E-Paper
Advertisement

KTR Tweet: గురి తప్పాం.. ఓటమి పై కేటీఆర్ ట్వీట్

KTR Tweet: గురి తప్పాం.. ఓటమి పై కేటీఆర్ ట్వీట్
Advertisement

KTR Tweet: తెలంగాణ ఎన్నికల ఫలితాల్లో హస్తం హవా కొనసాగుతోంది. 41 స్థానాల్లో కాంగ్రెస్, 13 స్థానాల్లో బీఆర్ఎస్ అభ్యర్థులు విజయం సాధించారు. 5 స్థానాల్లో బీజేపీ అభ్యర్థులు, ఇతరులు మూడు స్థానాల్లో గెలిచారు. ప్రస్తుతం బీఆర్ఎస్ 26 స్థానాల్లో, కాంగ్రెస్ 22 స్థానాల్లో లీడింగ్ లో ఉండగా.. బీజేపీ 3 స్థానాల్లో లీడింగ్ లో కొనసాగుతోంది.

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో గెలుస్తారనుకున్న బీఆర్ఎస్ అభ్యర్థుల్లో చాలామంది ఓటమి పాలయ్యారు. కాంగ్రెస్ హవా కొనసాగుతుండగా.. విజయం కాంగ్రెస్ దే అన్న క్లారిటీ వచ్చేసింది. ఈ క్రమంలో కేటీఆర్ ట్విట్టర్ వేదికగా స్పందించారు.

Advertisement

వరుసగా రెండుసార్లు బీఆర్ఎస్ పార్టీకి అధికారాన్ని అందించిన తెలంగాణ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. ఈరోజు వెల్లడైన ఎన్నికల ఫలితాలను చూసి బాధపడలేదు కానీ.. ఆశించిన స్థాయిలో ఫలితాలు లేకపోవడంతో నిరాశ చెందామన్నారు. ఈ ఓటమిని ఒక పాఠంగా స్వీకరిస్తున్నామని, తిరిగి మళ్లీ పుంజుకుంటామన్నారు. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన కాంగ్రెస్ పార్టీకి అభినందనలు తెలిపారు. అలాగే మీకు శుభం జరగాలి అని ఆ ట్వీట్ లో పేర్కొన్నారు.

కాగా.. శనివారం రాత్రి కేటీఆర్.. బీఆర్ఎస్ హ్యాట్రిక్ విజయం ఖాయమని, సంబరాలకు సిద్ధంగా ఉండాలని ట్వీట్ చేశారు. ఇప్పుడు అదే ట్వీట్ ను రీ ట్వీట్ చేస్తూ.. గురి తప్పిందన్నారు.

Tags

Related News

సవాల్ మీది.. అరెస్ట్ మాదా? తెలంగాణ భవన్ వద్ద హైడ్రామా.. మాజీ మంత్రి హరీష్ రావు అరెస్ట్!

Minister Komatireddy: కార్పొరేషన్ ఎన్నికల ప్రచారంలో మంత్రి ఉత్సాహం.. మీ రుణం తీర్చుకోలేనంటూ..?

Telangana BJP: మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను ఇరుకున పెట్టేందుకు బీజేపీ బిగ్ స్కెచ్.. అందుకు వ్యూహం ఇదే..?

Khammam News: ఖమ్మంలో కాక రేపుతున్న మున్సిపల్ రాజకీయం.. ఓ పక్క గెలుపు వ్యూహాలు.. మరోపక్క జంపింగ్ రాజాల తంటాలు..!

Sarpanch elections: సర్పంచ్‌గా గెలవక ముందే అభ్యర్థి ప్రకటన చూసి అవాక్కయిన గ్రామస్థులు –  అసలు ఏం చేశాడో తెలుసా..?  

New Royal Enfield Bikes: రాయల్ ఎన్‌ఫీల్డ్ నుంచి 2 క్రేజీ బైక్స్ లాంచ్, ఏకంగా 648cc ట్విన్ ఇంజిన్ తో!

Telangana Loksabha Election Results: కాంగ్రెస్ అభ్యర్థి రఘువీర్ రెడ్డి ప్రభంజనం.. భారీ మెజార్టీతో గెలుపు

Traffic diversions in Hyderabad due to counting of votes: ఎన్నికల కౌంటింగ్.. హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు!

Big Stories

Advertisement
×