BigTV English

Batti Vikramarka : రైతు కూలీలకు సర్కార్ గుడ్ న్యూస్.. వారి ఖాతాల్లో రూ.12 వేలు ఎప్పటి నుంచి అంటే..

Batti Vikramarka : రైతు కూలీలకు సర్కార్ గుడ్ న్యూస్.. వారి ఖాతాల్లో రూ.12 వేలు ఎప్పటి నుంచి అంటే..

Batti Vikramarka : తొమ్మిదేళ్లు పరిపాలించి రాష్ట్ర ప్రజలను మోసగించిన బీఆర్ఎస్ నాయకులు.. ఇప్పుడు కాంగ్రెస్ పై అసత్యాలు ప్రచారం చేస్తున్నారంటూ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆగ్రహం వ్యక్తం చేశారు. ధనిక రాష్ట్రంగా ఏర్పడిన తెలంగాణ నేడు అప్పులతో నెట్టుకురావాల్సిన దుస్థితికి కారణం బీఆర్ఎన్ నాయకుల అసమర్థ పరిపాలన కారణంగానే అని విమర్శించారు. వరంగల్ జిల్లాలో పర్యటించిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క రూ. 8.4 కోట్లతో నిర్మించనున్న మూడు 33/11 కేవి విద్యుత్ సబ్ స్టేషన్లకు శంకుస్థాపన చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడారు.


మిగుల రాష్ట్రంగా ఏర్పడిన తెలంగాణలో రైతులకు ఏ విధంగానూ న్యాయం చేయలేకపోయారని విమర్శించారు. ప్రస్తుత ప్రజా ప్రభుత్వంలో రైతులకు ఇచ్చిన హామీ మేరకు రుణమాఫీ చేసినట్లు చెప్పిన భట్టి విక్రమార్క.. బీఆర్ఎస్ పార్టీ హయంలో రైతులకు రూ. లక్ష రూపాయల రుణమాఫీ కూడా చేయలేకపోయారని దుయ్యబట్టారు. రాష్ట్రం నెత్తిన రూ.7 లక్షల కోట్ల అప్పు మోపిన బీఆర్ఎస్ నేతలు.. రైతులకు సంపూర్ణ రుణమాఫీ చేయలేక చేతులెత్తేశారని అన్నారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం.. నీతిగా, నిబద్ధతతో పనిచేస్తుందని చెప్పారు. ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలను కచ్చితంగా అమలు చేసి తీరుతామని ప్రకటించారు. ఇప్పటికే.. రూ.1 లక్ష వరకు రైతుల రుణ మాఫీ చేశామని, రానున్న కొద్ది రోజుల్లోనే రూ. 2 లక్షల లోపు రుణాలున్న రైతులకు రుణమాఫీ చేస్తామని ప్రకటించారు.

రాష్ట్రంలో సాగులో ప్రతీ ఎకరాకు రైతు భరోసా అందిస్తామని ప్రకటించిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క.. ఎలాంటి షరతులు లేకుండానే పెట్టుబడి సాయం అందిస్తామని ప్రకటించారు. జనవరి 26 నుంచి ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్నట్లు తెలిపారు. ఎవరు అడ్డు పడినా.. ఎన్ని కుట్రలు చేసినా రైతు భరోసాను అమలు చేసి తీరుతామని భట్టి విక్రమార్క వ్యాఖ్యానించారు.


రైతులతో పాటు రైతు కూలీలకు కాంగ్రెస్ ప్రభుత్వం తోడుగా ఉంటుందని హామి ఇచ్చిన భట్టి విక్రమార్క.. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పేరుతో భూమిలేని వ్యవసాయ కూలీలకు ఏడాదికి 12 వేలు ఇవ్వనున్నట్లు ప్రకటించారు. రైతుల పక్షానే కాంగ్రెస్ ప్రభుత్వం నిలబడుతుందని, ఇచ్చిన మాటలను నిలబెడుతూ కాంగ్రెస్ కార్యకర్తలను తలెత్తుకునేలా చేస్తామంటూ హామి ఇచ్చారు.

ప్రతిపక్ష పార్టీలు చేస్తున్న ఆరోపణలపై స్పందించిన భట్టి విక్రమార్క.. బీఆర్ఎస్ పార్టీ తీరుపై అసహనం వ్యక్తం చేశారు. హరీష్ రావు, కేటీఆర్ అధికారంలో ఉన్నప్పుడు ఏం చేయలేదన్న డిప్యూటీ సీఎం..  ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంపై అడ్డగోలుగా విమర్శుల చేస్తున్నారని మండిపడ్డారు. సోషల్ మీడియాను అడ్డుపెట్టుకుని నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారని అన్నారు. కొన్ని మీడియా ఛానెళ్లను వాడుకుని దుష్ప్రచారం చేస్తున్నారని అన్నారు.

బీఆర్ఎస్ హయంలో పబ్లిక్ సర్వీస్ ద్వారా నోటిఫికేషన్లు జారీ చేయడం.. పరీక్షల్లో పేపర్ లీకేజీలకు పాల్పడడం తప్పా ఉద్యోగాలు ఇచ్చింది లేదన్నారు. కానీ.. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత 56 వేల మందికి పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా ఉద్యోగాలు ఇచ్చినట్లు గుర్తు చేశారు.

Also Read : ఓల్డ్ సిటీ మెట్రో నిర్వాసితులకు రేపే డబ్బులు పంపిణీ.. ఇక మిగిలింది కూల్చివేతలే

రైతులకు, విద్యార్థులకు, ఉద్యోగులకు అన్ని విధాల అండగా నిలిచే ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అని అన్న భట్టి విక్రమార్క.. కాంగ్రెస్ చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు.

Related News

Weather News: రాష్ట్రంలో అతిభారీ వర్షం.. ఈ 12 జిల్లాల్లో దంచుడే దంచుడు.. పిడుగులు కూడా..?

Weather Update: వర్షపాతాన్ని ఎలా కొలుస్తారు ? రెడ్, ఆరెంజ్, ఎల్లో అలెర్ట్‌కు అర్థం ఏంటి ?

Sunil Kumar Ahuja Scam: వేల కోట్లు మింగేసి విదేశాలకు జంప్..! అహూజా అక్రమాల చిట్టా

Phone Tapping Case: ప్రూఫ్స్‌తో సహా.. ఉన్నదంతా బయటపెడ్తా.. సిట్ విచారణకు ముందు బండి షాకింగ్ కామెంట్స్

Hyderabad Drugs: హైదరాబాద్‌‌ డ్రగ్స్‌ ఉచ్చులో డాక్టర్లు.. 26 లక్షల విలువైన?

Rain Alert: ఓర్నాయనో.. ఇంకా 3 రోజులు వానలే వానలు.. ఈ జిల్లాల్లో పిడుగుల పడే అవకాశం

Big Stories

×