కుక్క కాటుకు..
చెప్పు దెబ్బ మందా..?
⦿ రాజకీయ పలుకుబడితో సాల్వో దందాలెన్నో!
⦿ కోర్టు ఆర్డర్స్ సైతం లెక్కచేయని వైనం
⦿ స్వేచ్ఛ ప్రత్యేక కథనం
⦿ 3వేల ఎకరాల సొంత భూమి ఉన్నా 350 ఎకరాల ప్రభుత్వ భూమి కబ్జా
⦿ సాల్వో చైర్మన్ జయరాం రెడ్డి గ్యాంగ్ అరాచకాలకు లెక్కే లేదా?
⦿ రెగ్యులరైజేషన్ కోసం హైకోర్టులో పిటిషన్
⦿ చర్యలు తీసుకోవాలని ఆదేశాలు వచ్చినా కదలని ప్రభుత్వ యంత్రాంగం
⦿ స్వేచ్ఛ ఇన్వెస్టిగేషన్ కథనాల తర్వాత మారిన బోర్డులు
⦿ ప్రభుత్వ భూములను కొట్టిసి, నాయకులతో కలిసి దందాలు?
⦿ పెసా యాక్ట్ రూల్స్ పాటించని సాల్వో కంపెనీకి ప్రభుత్వ టెండర్లు ఎలా?
⦿ క్యాన్సిల్ చేసే దమ్ము లేదా? వెనకుండి నడిపిస్తున్నదెవరు?
⦿ అక్రమ ఫ్యాక్టరీల పేలుడు పదార్థాలు ఉగ్రవాదుల చేతికి చేరవనే గ్యారెంటీ ఎంటి?
దేవేందర్ రెడ్డి చింతకుంట్ల, 9848070809
స్వేచ్ఛ ఇన్వెస్టిగేషన్ టీం: Land Grabbing: సాల్వో ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్. కీసర గుట్టల్లో గుట్టుగా సాగుతున్న ఈ కంపెనీ అక్రమ వ్యవహారాలన్నింటినీ ‘స్వేచ్ఛ’ బయటపెట్టింది. ప్రభుత్వ భూమిని కబ్జా చేసి మరీ సాగిస్తున్న దందాను వెలుగులోకి తెచ్చింది. ఇలాంటి కంపెనీకి సింగరేణి టెండర్ దక్కడంపై, ఇన్నేళ్లుగా రాజకీయ పలుకుబడితో సాగుతున్న అక్రమాలను జనం ముందు ఉంచింది.
సాల్వో కంపెనీపై మరింత లోతుగా అధ్యయనం చేస్తే మరిన్ని సంచలన నిజాలు బయటపడ్డాయి. ఏ పూటకు ఆ పూట మారు పేరుతో మాయ చేసే దందాల విలువ వేల కోట్లుగా తేలింది. 350 ఎకరాల ప్రభుత్వ భూమిని కబ్జా చేయడం వెనుక చైర్మన్ జయరాం రెడ్డి అండ్ టీం సాగించిన లీలలు అన్నీ ఇన్నీ కావు. ఎక్స్ ప్లోజివ్ కంపెనీ పెడుదామని తమిళనాడుకు చెందిన ఆర్‌ఆర్ ఎనర్జిటిక్స్ కంపెనీ 1996లో 3,175 ఎకరాలు పూలింగ్ చేసింది. అయితే, ఇక్కడి వ్యవహారం చూసి వెనక్కి తగ్గింది.
ఇదే క్రమంలో కీసరలో ఇల్లీగల్‌గా పేలుడు పదార్ధాలను అమ్ముకునేందుకు జయరాం రెడ్డి కంపెనీ ఏర్పాటు చేశాడు. ఆర్ఆర్ భూములను కైవసం చేసుకునేలా స్వాధీనం చేసుకున్నాడు. కానీ, అక్కడ కంపెనీ పెట్టకుండా, అదే అనుమతులతో అక్రమంగా ఏర్పాటు చేసుకున్న చిన్నపాటి ఫ్యాక్టరీని ప్రభుత్వ భూముల్లో, ఉమ్మడి నల్గొండ, రంగారెడ్డి జిల్లాల బార్డర్‌లో లిటగేషన్ ఉన్న భూముల్లో అక్రమంగా నిర్మించాడు. ఇరు జిల్లాల ప్రభుత్వ భూమియే వివాదంగా సాల్వో పేరుతో అమోనియం నైట్రేట్ పదార్థాల నిల్వల పేరుతో 350 ఎకరాలు కబ్జా చేశాడు.
అడిగిన వారికి అంతకు మించి లంచాలు, సెటిల్మెంట్స్, లీడర్స్‌కి ఎలక్షన్ ఫండింగ్ ఇవ్వడంతో గుట్టల మాటున జరిగే దందాలను ఎవరూ ఎత్తి చూపలేదు. బీఆర్ఎస్ ప్రభుత్వ పెద్దలు వంగా రాజేశ్వర్ రెడ్డి అనే బినామీని ఆర్ఆర్ ఎనర్జిటిక్స్ సంస్థలో డైరెక్టర్‌గా చేర్చారు. జయరాం రెడ్డితో కలిసి అతను సాగించిన దందాలకు లెక్కేలుదు. జిల్లాలో కాంగ్రెస్ కండువాతో నడిచే కొందరికి సెటిల్మెంట్స్ చేశారు. ఓ ఎమ్మెల్సీకి, మరో మాజీ జెడ్పీటీసీకి కేసులంటూ, మీడియా అంటూ ఏదో రకంగా కోట్లాది రూపాయలు సెటిల్మెంట్స్ చేశారు.
ఇటీవలే కీలక టెండర్
సింగరేణిలో రూ.155 కోట్ల విలువ చేసే ఎక్స్‌ప్లోజివ్‌ని టెండర్స్ మార్చి దక్కించుకున్నాడు జయరాం రెడ్డి. ఈయన నుంచి ఉత్పత్తి అయ్యేవి ఎక్కడో ఆ టెండర్స్‌లో చెప్పలేదు. పైగా, టెండర్ దక్కేలా పెద్దఎత్తున లాబీయింగ్‌లు జరిపాడు. ఈ నెల నుంచి ఈయన కంపెనీయే సింగరేణికి ముడి సరుకు సప్లై చేస్తుంది. అదంతా అక్రమంగా కబ్జా చేసిన ప్రదేశం నుంచే సరఫరా అవుతుందని గుర్తించడం లేదు. పెట్రోలియం అండ్ ఎక్స్‌ప్లోజివ్ యాక్ట్(పెసా) కి విరుద్ధంగా సాల్వో కంపెనీ వ్యవహారాలు ఉన్నాయి. వీటన్నింటిపై ఈడీ, సీబీఐ, ఐటీకి ఫిర్యాదు చేసేలా స్వేచ్ఛ ఇన్వెస్టిగేషన్ టీం వద్ద ఆధారాలున్నాయి.
కేసు ఎంటి? 2001 నుంచి 2024 వరకు మొట్టికాయలే!
రెండు జిల్లాల ప్రభుత్వ భూములను దర్జాగా కబ్జా చేసి, ప్రభుత్వం వద్ద ఉండే పెద్దలను మేనేజ్ చేసే ఈ పేలుడు పదార్ధాల మాఫియా, 2001లో సర్వే నెంబర్ 756, 786, 916, 917 కీసర రెవెన్యూలో 60 ఎకరాల్లో ఉన్నాం. 25 ఎకరాలు కబ్జా చేశాం. ఇందులో అసైన్డ్ దారుల నుంచి అక్రమంగా కొనుగోలు చేశామని తెలిపారు. సర్వే నెంబర్స్ మ్యాజిక్స్ అప్పటి నుంచే స్టార్ట్ చేశాడు జయరాం రెడ్డి. రిజిస్ట్రేషన్ కాని భూములను దొంగతనంగా రిజిస్ట్రేషన్ చేసుకున్నాడు. నోటరీలతో భూములను కాజేశాడు.
ఇతనికి ఉన్న భూమికి ఆనాడు కబ్జా చేసింది 60 ఎకరాలకు పైగానే రాజకీయ నాయకులకు మామూళ్లు ఇచ్చాడు. దాని ఫలితంగా ఈనాటికి ప్రభుత్వ భూమిని కబ్జా చేసింది 350 ఎకరాలకు చేరుకుంది. అయితే, 2022 జులై 6న రీజినల్ డిప్యూటీ డైరెక్టర్ సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ యాదాద్రి, మేడ్చల్ జిల్లా కలెక్టర్‌కి లేఖ రాశారు. అంతా అక్రమమే అని తేలింది. అప్పుడే జిల్లా నేత కోట్లాది రూపాయలు సెటిల్మెంట్లు చేసుకున్నారని ఆరోపణలున్నాయి. ఆ తర్వాత ఉచిత సలహాలు ఇచ్చి ఇంకా అదే సాల్వో ఇల్లీగల్ బిజినెస్‌లకు వత్తాసు పలుకుతున్నారని సమాచారం. వీరి వ్యవహారంపై ఇంటెలిజెన్స్ దర్యాప్తు మొదలు పెట్టినట్లు తెలుస్తోంది.
కొత్తగా 2024లో రిట్ పిటిషన్ 6170/2024 దాఖలు చేశారు. రామలింగంపల్లిలో 312 సర్వే నెంబర్స్‌లోని బై నెంబర్స్‌లో అక్రమంగా కొనుగోలు చేసింది 19.26 గుంటల భూమి ఉంది. మొత్తం 39 ఎకరాలు ఉందని తెలిపారు. దీంతో రెస్పాడెంట్స్ 2, 7లకు ఇన్వాల్వ్ కావొద్దని ఇంటిర్మ్ ఆర్డర్ ఇచ్చింది హైకోర్టు. దీనిపై ప్రభుత్వ అధికారులు వారి వాదనలను వినిపించారు.
రాజకీయ నాయకులను మేనేజ్ చేసినట్లు, అధికారులను మేనేజ్ చేయవచ్చు అనుకున్నారు. కానీ, వారంతా చట్ట ప్రకారం, రెవెన్యూ రికార్డుల ఆధారాలతో అఫిడవిట్లు వేశారు. అక్రమంగా 886, 887, 918లోని కీసరలో పేలుడు పదార్ధాలు తయారు చేస్తున్నారని తెలిపారు. అంకిరెడ్డి పల్లికి కిలో మీటర్ దూరంలోనే ఉందని అధికారులు రిపోర్టు ఇచ్చారు. దీంతో సర్వే చేసి చర్యలు తీసుకోవాలని జస్టిస్ కే లక్ష్మణ్ ధర్మాసనం తీర్పునిచ్చింది.
ఇంకా కొనసాగుతున్న రాజకీయ లాబీయింగ్
సాల్వో కంపెనీ వెనుక జిల్లాకు చెందిన కీలక నేత ప్రస్తుతం చక్రం తిప్పుతున్నాడు. హైకోర్టు తీర్పు జూలైలో వచ్చింది. రెండు నెలల్లో సర్వే చేసి బార్డర్స్ గుర్తించాలని ఆదేశాలు వచ్చాయి. కానీ, ఇప్పటికీ పూర్తి కాలేదు. దీనితో పాటు అప్పటి వరకు రెస్పాడెంట్స్ 2 నుంచి 7 వరకు ఎవరూ చర్యలు తీసుకోవద్దని ఆదేశాలు జారీ అయ్యాయి.
కానీ, ఇప్పటికీ సర్వే కాలేదు. హైకోర్టు ఆర్డర్స్ 2 నెలల తర్వాతనే స్వేచ్ఛ ఇన్వెస్టిగేషన్ కథనాలు ఇచ్చింది. ఇప్పటికీ అధికారులు సర్వే చేయలేదు. కానీ, సాల్వో కంపెనీ మూడు సార్లు బోర్డులను మార్చింది. స్వేచ్ఛ పత్రిక కథనాల ఎఫెక్ట్‌తోనే ఇది జరిగింది. అయితే, హైకోర్టు ఆదేశాలు మాత్రం అమలు కావడం లేదు.
పెసా యాక్ట్ ఏం చెబుతోంది?
పేలుడు పదార్థాల చట్టం 1884, పెట్రోలియం చట్టం 1934, మండే పదార్థాల చట్టం 1952, పర్యావరణ పరిరక్షణ చట్టం 1986 ప్రకారం, పేలుడు పదార్థాల దిగుమతి, ఎగుమతి, రవాణా, నిల్వ, వినియోగాన్ని నియంత్రించడానికి, మండే పదార్థాలు, పీడన పాత్రలు, క్రయోజెనిక్ నాళాలపై ఎన్నో రూల్స్ రూపొందించారు.
వీటిని సాల్వో కంపెనీ ఎక్కడా పాటించడం లేదు. ఇక్కడ ఉన్న అధికారులకు లంచాలు ఇచ్చి సింగరేణి టెండర్స్ దక్కించుకుంది. రేపు మరో టెండర్స్‌కి అవకాశాలు కల్పించాలని తిరుగుతోంది. దేశంలో పేలుడు పదార్ధాలకు ఎన్నో కఠిన చట్టాలు తెచ్చినా, ఇలా కనీసం అనుమతులు లేకుండా ఫ్యాక్టరీని నడిపే వారికి అవకాశాలు ఇవ్వడం వల్ల ఆ పదార్ధాలు ఉగ్రవాదుల చేతుల్లోకి వెళ్లేందుకు ఛాన్స్ ఇచ్చినట్టు అవుతుందనే చర్చ జరుగుతోంది.
పూర్తి కథనం…