BigTV English

Ramcharan beauty entry in politics: రాజకీయాల్లోకి చెర్రీ హీరోయిన్, ఎక్కడ నుంచి పోటీ అంటే?

Ramcharan beauty entry in politics: రాజకీయాల్లోకి చెర్రీ హీరోయిన్, ఎక్కడ నుంచి పోటీ అంటే?
Ramcharan heroine neha sharma to contest loksabha polls
Ramcharan heroine neha sharma to contest loksabha polls

Ramcharan beauty entry in politics (telugu flash news): రాజకీయాలు.. గ్లామర్ ఇండస్ట్రీకి దగ్గర రిలేషన్‌షిప్ ఉంటుందని చాలామంది చెబుతారు.పెద్దలు ఆ మాట ఎందుకంటారో తెలీదుగానీ, ఒక్కోసారి నిజమే అనిపిస్తోంది. ఎన్నికలు వచ్చినప్పుడు పార్టీలు తమకున్న పరిచయాలతో నటీనటులకు సీట్లు ఇస్తారు. ఆ విధంగా గెలిచిన సందర్భాలు చాలానే ఉన్నాయి. హీరోలు, హీరోయిన్లు, క్యారెక్టర్ ఆర్టిస్టులు కూడా రాజకీయాల్లో రాణించారు.. కంటిన్యూ అవుతూనే ఉన్నారు. ఈ తరహా సందర్భాలు చాలానే ఉన్నాయి. రామ్‌చరణ్‌తో నటించిన హీరోయిన్ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వాలని భావిస్తోంది. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరు? గెలుపోటములు అన్నదానిని పక్కనబెడితే.. ఆమె ఎవరు? ఎక్కడ నుంచి పోటీ చేస్తోంది? అనేదానిపై స్టోరీలోకి వెళ్దాం.


బాలీవుడ్ నటి, మోడల్ నేహాశర్మ గురించి పెద్దగా ఇంట్రడక్షన్ అవసరం లేదు. పదహారేళ్ల కిందట రామ్‌చరణ్ హీరోగా వచ్చిన చిరుత మూవీ ద్వారా గ్లామర్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. ఆ చిత్రం ద్వారా టాలీవుడ్‌ని బాగానే ఆకట్టుకుంది. కాకపోతే అవకాశాలు అనుకున్నంత రేంజ్‌‌‌‌‌లో రాలేదు. రెండేళ్ల గ్యాప్ తర్వాత మరో సినిమా మాత్రమే చేసింది. బహుశా అదే టాలీవుడ్‌లో ఆమెకి చివరి మూవీ అని చెబుతారు.

లోక్‌సభ ఎన్నికల ద్వారా రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వాలని భావిస్తోంది నేహాశర్మ. ఈ విషయాన్ని నేహా ఫాదర్ కాంగ్రెస్ నేత అజయ్‌శర్మ మనసులోని మాట బయటపెట్టారు. అంతా అనుకున్నట్లు జరిగితే భాగల్‌పూర్ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగవచ్చని తెలిపారు. ప్రస్తుతం బీహార్‌లో భాగల్‌పూర్ ఎమ్మెల్యేగా ఉన్నారు అజయ్‌శర్మ. ప్రస్తుతం బీహార్‌లో ఇండియా కూటమి మధ్య సీట్ల పంపకంపై చర్చలు జరుగుతున్నాయి. తమ పార్టీ అభ్యర్థిగా ఈ స్థానం నుంచి తన కూతురు నేహాశర్మకు టికెట్ వచ్చే అవకాశముందని తెలిపారాయన. ముఖ్యంగా భాగల్‌పూర్ నియోజకవర్గం తమ పార్టీకి కంచుకోటని చెప్పుకొచ్చారు. దీన్ని తాము ఆశిస్తున్నామని, కాంగ్రెస్ హైకమాండ్ కూడా తమకే ఛాన్స్ ఇస్తుందనే ఆశాబావం వ్యక్తంచేశారు.


పార్టీ హైకమాండ్ అడిగితే.. తన కూతురు నేహాశర్మకు ఛాన్స్ ఇవ్వాలని కోరుతానన్నారు అజయ్‌శర్మ. కొద్దిరోజులు ఆగితే అంతా తెలుస్తుందన్నారు. మరోవైపు బీహార్‌లో ఇండియా కూటమి సీట్లపై ఈ వారంలో ప్రకటన ఉండనుంది. ఈ విషయాన్ని ఆర్జేడీ నేత, బీహార్ మాజీ డిప్యూటీ సీఎం తేజస్వియాదవ్ తెలిపారు. 2019 ఎన్నికల్లో జరిగిన ఎన్నికల్లో 40 సీట్లకుగాను ఎన్డీయే 39 సీట్లను సొంతం చేసుకుంది. ఈసారి సగానికి పైగా సీట్లను గెలుచుకోవాలని ప్లాన్ చేస్తోంది ఇండియా కూటమి.

Tags

Related News

Vice President: భారత 15వ ఉపరాష్ట్రపతిగా సీపీ రాధాకృష్ణన్..

Vice President Election: ఉప రాష్ట్రపతి ఎన్నిక.. రాధాకృష్ణన్ Vs సుదర్శన్ రెడ్డి

Social Media Ban: నేపాల్‌లో హింసాత్మకంగా యువత నిరసనలు.. కాల్పుల్లో 20 మంది మృతి

Amruta Fadnavis: బీచ్‌‌ను శుభ్రం చేసిన సీఎం భార్య.. ఆమె డ్రెస్ చూసి నోరెళ్లబెట్టిన జనం

NDA Cheap Tricks: ఆహా.. బీహార్ అంటే కేంద్రానికి ఎంత ప్రేమ.. ఇవేం చీప్ ట్రిక్స్?

Drugs Case: చర్లపల్లి డ్రగ్స్ కేసులో సంచలన విషయాలు

×