E-Paper
Advertisement

KTR: మూసీ పునరుజ్జీవనం పై సంచలన వ్యాఖ్యలు చేసిన కేటీఆర్..!

KTR: మూసీ పునరుజ్జీవనం పై సంచలన వ్యాఖ్యలు చేసిన కేటీఆర్..!
Advertisement

KTR: స్వేచ్ఛ బ్యూరో: కాంగ్రెస్ ది మూసి సుందరీకరణ కాదు. మూసి భూముల ఆక్రమణ పథకం అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. హిమాయత్ సాగర్ వేదికగా మూసీ పునరుజ్జీవం – పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ వర్సెస్ పబ్లిక్ పాయింట్” అనే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ గత బీఆర్ఎస్ ప్రభుత్వం కేవలం ₹16,000 కోట్లతో ఒక్క ఇల్లు కూడా కూల్చకుండా మూసీని అభివృద్ధి చేసే ప్రణాళికలు సిద్ధం చేసిందని, ఇప్పటికే ఉప్పల్, నాగోల్ ప్రాంతాల్లో 6 కిలోమీటర్ల మేర విజయవంతంగా అభివృద్ధి చేశామని వివరించారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం లక్షన్నర కోట్ల అంచనాలతో సామాన్యుల ఇళ్లను కూల్చివేస్తూ విద్వంసానికి పాల్పడుతోందని విమర్శించారు. ఎలాంటి డీటెయిల్స్ ప్లానింగ్ రిపోర్టు లేకుండా.. సోషల్ ఇంఫాక్ట్ స్టడీ ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ స్టడీ వంటి నివేదికలు, ప్రజలతో ఎలాంటి చర్చలు లేకుండా వేలమంది ఇండ్లను కూలగొడతామని కాంగ్రెస్ ప్రభుత్వం భయాందోళనకు గురిచేస్తుందన్నారు.

వేలకోట్ల అవినీతికి..

కాంగ్రెస్ ప్రభుత్వం భూసేకరణ చట్టాలను ఇతర నిబంధనలను అన్నింటినీ పాతర వేసి వేలకోట్ల అవినీతికి తెగబడుతున్నదని విమర్శించారు. అభివృద్ధికి మేము ఏమాత్రం వ్యతిరేకం కాదు అని అవినీతికి కాంగ్రెస్ పార్టీ భూదాహానికి లక్షల కోట్ల అవినీతి ప్రణాళికలకు మాత్రం వ్యతిరేకమని వెల్లడించారు. కచ్చితంగా అవినీతిని అడ్డుకుంటామని, పార్టీలకు అతీతంగా హైదరాబాద్(Hyderabad) నగర ప్రజలను కాపాడుకుంటామన్నారు. రాష్ట్ర ఏర్పాటు కోసం ప్రాణాలు పరంగా పెట్టి వందల ఉద్యమాలు చేసి సాధించుకున్న భూమి పుత్రులుగా కాంగ్రెస్ పార్టీ అవినీతిని ఎదుర్కొంటామని తెలిపారు. బాధితుల వెంట కచ్చితంగా బీఆర్ఎస్ ఉంటుందని ప్రతి ఒక్క ప్రాంతానికి పార్టీ నేతలు పార్టీ శ్రేణులు వచ్చి మరి నిలబడతామన్నారు. రెండేళ్ల పాటు మూసి బాధితులు సమిష్టిగా కలిసికట్టుగా ప్రభుత్వం పైన పోరాడితే మా ప్రభుత్వం వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ బుల్లోజర్ రాజ్యాన్ని పారదోలి ప్రతి ఒక్కరి ఇళ్లను భూములను కాపాడుతామని హామీ ఇచ్చారు. ఇచ్చిన హామీలకు అభివృద్ధికి డబ్బులు లేవు, విపరీతంగా అప్పులు ఉన్నాయని చెబుతున్న రేవంత్ రెడ్డి మూసి కోసం వేల కోట్లు ఖర్చు పెడతా అంటున్నారు.

మూసీ పేరుతో వేల కోట్లకు టెండర్..

Advertisement

లక్షన్నర కోట్ల రూపాయలతో మూసిని అభివృద్ధి చేస్తామంటున్నారు.డఅందాల పోటీలకు ఫుట్‌బాల్ ఆటలకి వందల కోట్లు ఖర్చు పెడుతుందని మండిపడ్డారు. దశాబ్దాల పాటు అధికారంలో ఉన్న కాంగ్రెస్, టిడిపి ప్రభుత్వాల పాలన ఫలితంగానే మూసి సర్వనాశనం అయిందన్నారు. గతంలో మూసిని మురికి కుప్పగా మార్చిన పాపానికి ప్రజలకు క్షమాపణ చెప్పి పాపాన్ని కడుక్కోండి అని సూచించారు. నమామి గంగే కి ఖర్చు 42 వేల కోట్లు. వందల కిలోమీటర్ల నమామి గంగే కి ఖర్చు కేవలం 42 వేల కోట్లు అయితే, 55 కిలోమీటర్ల మూసీకి లక్షన్నర కోట్లు ఎందుకు ఖర్చవుతుందనే మా ప్రశ్నకు రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాలన్నారు. ఈ రాష్ట్రాన్ని ఈ నగరాన్ని ప్రేమించే పార్టీగా, వ్యక్తులుగా మూసీ అభివృద్ధిని ఏమాత్రం అడ్డుకోమన్నారు. కానీ కేవలం మూసీ పేరుతో వేల కోట్ల రూపాయల ప్రజల సొమ్మును దోచుకుంటామంటే ఖచ్చితంగా అడ్డుకుంటామన్నారు. మూసీ అంశంలో మా పార్టీది మానవీయ కోణంలో అభివృద్ధి చేసే కార్యక్రమం అన్నారు.

