E-Paper
Advertisement

నెక్స్ట్ వచ్చేది మేమే.. కాంగ్రెస్‌ను బొంద పెట్టడం ఖాయం.. కేటీఆర్ హాట్ కామెంట్స్

నెక్స్ట్ వచ్చేది మేమే.. కాంగ్రెస్‌ను బొంద పెట్టడం ఖాయం.. కేటీఆర్ హాట్ కామెంట్స్
Advertisement

KTR Criticism: తెలంగాణలో కాంగ్రెస్‌ను బొంద పెట్టడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. ఇందిరాపార్క్ వద్ద ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ కాంట్రాక్టర్ల మహాధర్నాలో కేటీఆర్ పాల్గొని మాట్లాడారు. ఎన్నికలకు ముందు 13 డిక్లరేషన్లు, 6 గ్యారంటీలు, 420 హామీలతో మాయమాటలు చెప్పి గద్దెనెక్కిన కాంగ్రెస్.. అధికారం లోకి వచ్చాక అన్ని వర్గాలను నట్టేట ముంచిందని ధ్వజమెత్తారు. ప్రభుత్వ కాంట్రాక్టులలో ఎస్సీలు, ఎస్టీలు, బీసీలకు రిజర్వేషన్లు ఇస్తామని చెప్పి.. మోసం చేశారని ఆరోపించారు.

గురుకుల పాఠశాలల్లో స్థానిక చిన్న కాంట్రాక్టర్లు సరఫరా చేసే కూరగాయలు, చికెన్, పాలు, బ్రెడ్ వంటి వాటిని కూడా దక్కకుండా చేస్తూ ‘జీవో నెం.17’ (GO 17) తీసుకువచ్చారని కేటీఆర్ మండిపడ్డారు. ఆ టెండర్లను పెద్ద కార్పొరేట్ సంస్థలకు కట్టబెట్టేందుకు కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. చిన్న కాంట్రాక్టర్లను రోడ్లపైకి తెచ్చిన ఈ జీవో 17 రద్దయ్యే వరకు బడుగు బలహీన వర్గాలకు కాంట్రాక్టులు దక్కే వరకు పోరాటం ఆపేది లేదని కేటీఆర్ స్పష్టం చేశారు.

Advertisement

ఇవాళ రాష్ట్రంలో కాంట్రాక్టులు కేవలం ఇద్దరికే దక్కుతున్నాయని కేటీఆర్ ఆరోపించారు. రేవంత్ రెడ్డి బామ్మర్దికి, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కొడుకుకే అన్ని కాంట్రాక్టులు ఇస్తున్నారని విమర్శించారు. సొంత నియోజకవర్గం కొడంగల్-నారాయణపేట ఎత్తిపోతల పథకానికి సంబంధించిన రూ.4 వేల కోట్ల కాంట్రాక్టును తన అనుయాయులకే ఇచ్చుకున్నారని విమర్శించారు. కాంగ్రెస్ పాలనలో కేవలం వాళ్ల బంధువులకే కాకుండా, బీజేపీ ఎంపీ సీఎం రమేష్‌కు రూ.1300 కోట్ల కాంట్రాక్టులు ఇస్తున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు.

రేవంత్ రెడ్డి ఇప్పటివరకు రూ.4 లక్షల కోట్ల అప్పు చేశారని అందులో రూ.4 అయినా ఎస్సీ, ఎస్టీ, బీసీ కాంట్రాక్టర్లకు ఇచ్చారా అని ప్రశ్నించారు. చిన్న కాంట్రాక్టర్లకు విడుదల చేసిన నిధులు, చేసిన అప్పులపై శ్వేతపత్రం విడుదల చేసే దమ్ము రేవంత్ సర్కార్‌కు ఉందా అని కేటీఆర్ డిమాండ్ చేశారు. పేమెంట్ కోటాలో ముఖ్యమంత్రిగా రేవంత్ గద్దెనెక్కారని రెగ్యులర్ సీఎం కాదని, కేవలం ‘రెన్యూవల్ సీఎం’ (Renewal CM) అని ఎద్దేవా చేశారు. తెలంగాణ వారికి తీవ్ర అన్యాయం జరుగుతున్నా ఢిల్లీ హైకమాండ్ మౌనంగా ఉండటానికి ఇదే కారణమన్నారు. ఈ ద్రోహానికి రేవంత్ రెడ్డితో పాటు రాహుల్ గాంధీని, మల్లికార్జున ఖర్గేని కూడా నిలదీయాలని పిలుపునిచ్చారు.

Advertisement

Also Read: కేసీఆర్ పెద్ద పాలేరు, కేటీఆర్ చిన్న పాలేరు.. గాంధీ భవన్‌లో గజ్జెల కాంతం ధ్వజం!

గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో సంపద సృష్టి బాగా జరిగిందని కేటీఆర్ అన్నారు. నాడు చిన్న చిన్న కాంట్రాక్టర్లను ఆదుకుని గౌరవంగా నిలబెట్టారని గుర్తు చేశారు. కేసీఆర్ అప్పులు చేసి 1000కి పైగా గురుకులాలు కట్టించారన్నారు. 6.50 లక్షల మంది బడుగు విద్యార్థులకు ఒక్కొక్కరిపై రూ.1.20 లక్షల నుండి రూ.1.25 లక్షల వరకు ఖర్చు పెట్టారని పేర్కొన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు, జిల్లాకో మెడికల్ కాలేజీ, నర్సింగ్ కాలేజీ తెచ్చారని గుర్తుచేశారు. అలాగే 24 గంటల కరెంట్, కేసీఆర్ కిట్, 15 లక్షల మంది ఆడబిడ్డలకు మేనమామ కట్నంగా కల్యాణలక్ష్మి కింద ఆర్థిక సాయం అందించారని తెలిపారు.

Also Read: అమెరికాలో పాడుపని.. ముగ్గురు భారతీయులకు జైలు శిక్ష.. ఏం జరిగిందంటే?

Related News

Kharif Farming: పాలమూరు జిల్లాలో ఎల్‌నినో దెబ్బ.. భూమిలోనే కుళ్ళిపోయిన పత్తి విత్తనాలు!

Rice Prices: ఎల్ నినో ఎఫెక్ట్.. పెరగనున్న బియ్యం ధరలు.. అంతా వారిచేతుల్లోనే..?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మాయగాళ్లను నమ్మొద్దు.. మేకతోలు కప్పుకున్న తోడేళ్లు.. బీఆర్‌ఎస్‌పై సీఎం రేవంత్ నిప్పులు

KBR Python: హైదరాబాద్ కేబీఆర్ పార్క్‌లో భారీ కొండ చిలువ హల్ చల్..!

Second Hand Mobile: సెకండ్‌హ్యాండ్ మొబైల్ కొంటున్నారా?.. అయితే ఇవి తప్పని సరి!

బహదూర్‌గూడలో హైటెన్షన్.. పోలీసులపై కారం చల్లి, కుర్చీలు విసిరేసిన రైతులు.. ఎందుకంటే?

Food Adulteration Law: ఆహార కల్తీ దందాకు ఇక చెక్.. తెలంగాణలో రాబోతున్న కొత్త చట్టం ఇదే!

Big Stories

Advertisement
×