E-Paper
Advertisement

‘షీ టీమ్స్’ పేరుతో నకిలీ నోటీసు.. మాజీ ప్రియుడిపై యువతి రివేంజ్.. పోలీసులు సైతం షాక్!

‘షీ టీమ్స్’ పేరుతో నకిలీ నోటీసు.. మాజీ ప్రియుడిపై యువతి రివేంజ్.. పోలీసులు సైతం షాక్!
Advertisement

Fake Police Notice: షీ టీమ్స్ పోలీసులకే షాకిచ్చింది ఓ యువతి. తన మాజీ ప్రియునికి షీ టీమ్స్​ పేరిట నోటీస్​ పంపించింది. అనుమానం వచ్చిన బాధితుడు ఈ విషయాన్ని షీ టీమ్స్ దృష్టికి తీసుకెళ్లగా.. వారు సైఫాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

హైదరాబాద్ కు చెందిన ఓ యువకునికి గతంలో ఓ యువతితో కొంతకాలంపాటు ప్రేమ వ్యవహారం నడిచింది. అయితే వ్యక్తిగత కారణాలతో కొన్నిరోజుల క్రితం ఇద్దరు విడిపోయారు. కాగా మాజీ ప్రియునిపై కక్ష పెంచుకున్న సదరు యువతి.. ఎలాగైనా పగ తీర్చుకోవాలని నిర్ణయించుకుంది. ఈ క్రమంలో షీ టీమ్స్​ అధికారులు జారీ చేసినట్టుగా ఓ నకిలీ నోటీసును మాజీ ప్రియునికి పంపించింది. దీనిపై అనుమానం రావటంతో బాధితుడు వెంటనే షీ టీమ్స్​ పోలీసుల వద్దకు వెళ్లాడు. తనకు వచ్చిన నోటీసును చూపించాడు.

Advertisement

Also Read: సాగర్ జలాల దోపిడీపై మౌనమెందుకు? నిఘా వ్యవస్థ ఏం చేస్తోంది? కాంగ్రెస్‌పై కవిత ఫైర్!

ఆ ఫేక్ నోటీసును చూసి షీ టీమ్స్ పోలీసులు షాక్ అయ్యారు. పోలీసుల పేరును, అధికారిక వ్యవస్థలను దుర్వినియోగం చేస్తూ వ్యక్తిగత కక్షల కోసం వాడుకోవడాన్ని తీవ్రమైన నేరంగా పరిగణించి సైఫాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసిన సైఫాబాద్ పోలీసులు విచారణ చేస్తున్నారు. నోటీసును ఎలా తయారు చేశారు? దానిని తయారు చేసేందుకు సహకరించిన యువతి స్నేహితుడి పాత్రపై ఆరా తీస్తున్నారు. పోలీసుల పేరుతో నకిలీ పత్రాలు సృష్టిస్తే కఠిన చర్యలు తప్పవని ఈ సందర్భంగా అధికారులు హెచ్చరించారు.

Advertisement

Also Read: కర్ణాటకలో చెట్టును ఢీకొన్న కారు.. ఇద్దరు యువతుల మృతి, నలుగురికి తీవ్ర గాయాలు

Tags

Related News

ఎస్సీ, ఎస్టీ సంక్షేమ పార్లమెంటరీ కమిటీతో సీఎం రేవంత్ భేటీ.. ఆ అంశాలపై చర్చ!

సాగర్ జలాల దోపిడీపై మౌనమెందుకు? నిఘా వ్యవస్థ ఏం చేస్తోంది? కాంగ్రెస్‌పై కవిత ఫైర్!

పనిచేయడం చేతకాక బీజేపీపై విమర్శలా? కాంగ్రెస్, బీఆర్ఎస్‌పై రాంచందర్ రావు ఫైర్

స్నానం చేసి రాలేదని.. పిల్లలను బడి నుంచి గెంటేసిన హెచ్ఎం!

ఇందిరమ్మ కుటుంబ బీమా పథకం బిగ్ అప్డేట్.. కీలక ఉత్తర్వులు జారీ!

నకిలీ బంగారం బ్యాంకులో పెట్టి.. రూ. 21 లక్షలు కాజేసిన అప్రైజర్!

బిగ్ టీవీ ఎఫెక్ట్.. ఆదిలాబాద్ రిమ్స్‌కు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు నోటీసులు!

Big Stories

Advertisement
×