E-Paper
Advertisement

ఇకపై సభలు, ఫంక్షన్ల నిర్వహణపై.. మున్సిపల్ కార్పొరేషన్ కొత్త రూల్స్?

ఇకపై సభలు, ఫంక్షన్ల నిర్వహణపై.. మున్సిపల్ కార్పొరేషన్ కొత్త రూల్స్?
Advertisement

Waste Management: స్వేచ్చ బ్యూరో: సభలు, సమావేశాలు, ఇతర కార్యాలకు సంబంధించి సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ సరి కొత్త మార్గదర్శకాలను జారీ చేసింది. దాదాపు వంద మందికి పైగా పాల్గొనే కార్యక్రమాలు, సమావేశాల సందర్భంగా ఘన వ్యర్థాల నిర్వహణను సమర్థవంతంగా చేపట్టేందుకు సాలిడ్ వేస్ట్ మేనేజ్‌మెంట్ నిబంధనల్లోని రూల్ 5(1)(జే) ప్రకారం సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అన్ని సర్కిళ్ల డిప్యూటీ కమిషనర్లకు ఆదేశాలు జారీ చేసింది.

వంద మందికి పైగా..

ఈ సరి కొత్త మార్గదర్శకాల ప్రకారం, అనుమతి లేని ప్రదేశాల్లో వంద మందికి పైగా పాల్గొనే కార్యక్రమాలు, సభలు, సమావేశాలతో పాటు ఇతర కార్యాలను నిర్వహించే నిర్వాహకులు, కార్యక్రమానికి కనీసం మూడు పని దినాల ముందుగానే కార్పొరేషన్ పరిధిలోని సీపీసీబీ ఈవెంట్ ఇంటిమేషన్ పోర్టల్ ద్వారా సంబంధిత స్థానిక సంస్థకు సమాచారం అందించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. ముఖ్యంగా కార్యకమం, సభ, సమావేశాల నిర్వాహకులు ముందస్తు సమాచారం తప్పనిసరిగా తీసుకోవాలని స్పష్టం చేసింది. కార్యక్రమం జరిగిన ప్రదేశంలోనే వ్యర్థాలు ఉత్పత్తి చేస్తే, వాటిని నిర్దేశించిన వర్గాల ప్రకారం తప్పనిసరిగా వేరు చేయాలని స్పష్టం చేసింది.

వ్యర్థాల సేకరణదారులు..

Advertisement

వేరు చేసిన వ్యర్థాలను స్థానిక సంస్థ సూచించిన అధీకృత వ్యర్థాల సేకరణదారులు లేదా ఏజెన్సీలకు అప్పగించాల్సిందేనని వెల్లడించింది. కార్యక్రమంలో ఉత్పత్తి అయ్యే వ్యర్థాల సేకరణ, రవాణా, శాస్త్రీయ పద్ధతిలో పారవేతకు అవసరమైన ఏర్పాట్లు చేసుకోవాలని సూచించింది. ఈ నేపథ్యంలో సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ జి.సృజన కార్పొరేషన్ పరిధిలోని అన్ని సర్కిళ్ల డిప్యూటీ కమిషనర్లు తమ పరిధిలోని కార్యక్రమాల నిర్వాహకులు, ఫంక్షన్ హాళ్ల యాజమాన్యాలు, ఈవెంట్ మేనేజ్‌మెంట్ సంస్థలు, ఇతర సంబంధిత వర్గాలకు ఈ మార్గదర్శకాలపై విస్తృతంగా అవగాహన కల్పించాలని ఆదేశించారు.

శానిటేషన్ అధికారులు..

సీపీసీబీ ఈవెంట్ ఇంటిమేషన్ పోర్టల్ వినియోగం, ముందస్తు సమాచారం అందించాల్సిన తప్పనిసరి నిబంధనలపై అవగాహన కల్పించడంతో పాటు, నిబంధనల అమలును నిరంతరం పర్యవేక్షించాలని, సంబంధిత శానిటేషన్ అధికారులు, క్షేత్రస్థాయి సిబ్బందితో సమన్వయం చేసుకోవాలని డిప్యూటీ కమిషనర్లకు సూచించారు. సైబరాబాద్ పరిధిలో జరిగే అన్ని బహిరంగ సభలు, సమావేశాలతో పాటు ఇతర కార్యక్రమాల్లో ఈ ఆదేశాలు ఖచ్చితంగా అమలు చేస్తూ, ఘన వ్యర్థాల నిర్వహణను పటిష్టంగా చేపట్టాలని కమిషనర్ సృజన సూచించారు.

Advertisement

Also Read: ఎస్సీ, ఎస్టీ సంక్షేమ పార్లమెంటరీ కమిటీతో సీఎం రేవంత్ భేటీ.. ఆ అంశాలపై చర్చ!

Tags

Related News

క్రీడల విషయంలో.. సీఎం రేవంత్‌కు హరీష్ రావు చాలెంజ్?

కేటీఆర్‌పై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫైర్.. బీఆర్ఎస్‌కు సవాల్!

తెలంగాణకు అర్నబ్ తుఫాన్ ఎఫెక్ట్.. ఈ జిల్లాలకు భారీ వర్షాలు!

‘షీ టీమ్స్’ పేరుతో నకిలీ నోటీసు.. మాజీ ప్రియుడిపై యువతి రివేంజ్.. పోలీసులు సైతం షాక్!

ఎస్సీ, ఎస్టీ సంక్షేమ పార్లమెంటరీ కమిటీతో సీఎం రేవంత్ భేటీ.. ఆ అంశాలపై చర్చ!

సాగర్ జలాల దోపిడీపై మౌనమెందుకు? నిఘా వ్యవస్థ ఏం చేస్తోంది? కాంగ్రెస్‌పై కవిత ఫైర్!

పనిచేయడం చేతకాక బీజేపీపై విమర్శలా? కాంగ్రెస్, బీఆర్ఎస్‌పై రాంచందర్ రావు ఫైర్

Big Stories

Advertisement
×