Best 5 Malayalam thriller movies on OTT : ఓటిటి ప్లాట్ ఫామ్ లో మలయాళం సినిమాల హడావిడి నడుస్తోంది. ఈ సినిమాలు మంచి కథతో తెరకెక్కుతున్నాయి. చిన్న సినిమాల నుంచి పాన్ ఇండియా సినిమాలు తీసే రేంజ్ కు మలయాళం ఇండస్ట్రీ వచ్చింది. సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలను ఇష్టపడేవాళ్లు 5 బెస్ట్ మలయాళీ థ్రిల్లర్ సినిమాలను మిస్ కాకుండా చూడండి.
జన గణ మన (Jana Gana Mana)
పృథ్వీరాజ్ సుకుమారన్ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమాకు జోష్ ఆంటోని దర్శకత్వం వహించాడు. సూరజ్, పశుపతి రాజ్, శ్రీదివ్య, ప్రియాంక నాయక్ కీలకపాత్రలు పోషించారు. ఈ సస్పెన్స్ థ్రిల్ల మూవీ కాలేజ్ ప్రొఫెసర్ మర్డర్ చుట్టూ తిరుగుతుంది. ఈ మూవీ యూట్యూబ్లో (Youtube) స్ట్రీమింగ్ అవుతోంది.
నయట్టు (Nayattu)
ఈ మూవీ ముగ్గురు పోలీస్ అధికారుల చుట్టూ కథ తిరుగుతుంది. విమర్శకుల ప్రశంసలు అందుకున్న ఈ మూవీకి మార్టిన్ ప్రకత్ దర్శకత్వం వహించాడు. కుంచకో, బోబన్ నిమిషా, సజయన్ వినోద్, సాగర్ కృష్ణ ప్రసాద్ కీలక పాత్రలు పోషించారు. మిస్ కాకుండా చూడాల్సిన థ్రిల్లర్ సినిమాలలో ఈ మూవీ కూడా ఒకటి. ఈ మూవీ ప్రస్తుతం ఓటిటి ఫ్లాట్ ఫామ్ నెట్ఫ్లిక్స్ (Netflix) లో స్ట్రీమింగ్ అవుతుంది. ఈ సినిమాలో ట్విస్ట్ లు చాలానే ఉంటాయి.
సి.బి.ఐ 5 : ది బ్రెయిన్ (C .B. I 5 : The Brain)
మమ్ముట్టి ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమాకు మధు దర్శకత్వం వహించాడు. ముఖేష్ సాయికుమార్, సౌబిన్ షాహిర్ ముఖ్య పాత్రలు పోషించారు. సిబిఐ ఆఫీసర్ పాత్రలో మమ్ముట్టి అద్భుతంగా నటించాడు. ఈ మూవీ ప్రస్తుతం ఓటిటి ఫ్లాట్ ఫామ్ నెట్ఫ్లిక్స్ (Netflix) లో స్ట్రీమింగ్ అవుతుంది. ఇదొక బెస్ట్ మలయాళీ మూవీ అని చెప్పుకోవచ్చు.
ఫోరెన్సిక్ (Forensic)
ఈ మూవీ ఒక సైకలాజికల్ థ్రిల్లర్ కాన్సెప్ట్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. థామస్ సైజు కురుప్, మమత మోహన్ దాస్ ప్రధాన పాత్రలో నటించారు. అఖిల్ పాల్ దర్శకత్వం వహించారు. ఒక సైకో కిల్లర్ చేసే హత్యలను ఎలా వెలుగులోకి తెచ్చి అతన్ని ఎలా పట్టుకుంటారో మూవీలో చూస్తేనే మజా వస్తుంది. థ్రిల్లర్ సినిమాలను ఇష్టపడే మూవీ లవర్స్ తప్పకుండా చూడాల్సిన సినిమా. ఈ థ్రిల్లర్ మూవీ యూట్యూబ్ (Youtube) లో స్ట్రీమింగ్ అవుతోంది.
ఇరుల్ (IRUL)
ఫహద్ ఫాసిల్, సౌబిన్ షాహిర్, దర్శన రాజేంద్రన్ ప్రధాన పాత్రలుగా నటించిన ఈ మూవీకి నసీఫ్ ఈజుద్దీన్ దర్శకత్వం వహించాడు. ఈ మూవీ మలయాళం ఇండస్ట్రీలో ఎక్కువ కలెక్షన్స్ రాబట్టిన మూవీగా రికార్డు క్రియేట్ చేసింది. ప్రస్తుతం ఈ మూవీ ఓటిటి ఫ్లాట్ ఫామ్ నెట్ఫ్లిక్స్ (Netflix) లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సినిమాలు చూస్తున్నంత సేపు కుర్చీలకు అతుక్కుపోతారు. ఈ సినిమాలలో ట్విస్టులు ఒక రేంజ్ లో ఉంటాయి. ఆలస్యం చేయకుండా ఈ సినిమాలను ఫ్యామిలీతో సహా వీక్షించండి.