Also Read: Constable Controversy: కానిస్టేబుల్ ఆత్మహత్యాయత్నం పై.. క్లారిటీ ఇచ్చిన సీపీ సజ్జనార్

3,800 కోట్ల రూపాయలు

Advertisement

మూసీ అభివృద్ధిలో భాగంగా మూసీకి ఓఆర్ఆర్ నుంచి ఓఆర్ఆర్ వరకు ఎక్స్‌ప్రెస్ వే నిర్మాణంతో పాటు, మూసీలో మురికిని మొత్తం తీసివేసేలా ఎస్టీపీల నిర్మాణాన్ని కోసం ప్రణాళిక రూపొందించి, ఆ మేరకు 3,800 కోట్ల రూపాయలకు పైగా నిధులతో ఎస్టీపీల నిర్మాణం ప్రారంభించామని, వీటిని నిర్మాణం పూర్తి అవుతే ఒక్క చుక్క కూడా మురికి నీరు మూసి లోకి చేరదన్నారు. ఒక్క డిజైన్ చేసే కంపెనీకే ₹160 కోట్ల రూపాయలను రేవంత్ రెడ్డి ఇచ్చారంటే ఎంత అవినీతి జరుగుతున్నదో అర్థం చేసుకోండి.. జీరో విలువ మూసీ బాధితుల ఇళ్లకు ఉందని బ్లాక్‌మెయిల్ రాజకీయాలకు దిగవద్దని రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి చేస్తున్నామన్నారు.

బతుకులను ఆగం చేయవద్దు

దీనితో పాటు రాష్ట్రంలో ఎవరికైనా జీరో విలువ ఉన్నది అంటే అది ముమ్మాటికీ రేవంత్ రెడ్డికే అని అన్నారు. కేవలం ₹16,000 కోట్లతో 57 కిలోమీటర్ల మూసీని అభివృద్ధి చేయవచ్చు.. వెంటనే కాంగ్రెస్ ప్రభుత్వం ఆ ప్రణాళికను ముందుకు తీసుకుపోవాలని డిమాండ్ చేశారు. మూసి బాధితులు రాష్ట్ర ప్రభుత్వ ప్రణాళికల పైన ఆందోళన ఆగ్రహం వ్యక్తం చేస్తూ పలు సలహాలు సూచనలు ఇచ్చారు.. దశాబ్దాల నుంచి స్థిరపడి జీవనం సాగిస్తున్న మా బతుకులను ఆగం చేయవద్దు అంటూ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. బీఆర్ఎస్ పార్టీ మాకు అండగా ఉండాలని కోరారు.

Also Read: Hydraa: త్వరలో హైడ్రా కు మరిన్ని పవర్స్..!

Related News

ట్రైనీ ఐపీఎస్‌ ఉదయ్‌ ఆత్మహత్యాయత్నం.. వెంటనే ఆసుపత్రికి తరలింపు

రేవంత్ సర్కార్ కొత్త పథకం.. క్యూర్ పరిధిలో ఎల్ఐజి ఇళ్లకు శ్రీకారం, 10 అంతస్తుల టవర్ల నిర్మాణం

తెలంగాణలో బీజేపీ నెక్స్ట్ టార్గెట్ అదే.. కేడర్‌కు రాంచందర్ రావు రూట్ మ్యాప్!

Bandi Sanjay: తెలంగాణ పాలిటిక్స్‌లో సంచలనం.. కేంద్ర మంత్రి లలన్ సింగ్‌కు బండి సంజయ్ లేఖ!

Voter List Revision: డబుల్ ఓట్లకు చెక్ పెట్టేలా.. ఎన్నికల సంఘం కొత్త యాప్ ఇదే!

రైతులకు గుడ్ న్యూస్.. భూసేకరణ పరిహారంపై మంత్రి ఉత్తమ్ కీలక ఆదేశాలు!

భార్య ప్రైవేట్ వీడియో భర్తకే పంపి.. తోటి ఆఫీసర్‌పై ఐపీఎస్ ట్రైనీ లైంగిక వేధింపులు!

Jawaharnagar: ప్లాట్ల పేరుతో భారీ మోసం.. డబ్బులతో రాత్రికి రాత్రే పరార్..!

Big Stories

Advertisement
×