E-Paper
Advertisement

KTR Tweet : కేటీఆర్ ట్వీట్.. బీఆర్ఎస్ నేతల్లో టెన్షన్.. ఆ సర్వేలో ఏముంది ?

KTR Tweet : కేటీఆర్ ట్వీట్.. బీఆర్ఎస్ నేతల్లో టెన్షన్.. ఆ సర్వేలో ఏముంది ?

KTR Tweet : బీఆర్‌ఎస్‌ ముఖ్య నేత కేటీఆర్ చేసిన ఒక్క ట్వీట్‌ ఇప్పుడు ఆ పార్టీలో కొత్త కలకలాన్ని రేపింది. బీఆర్‌ఎస్‌ ఓడిపోయే సీట్లేంటే చెప్పకనే చెప్పారు కేటీఆర్‌. తెలంగాణలో బీఆర్‌ఎస్‌దే గెలుపంటూ రాజ్‌నీతి ఓ సర్వే రిపోర్టు ఇచ్చింది. దీనిని పోస్ట్‌ చేసి జై తెలంగాణ అని ట్వీట్ చేశారు కేటీఆర్‌. అయితే ఇందులో బీఆర్‌ఎస్‌ ఓడిపోయే సీట్లేంటో కూడా ఈ సర్వే చెప్పింది.

కేటీఆర్‌ ప్రస్తావించిన సర్వే ప్రకారం చాలా కీలక స్థానాల్లో ఓడిపోనుంది బీఆర్‌ఎస్‌. బీఆర్‌ఎస్ ఓడిపోయే స్థానాల్లో భూపాలపల్లి, ములుగు, మల్కాజ్‌గిరి, పరిగి, వికారాబాద్‌, ఇబ్రహీంపట్నం, ఎల్లారెడ్డి ఉన్నాయి. నాంపల్లి, చొప్పదండి, వేములవాడ, రామగుండం, పెద్దపల్లి, మంథనిలో కాంగ్రెస్‌దే గెలుపని ఆ సర్వే తేల్చింది. మంచిర్యాల, అందోల్, కొడంగల్‌, అలంపూర్‌, అచ్చంపేట, మధిర, కొత్తగూడెంలో భారీ మెజార్టీతో గెలవనుంది కాంగ్రెస్‌. పినపాక, భద్రాచలం, ఇల్లందు, పాలేరు, తుంగతుర్తి, నాగార్జునసాగర్‌, నల్గొండ, కోదాడ, హుజూర్‌నగర్‌లో కాంగ్రెస్‌దే గెలుపని రాజ్‌నీతి సర్వే తేల్చేసింది.

మొత్తంగా చూస్తే కేసీఆర్‌, కేటీఆర్ సన్నిహితులంతా ఓడిపోతారని సర్వే తేల్చింది. అయితే ఇలాంటి సర్వేను కేటీఆర్‌ ప్రస్తావించడంపై బీఆర్‌ఎస్‌లో అయోమయం నెలకొంది. వేములవాడ టికెట్‌ను సిట్టింగ్‌కు కాకుండా సన్నిహితుడికి ఇచ్చారు కేసీఆర్. అలంపూర్ టికెట్‌ను కూడా సిట్టింగ్‌ను కాదని చల్లా అనుచరుడికి ఇచ్చారు. అయితే రాజ్‌నీతి సర్వే ప్రకారం వేములవాడ, అలంపూర్‌లో ఓడిపోనుంది బీఆర్‌ఎస్‌. నాంపల్లిలో ఎంఐఎంకు ఓటమి ఖాయమని కూడా తేల్చింది రాజ్‌నీతి సర్వే. కొడంగల్‌, నల్గొండ, కోదాడ, హుజూర్‌నగర్‌, పాలేరు, మధిర, మంథని నియోజకవర్గాలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది బీఆర్‌ఎస్‌. ఆ స్థానాలన్నింటిలోనూ బీఆర్‌ఎస్‌కు ఓటమి తప్పదని తేల్చింది రాజ్‌నీతి సర్వే. రాజ్‌నీతి సర్వేను కేటీఆర్‌ ప్రస్తావించడంతో ఆ స్థానాలు పక్కగా పోయినట్లేనంటూ పార్టీలో చర్చ మొదలైంది.

Related News

Minister Komatireddy: కార్పొరేషన్ ఎన్నికల ప్రచారంలో మంత్రి ఉత్సాహం.. మీ రుణం తీర్చుకోలేనంటూ..?

Telangana BJP: మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను ఇరుకున పెట్టేందుకు బీజేపీ బిగ్ స్కెచ్.. అందుకు వ్యూహం ఇదే..?

Khammam News: ఖమ్మంలో కాక రేపుతున్న మున్సిపల్ రాజకీయం.. ఓ పక్క గెలుపు వ్యూహాలు.. మరోపక్క జంపింగ్ రాజాల తంటాలు..!

Sarpanch elections: సర్పంచ్‌గా గెలవక ముందే అభ్యర్థి ప్రకటన చూసి అవాక్కయిన గ్రామస్థులు –  అసలు ఏం చేశాడో తెలుసా..?  

New Royal Enfield Bikes: రాయల్ ఎన్‌ఫీల్డ్ నుంచి 2 క్రేజీ బైక్స్ లాంచ్, ఏకంగా 648cc ట్విన్ ఇంజిన్ తో!

Telangana Loksabha Election Results: కాంగ్రెస్ అభ్యర్థి రఘువీర్ రెడ్డి ప్రభంజనం.. భారీ మెజార్టీతో గెలుపు

Traffic diversions in Hyderabad due to counting of votes: ఎన్నికల కౌంటింగ్.. హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు!

Telangana in Debt Trap | తెలంగాణ ఆర్థిక పరిస్థితి దయనీయం.. రుణ వడ్డీల చెల్లింపులకే భారీగా ఖర్చు

Big Stories

×