E-Paper
Advertisement

BRS vs Congress Party: బీఆర్ఎస్ నేతల దౌర్జన్యం.. ఇమ్రాన్ ఇంటిపై మాగంటి అనుచరుల దాడి

BRS vs Congress Party: బీఆర్ఎస్ నేతల దౌర్జన్యం.. ఇమ్రాన్ ఇంటిపై మాగంటి అనుచరుల దాడి
BRS vs Congress party

BRS vs Congress party(Telangana politics):

తెలంగాణ ఎన్నికల్లో తుది పోలింగ్ కు సమయం దగ్గరపడుతున్న కొద్దీ.. బీఆర్ఎస్ శ్రేణుల్లో టెన్షన్ పెరిగిపోతుంది. ఈసారి అధికారం హస్తం పార్టీదేనని ఓటర్లే చెబుతుండటంతో.. రెండుసార్లు అధికారం చేపట్టిన బీఆర్ఎస్ నేతలకు ఇది మింగుడు పడటం లేదు. కాంగ్రెస్ నేతల ఇళ్లే టార్గెట్ గా ఐటీ దాడులు జరగ్గా.. ఇప్పుడు ఏకంగా బీఆర్ఎస్ కార్యకర్తలే కాంగ్రెస్ అభ్యర్థుల ఇళ్లపై దాడులకు తెగబడుతున్నారు.

హైదరాబాద్‌లో బీఆర్‌ఎస్‌ నేతలు దౌర్జన్యం చేస్తూ దాడులకు తెగబడుతున్నారు. కాంగ్రెస్‌ శ్రేణులను బెదిరిస్తూ వారి ఇళ్లపై ఎమ్మెల్యే అభ్యర్థి మాగంటి గోపినాథ్‌ అనుచరులు దాడులకు దిగుతున్నారు. ఈ నేపథ్యంలోనే బోరబండ బీర్‌ఎస్‌ కార్యకర్త ఇమ్రాన్‌ ఇంటిపై విజయసింహా టీమ్ దాడికి దిగారు. ఇంట్లో ఉన్న ఆడవారిపై సైతం దాడి చేశారు. ఈ ఘటనలో ఇమ్రాన్‌కు తీవ్రగాయాలు కావడంతో ఆస్పత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న కాంగ్రెస్‌ ఎమ్మెల్యే అభ్యర్థి అజారుద్దీన్‌ నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేశారు. ఈ ఘటనపై ఇమ్రాన్ తల్లి బీఆర్‌ఎస్‌ దౌర్జన్యంపై బోరబండ పీఎస్‌లో ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Related News

Minister Komatireddy: కార్పొరేషన్ ఎన్నికల ప్రచారంలో మంత్రి ఉత్సాహం.. మీ రుణం తీర్చుకోలేనంటూ..?

Telangana BJP: మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను ఇరుకున పెట్టేందుకు బీజేపీ బిగ్ స్కెచ్.. అందుకు వ్యూహం ఇదే..?

Khammam News: ఖమ్మంలో కాక రేపుతున్న మున్సిపల్ రాజకీయం.. ఓ పక్క గెలుపు వ్యూహాలు.. మరోపక్క జంపింగ్ రాజాల తంటాలు..!

Sarpanch elections: సర్పంచ్‌గా గెలవక ముందే అభ్యర్థి ప్రకటన చూసి అవాక్కయిన గ్రామస్థులు –  అసలు ఏం చేశాడో తెలుసా..?  

New Royal Enfield Bikes: రాయల్ ఎన్‌ఫీల్డ్ నుంచి 2 క్రేజీ బైక్స్ లాంచ్, ఏకంగా 648cc ట్విన్ ఇంజిన్ తో!

Telangana Loksabha Election Results: కాంగ్రెస్ అభ్యర్థి రఘువీర్ రెడ్డి ప్రభంజనం.. భారీ మెజార్టీతో గెలుపు

Traffic diversions in Hyderabad due to counting of votes: ఎన్నికల కౌంటింగ్.. హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు!

Telangana in Debt Trap | తెలంగాణ ఆర్థిక పరిస్థితి దయనీయం.. రుణ వడ్డీల చెల్లింపులకే భారీగా ఖర్చు

Big Stories

×