BigTV English

Rajasthan Polls 2023 | రాజస్థాన్‌లో బిజేపీకి స్పష్టమైన మెజారిటీ.. దియా కుమారి తదుపరి సిఎం?

Rajasthan Polls 2023 | రాజస్థాన్‌లో తదుపరి ప్రభుత్వం ఏ పార్టీ ఏర్పాటు చేస్తుందనే ప్రశ్నకు స్పష్టమైన సమాధానం దొరికింది. ఇప్పటివరకు అందిన ఓట్ల కౌంటింగ్ బట్టి కమలం పార్టీకి 100 నుంచి 108 స్థానాల్లో గెలుపు తథ్యమనే తెలుస్తోంది. మరోవైపు అధికార కాంగ్రెస్ పార్టీ 70 నుంచి 80 సీట్లు సాధించే అవకాశం ఉంది. మొత్తం 199 సీట్లున్న రాజస్థాన్ అసెంబ్లీలో 100 సీట్లు సాధించడం మేజిక్ ఫిగర్.

Rajasthan Polls 2023 | రాజస్థాన్‌లో బిజేపీకి స్పష్టమైన మెజారిటీ.. దియా కుమారి తదుపరి సిఎం?

Rajasthan Polls 2023 | రాజస్థాన్‌లో తదుపరి ప్రభుత్వం ఏ పార్టీ ఏర్పాటు చేస్తుందనే ప్రశ్నకు స్పష్టమైన సమాధానం దొరికింది. ఇప్పటివరకు అందిన ఓట్ల కౌంటింగ్ బట్టి కమలం పార్టీకి 100 నుంచి 108 స్థానాల్లో గెలుపు తథ్యమనే తెలుస్తోంది. మరోవైపు అధికార కాంగ్రెస్ పార్టీ 70 నుంచి 80 సీట్లు సాధించే అవకాశం ఉంది. మొత్తం 199 సీట్లున్న రాజస్థాన్ అసెంబ్లీలో 100 సీట్లు సాధించడం మేజిక్ ఫిగర్.


ఇప్పటివరకు రాజస్థాన్ ఎన్నికల్ల సాంప్రదాయం ప్రకారం ప్రతి అయిదు సంవత్సరాలకు ప్రభుత్వం మారిపోతుంది. ఈ సాంప్రదాయం 2023 ఎన్నకల్లో కూడా కొనసాగుతున్నట్లు అర్థమవుతోంది. 2013 సంవత్సరంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ముఖ్యమంత్రి అశోక్ గెహ్లోత్ నాయకత్వంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఓటమి పాలైంది. బిజేపీ పార్టీ గెలవడంతో వసుంధరా రాజే ముఖ్యమంత్రి అయ్యారు.

ఆ తరువాత 2018లో జరిగిన రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల్లో తిరిగి కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. వసుంధరా రాజే నాయకత్వంలోని బిజేపీ ప్రభుత్వం ఓడిపోయింది. అశోక్ గెహ్లోత్ మళ్లీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఇప్పుడు నవంబర్ 25, 2023న జరిగిన ఎన్నికల్లో కూడా ఇదే ట్రెండ్ నడుస్తోంది. కమలం పార్టీ విజయం దాదాపు ఖారరైంది. కాంగ్రెస్‌కు 80 సీట్లు లోపే రావొచ్చని గణాంకాలు తెలుపుతున్నాయి.


ఇటీవల వచ్చిన రాజస్థాన్ ఎగ్జిట్ పోల్స్‌లో కూడా ఇదే ఫలితాలు కనిపించాయి. ఎగ్జిట్ పోల్స్‌ ఫలితాల్లో కాంగ్రెస్, బిజేపీ మధ్య హోరాహోరీ పోటీ ఉండబోతోందని సర్వేల్లో తేలింది. కానీ ప్రస్తుత పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉంది. బిజేపీ విజయం వైపు దూసుకెళుతుండగా.. కాంగ్రెస్ పరాజయం అంచున నిలబడి ఉంది.

కాంగ్రెస్ ఓటమికి చాలా వరకు స్వయకృతాపరాధాలే కారణం. 2018 ఎన్నికల్లో విజయం సాధించిం కాంగ్రెస్ ఏర్పాటు చేసిన ప్రభుత్వంలో ముఖ్యమంత్రిగా అశోక్ గెహ్లోత్, డెప్యూటి ముఖ్యమంత్రి సచిన్ పైలట్ ఉన్నారు. వీరిద్దిరి మధ్య ముందునుంచి గొడవలే. ఈ కారణంగా రాజస్థాన్ కాంగ్రెస్‌లో పెద్ద ముసలం ఏర్పడింది. పార్టీ రెండు వర్గాల్లో చీలిపోయింది. ఒకటి సిఎం గెహ్లోత్ వర్గం, మరొకటి సచిన్ పైలట్ వర్గం. ఈ గొడవల వల్ల కాంగ్రెస్ అదిష్ఠానం సచిన్ పైలట్‌ని డిప్యూటి సిఎం పదవి నుంచి తొలగించింది.

