OTT Movie : ఓటిటి ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ అవుతున్న సినిమాలలో, సైకో థ్రిల్లర్ సినిమాలు గూజ్ బమ్స్ తెప్పిస్తుంటాయి. సైకో కిల్లర్లు చేసే హింస వణుకు పుట్టిస్తూ ఉంటుంది. అంత దారుణంగా చిత్రహింసలు పెట్టి, మనుషులను చంపుతూ ఉంటారు. హారర్ సినిమాలకన్నా ఇటువంటి సినిమాలు భయం ఎక్కువగా తెప్పిస్తాయి. ఒక భయంకరమైన సైకో కిల్లర్ మూవీ ఓటిటి ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ అవుతుంది. ఈ మూవీ పేరు ఏమిటి? ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో వివరాల్లోకి వెళితే…
అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video)లో
ఈ సైకో థ్రిల్లర్ మూవీ పేరు ‘ది మిడ్ నైట్ మీట్ ట్రైన్‘ (The midnight meat train). ఈ మూవీకి Ryuhei Kitamura దర్శకత్వం వహించారు. ఇందులో బ్రాడ్లీ కూపర్, లెస్లీ బిబ్, బ్రూక్ షీల్డ్స్, రోజర్ బార్ట్, టెడ్ రైమి, విన్నీ జోన్స్ నటించారు. స్క్రిప్ట్‌ను జెఫ్ బుహ్లర్ నిర్వహించారు.ఈ సైకో థ్రిల్లర్ మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో స్ట్రీమింగ్ అవుతుంది.
స్టోరీ లోకి వెళితే
హీరో ఒక ఫోటోగ్రాఫర్ గా పనిచేస్తుంటాడు. ఇతనికి కెరీర్ పరంగా హెల్ప్ చేయాలని హీరోయిన్ అనుకుంటుతుంది. ఒకసారి తనకు తెలిసిన ఒక ఆర్ట్ గ్యాలరీ ఓనర్ కి హీరోని పరిచయం చేపిస్తుంది. ఇతని ఫోటోలు చూసిన ఆమె, ఇంకా భయపెట్టే ఫోటోలు కావాలని చెప్తుంది. హీరో అందుకోసం రాత్రిపూట ఫోటోలు తీయడానికి వెళ్తాడు. ఈ క్రమంలో రైల్వే స్టేషన్లో ఒక అమ్మాయిని కొంతమంది దుండగులు ఎత్తుకెళ్లడానికి ప్రయత్నిస్తారు. హీరో వాళ్ళని ఫోటోలు తీయడంతో అక్కడి నుంచి వెళ్ళిపోతారు. అయితే ఆ అమ్మాయి హీరోకి థాంక్స్ చెప్పి ట్రైన్లో వెళ్ళిపోతుంది. వెళ్ళిపోతున్నప్పుడు కూడా ఒక ఫోటో తీస్తాడు. ఆ మరుసటి రోజు ఆ అమ్మాయి చనిపోయి ఉంటుంది.ఈ విషయం పేపర్లో చూసి హీరో తెలుసుకుంటాడు. అయితే విషయం కనుక్కోవాలని ట్రైన్ దగ్గరికి వస్తాడు. అక్కడ అనుమానస్పదంగా కనపడ్డ ఒక వ్యక్తిని ఫాలో చేస్తాడు. అతడు కాలర్ పట్టుకుని వార్నింగ్ ఇవ్వడంతో, అప్పుడు అర్థమవుతుంది హీరోకి ఆమెను చంపింది ఇతడే అని.
అతని చేతికి ఉన్న రింగ్, అమ్మాయి ఎక్కినప్పుడు పక్కనున్న వ్యక్తికి ఉన్న రింగ్ ఒకటే అని తాను తీసిన ఫోటోలద్వార తెలుసుకుంటాడు. ఈ క్రమంలో అతన్ని ఫాలో చేయాలనుకుంటాడు. ట్రైన్లో ఆ సైకో కిల్లర్ దొరికిన వాళ్ళని దొరికినట్టుగా చంపుతూ ఉంటాడు. ఇతనికి పోలీసులు కూడా సహకరిస్తూ,చంపిన వాళ్లను ఒక చోటికి తీసుకెళ్తారు. హీరో అతన్ని ఫాలో చేస్తూ ఒళ్ళు గగుర్పాటుచేసే ఈ విషయాలు తెలుసుకుంటాడు. చివరికి ఆ ట్రైన్లో హీరోయిన్ కూడా ఎక్కుతుంది. ఆ సైకో కిల్లర్ ఆమెను దారుణంగా కొట్టి చంపడానికి ప్రయత్నిస్తాడు. హీరో అక్కడికి వచ్చి ఆమెను కాపాడటానికి ప్రయత్నిస్తాడు. చివరికి హీరో ఆ సైకో కిల్లర్ని చంపేస్తాడా? సైకో కిల్లర్ చేతిలో హీరో బలవుతాడా? హీరోయిన్ ప్రాణాలతో బయటపడుతుందా? సైకో కిల్లర్ అంతమందిని ఎందుకు చంపుతున్నాడు? ఈ విషయాలు తెలుసుకోవాలనుకుంటే ఈ సైకో థ్రిల్లర్ మూవీని మిస్ కాకుండా చూడండి.