Satyabhama Today Episode November 19 th : నిన్నటి ఎపిసోడ్ లో.. హర్ష విశాలాక్షి వాళ్ల నాన్న మాట్లాడుకునే మాటలను మైత్రి వింటుంది. వీళ్లు నన్ను ఎలాగైనా వదిలించుకోవాలని చూస్తున్నారు కానీ వీళ్ళ నుంచి నేనే వెళ్ళిపోవాలని మైత్రి డిసైడ్ అవుతుంది. వీళ్ళ ఆలోచనలకు ముందే నేను వెళ్లిపోవడం బెస్ట్.. ఇలా చేస్తే నా హర్ష నాకు దగ్గర అవుతాడని మైత్రి ఇంట్లో నుంచి వెళ్ళిపోతుంది. పొద్దున్నే అందరికి షాక్ ఇస్తూ పెట్టే సర్దుకొని బయటకు వచ్చేస్తుంది. బయటకు రాగానే హర్ష వాళ్ళ ఇంట్లో ఉన్న అందరు మైత్రిని అడుగుతారు. మైత్రి ఏదొక సాకు చెప్పి దూరంగా ఉంటే హర్ష దగ్గరవుతాడు అని వెళ్ళిపోతుంది. ఇక నందిని హమ్మయ్య అనుకోని పీడ పోయిందని అనుకుంటుంది. ఇక మైత్రి వెళ్ళిపోగానే నందిని ఆనందానికి అవధులు లేవు.. ఇక సత్య చిన్న మామయ్యతో నిజం రాబట్టే పనిలో ఉంటుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది..
ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. మైత్రి పీడ వదిలిపోయిందని నందిని సంతోషంగా ఉంటుంది. భర్త కోసం ఆశగా రెడీ అవుతూ ఉంటుంది. అప్పుడే హర్ష వాళ్ళ మామ లోపలికి వస్తుంది. ఈ రోజులు భర్తను దూరం పెట్టావు ఇప్పుడు దగ్గర చేసుకుంటున్నావా బాగానే రెడీ అవుతున్నావు అనేసి అంటుంది. రెడీ అవుతున్నానని నువ్వు కుళ్ళు కుంటున్నావు కదా అని అనగానే కుళ్ళు అని వెటకారంగా మాట్లాడుతుంది. నందిని ఇంకా రెడీ అవ్వమని చెప్పి బయటకు వెళుతుంది. అప్పుడే హర్ష ఇంట్లోకి వస్తాడు. పాపం మైత్రి వంటరిగా ఎలా ఉంటుందో అని నందిని దగ్గరకొచ్చి అడుగుతాడు. అది విన్న నందిని కోపంతో రగిలిపోతుంది. నీకోసం గింతగాన రెడీ అయితే నా గురించి ఆలోచించకుండా మైత్రి మైత్రి అని మైత్రి పేరు జపం చేస్తున్నావా? ఆమె ఇంట్లో ఉన్న అదే పేరు బయట ఉన్న అదేనా అనేసి కోప్పడుతుంది. నీకోసం ఇంత గానం గంట నుంచి రెడీ అయ్యాను కనీసం చూడను కూడా చూడలేదు కానీ మైత్రి పేరు మాత్రం తీస్తున్నావ్ అనేసి హర్షను బయటకి ఏం చేస్తుంది.
రాత్రి రా లోపలికి వస్తే అస్సలు బాగోదు అని తోసేసి గదికి గడియ పెట్టుకుంటుంది. ఇక చక్రవర్తి దగ్గరికి సంజయ్ వస్తాడు. డాడీ ఎందుకు ఏమిటి అని అడక్కుండా నేను అన్న దానికి సమాధానం చెప్పండి అని అడుగుతాడు. నాకు అర్జెంటుగా రెండు కోట్లు కావాలని సంజయ్ అడుగుతాడు. కానీ దానికి చక్రవర్తి లేవని చెప్తాడు. నిన్న పెద్దనాన్నకి అడక్కున్న ఇచ్చావు.. నేను అడిగిన ఇవ్వవేంటి అని సంజయ్ అడుగుతాడు. ఇక చక్రవర్తి రెండు కోట్ల ఎందుకు అనేసి ప్రశ్నలు వేస్తాడు. నేనొక ఫైనాన్స్ స్టార్ట్ అప్ కంపెనీ స్టార్ట్ చేస్తాను. సరదాగా దాన్ని డెవలప్ చేద్దామని అనుకుంటున్నా అని అనగానే చక్రవర్తి అలాంటి ఆలోచనలు మానుకో బిజినెస్ అనేది సరదాగా చేసేది కాదు సీరియస్గా తీసుకునేది నువ్వు మన రిసార్ట్ పనులు చూసుకొని అనగానే సంజయ్ నాకు రేపటికల్లా డబ్బు అరేంజ్ చేయండి లోపలికి వెళ్ళిపోతాడు.
