Formula-E case: ఫార్ములా ఈ కారు రేసు దర్యాప్తు స్పీడ్ అందుకుందా? కచ్చితంగా సోమవారం ఏసీబీ ముందుకు కేటీఆర్ హాజరవుతున్నారా? మంగళవారం ఈడీ విచారణకు డుమ్మా కొట్టే ఛాన్స్ ఉందా? విచారణ నేపథ్యంలో మీడియా ఫోకస్ లేకుండా నిరసనలకు పార్టీ పిలుపు ఇచ్చిందా? వారం రోజులుగా న్యాయవాదులు ఏమని సలహా ఇచ్చారు? ఇవే ప్రశ్నలు వెంటాడుతున్నాయి?
హైదరాబాద్‌లో జరిగిన ఫార్ములా ఈ కారు రేసు కేసుపై దర్యాప్తు స్పీడందుకుంది. ఈ కేసు విచారణ నిమిత్తం మాజీ మంత్రి కేటీఆర్ సోమవారం ఏసీబీ ఎదుట హాజరు కానున్నారు. ఇప్పుడు కచ్చితంగా కేటీఆర్ విచారణకు హాజరుకావాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఒకవేళ డుమ్మా కొడితే దీన్ని షాకుగా చూపించి అరెస్ట్ చేసే ఛాన్స్ వుంది. అందుకే మాజీ మంత్రి విచారణకు రానున్నారు.
విచారణలో అధికారులు సంధించే ప్రశ్నలకు ఏ విధంగా సమాధానాలు చెప్పాలి అనేదానికి ఇప్పటికే ప్రిపేర్ అయ్యారట కేటీఆర్. ఏసీబీ దాదాపు 40 ప్రశ్నలు రెడీ చేసినట్టు సమాచారం. నిధుల చెల్లింపుతోపాటు అంతకు ముందు జరిగిన వివరాలపై ప్రశ్నలు రెడీ చేసినట్టు సమాచారం.
ఈ కార్ రేస్ ఒప్పందాలు ఏ లెక్కన జరిగాయి? ఎవరికీ లాభం జరిగింది? జరిగిన నష్ట మెంత? గ్రీన్ కో ఎందుకు తప్పుకుంది? వాళ్ళకు మిరిచ్చిన అభయం ఏంటి? రూ. 55 కోట్ల చెల్లింపులు ఎలా జరిగాయి? కేబినెట్ ఆమోదం ఎందుకు తీసుకోలేదు? ఏక పక్ష నిర్ణయాలు సొంత లాభం కోసం కాదా? మీ ఆదేశాలతో చెల్లింపులు చేశామని అధికారులు చెబుతున్నది వాస్తవం కాదా?
ఎన్నికల కోడ్ సమయంలో మనీ ట్రాన్స్ ఫర్ చేయడం దుర్వినియోగం కాదా? ఆర్‌బీఐ ఫైన్ వేసేవరకు వెళ్లిందంటే ఎవరికి లాభం చేకూరింది? గ్రీన్ కో యాజమాన్యం ఎప్పటి నుంచి తెలుసు? మీడియటర్స్ ఎవరు? వాళ్లకు లాభం చేకూర్చాలన్న ఆలోచన మీదేనా? అప్పటి సర్కార్ దా? నెపం అధికారులపై వేయడం తప్పించుకోవడం కాదా?
ఈ కేసుకు సంబంధించి ఇప్పటివరకు ఏసీబీ సేకరించిన ఆధారాలు దగ్గర పెట్టి విచారించనుంది ఏసీబీ స్పెషల్ టీమ్. బుధవారం- సీనియర్ ఐఏఎస్ అధికారి అర్వింద్ కుమార్, గురువారం- బీఎల్ఎన్ రెడ్డిలను విచారించనుంది ఏసీబీ.
ALSO READ: రైతు కూలీలకు సర్కార్ గుడ్ న్యూస్.. వారి ఖాతాల్లో రూ.12 వేలు ఎప్పటి నుంచి అంటే..
ఏసీబీ అధికారులు అడిగే ప్రశ్నలకు ఏ విధంగా సమాధానాలు ఇవ్వాలనే దానిపై ఢిల్లీ న్యాయవాదులు టీమ్ ఇప్పటికే కేటీఆర్‌కు సలహాలు ఇచ్చారట. క్రిటికల్ ప్రశ్నలకు మాత్రం తెలీదు.. మరిచిపోయాను అని మాత్రమే చెప్పమన్నారట. చెప్పే ప్రతీ జవాబు అధికారుల మెడకు చుట్టుకునేలా ఉండాలని చెప్పినట్టు సమాచారం. ఎందుకంటే న్యాయస్థానంలో బెయిల్ సందర్భంగా అధికారుల మెడకు చుట్టుకునేలా వాదోపవాదనలు జరిగాయి.
ఇవాళ విచారణలో కేటీఆర్ ఇచ్చే సమాధానాలు బట్టి, రేపు రావాలా వద్దా అనేది అధికారులు నిర్ణయించనున్నారు. ఎందుకంటే మంగళవారం (ఈనెల 7న) విచారణకు హాజరుకావాలని ఈడీ ఇప్పటికే నోటీసులు ఇచ్చింది. ఈడీ విచారణకు డుమ్మా కొట్టాలని ఢిల్లీ న్యాయవాదులు సలహా ఇచ్చారట.
తొలిసారి విచారణ ఎదుర్కొబోతున్న కేటీఆర్‌పై మీడియా అటెక్షన్ ఎక్కువగా ఉంటుంది. అయితే ఈ విషయం గ్రామీణ ప్రాంతాలకు వెళ్లకుండా, పార్టీ తరపున నిరసన కార్యక్రమాలకు ఆయన పిలుపు ఇచ్చారు. అయినా నేషనల్ మీడియా ఫోకస్ అంతా కేటీఆర్‌పై ఉండబోతోంది.
న్యాయవాదులతోనే విచారణకు హాజరవుతా : కేటీఆర్
ACB కార్యాలయం దగ్గరలో కేటీఆర్ వాహనాన్ని ఆపిన పోలీసులు
అడ్వకేట్లకు లోపలికి అనుమతి లేదని కేటీఆర్ ఒక్కరికే అనుమతి ఉందన్న పోలీసులు
అడ్వకేట్లతోనే విచారణకు వస్తానంటున్న కేటీఆర్
ACB డీజీతో మాట్లాడి చెప్తామన్న పోలీసులు pic.twitter.com/Fr4AO3T6MZ
— BIG TV Breaking News (@bigtvtelugu) January 6, 2025