BigTV English

KTR: కేటీఆర్ ఢిల్లీ టూర్ వెనుక.. లోగుట్టు బయటకు

KTR: కేటీఆర్ ఢిల్లీ టూర్ వెనుక.. లోగుట్టు బయటకు

KTR: కారు పార్టీ నేత కేటీఆర్ ఢిల్లీ టూర్‌లో ఏం జరిగింది? దీనికి సంబంధించి రోజు వార్త ఎందుకు బయటకు వస్తోంది? ఫార్ములా రేస్ మీద వెళ్లలేదా? ఆ అర్థరాత్రి ఎవరితో సమావేశమయ్యారు? పాస్‌పోర్టు కోసమా? అవుననే సంకేతాలు బలంగా వినిపిస్తున్నాయి.


కేటీఆర్ ఢిల్లీ టూర్ గురించి ఓ కొత్త విషయం పొలిటికల్ సర్కిల్స్‌లో హంగామా చేస్తోంది. దాని సారాంశం ఏంటంటే.. కేవలం పాస్‌పోర్టు వ్యవహారం కోసం వెళ్లినట్టు తెలుస్తోంది. ఫార్ములా రేస్ కేసు నుంచి తప్పించుకునేందుకు వెళ్లినట్టు తొలుత ప్రచారం సాగింది.

అసలు వాస్తవం ఏంటంటే.. ఫోన్ ట్యాపింగ్ నిందితుడు ప్రభాకర్‌రావు పాస్ పోర్టును శాశ్వతంగా రద్దు చేయాలని కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖను తెలంగాణ పోలీసులు కోరారు. అలాగే రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేయాలని ప్రస్తావించారు.


ఒకవేళ పాస్‌పోర్టును కేంద్రం శాశ్వతంగా రద్దు చేస్తే, అమెరికా పోలీసులే ప్రభాకర్‌రావును ఇండియాకు అప్పగించాలి. ఈ క్రమంలో ప్రభాకర్‌రావు పోలీసులకు చిక్కాడంటే.. ఫోన్ ట్యాపింగ్ కథ మొత్తం బట్టబయలు అవుతుంది.

ALSO READ: రాజకీయ పలుకుబడితో సాల్వో దందాలు.. కోర్టు ఆర్డర్స్‌ సైతం లెక్కచేయని వైనం.. ఆరాచకాలు ఆగేనా?

ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తు గమనించిన కేటీఆర్, నేరుగా ఢిల్లీ వెళ్లి బీజేపీ పెద్దలతో మంతనాలు సాగించినట్టు పొలిటికల్ సర్కిల్స్‌లో జోరుగా ప్రచారం సాగుతోంది. ప్రభాకర్‌రావు పాస్‌పోర్టును రద్దు చేయవద్దని, రెడ్ కార్నర్ నోటీసులు ఇవ్వకుండా విదేశీ వ్యవహారాల శాఖకు చెప్పాలని రిక్వెస్ట్ చేశారట.

ఢిల్లీ పెద్దలతో కాళ్ల బేరానికి వచ్చాడట కేటీఆర్. ఈ క్రమంలో కమలానికి అంతర్గతంగా సపోర్టు చేస్తానని, రాబోయే ఎన్నికల్లో ఇరు పార్టీలు కలిసి పోటీ చేద్దామని అన్నారట. అందుకు ఢిల్లీ పెద్దలు ససేమిరా అన్నట్లు సమాచారం.

పార్టీని కమలంలో కలిపాలని షరతు పెట్టారట. మరి ఏమైందో తెలీదుగానీ ఆ చర్చలు పెండింగ్‌లో పడినట్టు తెలుస్తోంది. కేటీఆర్ ఢిల్లీ నుంచి హైదరాబాద్‌కు రాగానే.. ఫోన్ ట్యాపింగ్ కేసు కదలిక మొదలైంది. కారు పార్టీకి చెందిన నేతలు విచారణకు హాజరుకావడం మొదలైంది. మొత్తానికి ఫోన్ ట్యాపింగ్ వెనుక ఏదో జరుగుతున్నట్లు తెలంగాణ రాజకీయ నేతలు చర్చించుకుంటున్నారు.

Related News

MLA Mallareddy: రాజకీయాలకు గుడ్ బై.. బిగ్ బాంబ్ పేల్చేసిన మల్లారెడ్డి.. అసలేమైంది..?

Weather News: రాష్ట్రంలో అతిభారీ వర్షం.. ఈ ప్రాంతాల్లో కుండపోత వాన.. ఇంట్లోనే ఉండండి..

Bandi Sanjay: కేటీఆర్ కు ఉన్న అతి తెలివి నాకెక్కడ? – బండి సంజయ్

Hyderabad floods: హైదరాబాద్‌ ఇక మునగదు.. సీఎం రేవంత్ రెడ్డి అదిరి పోయే ప్లాన్ ఇదే!

Bandi Sanjay: వావి వరుసలు లేకుండా వారి ఫోన్లు ట్యాపింగ్ చేశారు.. బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు

Weather News: రాష్ట్రంలో అతిభారీ వర్షం.. ఈ 12 జిల్లాల్లో దంచుడే దంచుడు.. పిడుగులు కూడా..?

Big Stories

×