలన కామెంట్స్!

Big Stories

Advertisement
×