అప్పుడే సత్య అక్కడికొస్తుంది. మామయ్య మీరు బాగానే ఉన్నారా మీతో నేను మాట్లాడాలి అని అడుగుతుంది. ఏంటో చెప్పమ్మా అనేసి చక్రవర్తి అంటాడు. దానికి మీ సొంత కొడుకు రెండు కోట్ల అడిగితే ఇవ్వలేదు కానీ క్రిష్ ఆడకుండానే మీరు ఐదు కోట్లు ఇచ్చారు అని అడుగుతుంది. హాస్పిటల్లో మా బిడ్డల మార్పు గురించి నాకు తెలుసు మామయ్య అన్ని నిజాలు తెలుసుకుని నేను మిమ్మల్ని అడుగుతున్నాను అసలు నిజం ఏంటో చెప్పండి ప్లీజ్ అన్న కొడుకే కదా అని నిలదీస్తుంది. నువ్వు తప్పుగా ఆలోచిస్తున్నావమ్మ దీని వల్ల గొడవలు జరిగిపోతాయని చక్రవర్తి అంటాడు. నేను డబ్బులు ఇచ్చింది క్రిష్ కి కాదు నా అన్నకు అంటాడు. సత్య ఎన్ని సార్లు అడిగినా అసలు నిజం చక్రవర్తి చెప్పడు. మిషన్ ఇంతటితో వదిలేస్తే బాగుంటుంది లేకపోతే రెండు కుటుంబాల్లో గొడవలు జరిగిపోతాయని చక్రవర్తి అంటాడు. ఇక మావయ్య ఎందుకు నిజం చెప్పట్లేదో తెలియట్లేదు ఈ నిజాన్ని ఎలాగైనా రేపటిలోగా బయట పెడతానని సత్య అనుకుంటుంది.
హర్ష బామ్మ పక్కన నిద్రపోతుంటే నందిని వెళ్లి బామ్మను నిద్ర లేపుతుంది. నీ వయసెంత మనవడు వచ్చి నీ పక్కన పడుకోగానే పడుకోబెట్టుకుంటావా పెళ్ళాం దగ్గరికి వెళ్ళమని చెప్పవా అనేసి అడుగుతుంది. కనీసం కొంచెం కూడా బుద్ధి లేదా నీకు వయసుకు తగ్గట్టు పనులు చేయవా అనేసి నందిని వామ్మకు వార్నింగ్ ఇచ్చి వెళ్తుంది. ఇక బామ్మ హర్షం లేపి నాలుగు పీకి లోపలికి పంపిస్తుంది. ఇద్దరి మధ్య గొడవలు తగ్గిపోతాయి. ఇక మహదేవయ్యకు ఎమ్మెల్యే రావడంతో క్రిష్ సంతోషం పట్టలేక సత్యతో పంచుకోవాలని వస్తాడు. సత్య చక్రవర్తి నిజం చెప్పలేదని ఆలోచిస్తూ ఉంటుంది. మా బాపుకి ఎమ్మెల్యే టికెట్ కన్ఫామ్ అయిపోయింది ఇదంతా బాబాయ్ వల్లే అనేసి క్రిష్ అంటాడు.. రేపు నీకు అసలు నిజం తెలుస్తుంది క్రిష్ ఇప్పుడు నన్నేం అడగద్దు అనద్దు అనేసి సత్య చెబుతుంది.. దాంతో ఎపిసోడ్ పూర్తి అవుతుంది. ఇక రేపటి ఎపిసోడ్లో చక్రవర్తి నుంచి నిజం రాబట్టింది సత్య. చక్రవర్తి తన తండ్రి అని క్రిష్ తెలుస్తుందేమో చూడాలి..