ఆ తరువాత గత అయిదేళ్ల కాంగ్రెస్ పాలనలో మహిళలపై అత్యాచారాలు, ప్రభుత్వ ఉద్యోగాల పరీక్షల పేపర్ లీక్ ఘటన వంటి ఘటనలు జరిగాయి. వీటన్నింటికి మించి నిరుద్యోగ సమస్యతో యువత కాంగ్రెస్ పార్టీ గద్దె దింపాలని పిలుపునిచ్చింది. దీంతో ప్రతిపక్ష బిజేపీ పెద్దగా కష్టపడకుండానే మళ్లీ విజయం సాధించిందని చెప్పాలి.

ఈ సారి జరిగిన ఎన్నికల్లో ముఖ్యమంత్రి అభ్యర్థిని కాంగ్రెస్, బిజేపీ రెండు పార్టీలు కూడా ప్రకటించలేదు. అయినా సిఎం పదవి మళ్లీ పొందాలని వసుంధరా రాజేకే ఆరాటపడుతున్నారు. గత కొంతకాలం ఆమె ప్రత్యక్ష రాజకీయాల్లో లేనప్పటికీ.. ఎన్నికల ముందు ప్రచార కార్యక్రమాల్లో బిజేపీ కోసం శ్రమపడ్డారు. కానీ బిజేపీ నాయకుల్లో కొంతమంది.. ఈసారి ముఖ్యమంత్రి పదవి దివ్యా కుమారికి ఇవ్వాలని అంటున్నారు. వసుంధరా రాజే, దియా కుమారి ఇద్దరూ రాజ వంశీకులే. దియాకుమారి రాజస్థాన్‌లోని జైపూర్ రాజ్యం చివరి పరిపాలకుడు రాజా మాన్ సింగ్ 2 మనవరాలు.

దియా కుమారి బిజేపీ తరపున విద్యాధర్ నగర్ నియోజకవర్గం నుంచి భారీ మెజారిటీ.. 71328 ఓట్ల తేడా గెలుపొందారు.

వసుంధరా రాజే ఝాలావార్ నియోజకవర్గం నుంచి వరుసగా అయిదు సార్లు లోక్ సభ ఎన్నికలు కూడా గెలిచారు. ఈ సారి అసెంబ్లీ ఎన్నికల్లో ఆమె ఝాల్రాపటాన్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. అక్కడ ఆమె భారీ ఆధిక్యంతో గెలుస్తున్నట్లు తెలుస్తోంది.

మరోవైపు కాంగ్రెస్ తరపు నుంచి సచిన పైలట్ టోంక్ నియోజకవర్గం నుంచి, సిఎం అశోక్ గెహ్లోత్ సర్దార్ పురా నియోజకవర్గం నుంచి ముందంజలో ఉన్నారు. కానీ 17 కాంగ్రెస్ మంత్రులు తమ సొంత నియోజకవర్గాల్లోనే ఓడిపోతున్నట్లు సమాచారం అందింది.

Related News

Army rescue: మంచు పర్వతాల మధ్య.. పురిటి నొప్పులతో మహిళ! రంగంలోకి 56 మంది జవాన్స్.. ఆ తర్వాత?

FASTag Annual Pass: వాహనదారులకు శుభవార్త.. ఫాస్టాగ్ వార్షిక పాస్ కావాలా..? సింపుల్ ప్రాసెస్

Bengaluru: బెంగుళూరులో ప్రధాని.. వందే భారత్ రైళ్లు ప్రారంభం, ఆ తర్వాత రైలులో ముచ్చట్లు

Rakhi Fest: ఈ టీచర్ గ్రేట్.. 15వేల మంది మహిళలు రాఖీ కట్టారు.. ఫోటో వైరల్

Delhi heavy rains: ఢిల్లీలో వరద భీభత్సం.. ఏడుగురు మృతి.. అసలు కారణం ఇదే!

Independence Day 2025: వారంలో ఆగస్టు 15.. స్వేచ్ఛా దినంలోని గాధలు..

Big Stories

×