Big Stories

Lok Sabha Elections 2024: తుక్కుగూడలో భారీ బహిరంగసభ.. ఎన్నికల శంఖారావాన్ని పూరించనున్న కాంగ్రెస్..

Lok Sabha Elections 2024
Lok Sabha Elections 2024

Congress Plans Tukkuguda Meeting (latest political news Telangana ) :లోక్‌ సభ ఎన్నికల నేపథ్యంలో ఏప్రిల్ మొదటి వారంలో తుక్కుగూడలో కాంగ్రెస్ భారీ బహిరంగ సభకు ప్లాన్ చేసింది. ఈ సభకు రాహుల్ గాంధీ, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే హాజరుకానున్నారు. కాగా ఈ సభలో ఏఐసీసీ మేనిఫెస్టోను ఖర్గే తెలుగులో విడుదల చేయనున్నారు.

- Advertisement -

కాగా లోక్ సభ ఎన్నికల షెడ్యూల్ విడుదల తర్వాత కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేస్తున్న మొదటి బహిరంగ సభ ఇదే కావడం విశేషం. తుక్కుగూడ సభ నుంచే పార్లమెంట్ ఎన్నికల ప్రచారాన్ని కాంగ్రెస్ పార్టీ మొదలు పెట్టనుంది. ఈ మేరకు తెలంగాణ సీఎం, పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, ఇతర నాయకులు కలిసి నిర్ణయం తీసుకున్నారు.

- Advertisement -

అటు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో తుక్కుగూడ సభలో ఆరు గ్యారంటీలు వివరించి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ మళ్లీ అదే సీన్ రిపీట్ చేయాలని అనుకుంటోంది.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News