Mahaboobabad Crimes : మహబూబాబాద్ జిల్లాలో అమానుషం చోటుచేసుకుంది. ముత్యాలమ్మగూడెం గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలలో విద్యార్థినిపై ఉపాధ్యాయుడు ఇష్టానుసారం వ్యవహరించాడు. మద్యం మత్తులో స్కూల్ కు వచ్చి విద్యార్థిని కొట్టాడు. మెడ పై బలంగా దాడి చేశాడు. విషయం తెలిసినప్పటికీ వార్డెన్ మౌనంగా ఉన్నాడు.
ఉపాధ్యాయుడు దాడికి విద్యార్థిని గాయపడింది. కనీసం ఆమెను ఆస్పత్రిలో కూడా చేర్చకుండా వార్డెన్ నిర్లక్ష్యంగా వ్యవహరించాడు. దీంతో విద్యార్థిని పరిస్థితి విషమించింది. ప్రాణాల మీదకు రావడంతో అప్పుడు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఆమె పరిస్థితి ఇంకా ఆందోళనకరంగానే ఉండడంతో…తల్లిదండ్రులు ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. విద్యార్థినిపై చేయి చేసుకున్న ఉపాధ్యాయుడితో పాటు పట్టించుకోని వార్డెన్ పై చర్యలు తీసుకోవాలంటూ గిరిజన, విద్యార్థి సంఘాలు ధర్నాకు దిగాయి. రెండు రోజుల కిందట జరిగిన ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది