E-Paper
Advertisement

కేటీఆర్‌పై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫైర్.. బీఆర్ఎస్‌కు సవాల్!

కేటీఆర్‌పై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫైర్.. బీఆర్ఎస్‌కు సవాల్!
Advertisement

Uttam Kumar: సోనియా గాంధీపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మండిపడ్డారు. ‘సోనియా గాంధీ సంకల్పం లేకుంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడేదే కాదు..ఆమె వల్లే తెలంగాణ వచ్చిందని ఆ విషయాన్ని కేసీఆర్ కూడా అసెంబ్లీలో చెప్పారు..తెలంగాణ ఏర్పడిన తరువాతే కేటీఆర్ కుటుంబానికి పదవులు వచ్చాయి..ఆ విషయాన్ని మరిచి సోనియా గాంధీపై మాట్లాడటం కృతజ్ఞతా’ అని నిలదీశారు. సచివాలయంలో నిర్వహించిన బుధవారం నిర్వహించి మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. సోనియా గాంధీ పుస్తకంలో తెలంగాణ ప్రస్తావన ఉందా, లేదా అన్నది అసలు విషయం కాదు.. తెలంగాణ ఏర్పాటు కోసం ఆమె తీసుకున్న చారిత్రక నిర్ణయాన్ని గుర్తుంచుకోవాలి అని హితవు పలికారు.

పదేళ్ల పాలనలో..

తెలంగాణ ఇచ్చిన నాయకురాలిపై విమర్శలు చేయడం బీఆర్‌ఎస్‌ నాయకుల నైజాన్ని బయటపెడుతోందని వ్యాఖ్యానించారు. నాగార్జునసాగర్‌ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసిన నెహ్రూ కృషిని కేటీఆర్‌ తక్కువ చేసి మాట్లాడటం విడ్డూరమన్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల్లో కలిపి సుమారు 21 లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తున్న నాగార్జునసాగర్‌ ఒక అద్భుతమైన ప్రాజెక్టు అని పేర్కొన్నారు.‘లక్షలాది ఎకరాల ఆయకట్టుకు ఆధారమైన ప్రాజెక్టు గురించి మాట్లాడే ముందు, పదేళ్ల పాలనలో తాము పూర్తి చేసిన సాగునీటి ప్రాజెక్టులేమిటో బీఆర్‌ఎస్‌ చెప్పాలి’ అని డిమాండ్ చేశారు.

సమాధానం చెప్పాలని డిమాండ్‌..

Advertisement

సాగునీటి రంగంలో రూ.1.83 లక్షల కోట్లు ఖర్చు చేశామని చెప్పుకుంటున్న బీఆర్‌ఎస్‌, ఆ వ్యయానికి తగిన ఫలితాలను రైతులకు అందించలేకపోయిందని ఆరోపించారు. పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకం, కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా, కోయిల్‌సాగర్‌, ఆర్డీఎస్‌ ఆధునికీకరణ, ఎస్‌ఎల్‌బీసీ, డిండి ప్రాజెక్టుల పురోగతిపై సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. గత ప్రభుత్వ సాగునీటి వ్యయంలో దాదాపు 75 శాతం గోదావరి బేసిన్‌కే కేటాయించి, కృష్ణా బేసిన్‌కు సుమారు 25 శాతమే వెచ్చించారని పేర్కొన్నారు. దీనివల్ల మహబూబ్‌నగర్‌, నల్గొండ జిల్లాల రైతులకు అన్యాయం జరిగిందన్నారు.

Also read: ఏడాది జైలు శిక్ష.. కోర్టు తీర్పుపై బండ్ల గణేశ్ రియాక్షన్ వైరల్!

జల వివాదాల ట్రైబ్యునల్‌..

Advertisement

కృష్ణా జలాల్లో 811 టీఎంసీల నీటిలో ఆంధ్రప్రదేశ్‌కు 512 టీఎంసీలు, తెలంగాణకు 299 టీఎంసీలు కేటాయించే నిష్పత్తికి గత ప్రభుత్వం అంగీకరించిందని చెప్పారు. తమ ప్రభుత్వం మాత్రం పరీవాహక ప్రాంతం, సాగునీటి అవసరాలు, జనాభా తదితర అంశాల ఆధారంగా తెలంగాణకు 555 టీఎంసీలు రావాలని కృష్ణా జల వివాదాల ట్రైబ్యునల్‌ ముందు వాదిస్తోందని వివరించారు. సాగర్‌ జలాశయం నుంచి సుమారు 1.8 టీఎంసీల నీటిని తీసుకునేందుకు ఆంధ్రప్రదేశ్‌ ప్రతిపాదించిన తాగునీటి పథకంపై తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే తీవ్ర అభ్యంతరాలు తెలిపిందని మంత్రి వెల్లడించారు. కృష్ణా నదీ యాజమాన్య బోర్డు, కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ, ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి తమ అభ్యంతరాలను పంపినట్లు చెప్పారు.తెలంగాణ నీటి హక్కులను ప్రభావితం చేసే ఏ పథకాన్నైనా వ్యతిరేకిస్తామని, రాష్ట్ర ప్రయోజనాల పరిరక్షణకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని ఉత్తమ్‌ స్పష్టం చేశారు.

క్లైమేట్ చేంజ్ కాంక్లేవ్ నిర్వహణ..

గ్లోబల్ సమ్మిట్‌లో భాగంగా క్లైమేట్ చేంజ్ కాంక్లేవ్ నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారులకు సూచించారు. సచివాలయంలో బుధవారం అటవీశాఖ ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. డిసెంబర్ 7, 8, 9 తేదీల్లో నిర్వహించనున్న తెలంగాణ గ్లోబల్ సమ్మిట్‌లో భాగంగా చేపట్టనున్న క్లైమేట్ చేంజ్ కాంక్లేవ్ ఏర్పాట్లపై ఆయన సమీక్షించారు. ఈ నెల 27న హైదరాబాద్‌లోని ఐటీసీ కాకతీయలో క్లైమేట్ చేంజ్ కాంక్లేవ్‌కు సంబంధించిన కర్టెన్ రైజర్ కార్యక్రమాన్ని నిర్వహించాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో అటవీ దళాధిపతి వినయ్ కుమార్, పీసీసీఎఫ్ లు డాక్టర్ ప్రియాంక వర్గీస్, ఎస్జేఆశ, ఎఫ్సీఆర్ఐ డీన్ ప్రవీణ్, రంగారెడ్డి డీఎఫ్ఓ ఆశిష్ సింగ్ పాల్గొన్నారు.

Also read: రూ.50 పెట్టుబడితో ఈ స్థాయిలో ఉన్నా.. అలీ సక్సెస్ సీక్రెట్ అదేనా?

Tags

Related News

తెలంగాణకు అర్నబ్ తుఫాన్ ఎఫెక్ట్.. ఈ జిల్లాలకు భారీ వర్షాలు!

‘షీ టీమ్స్’ పేరుతో నకిలీ నోటీసు.. మాజీ ప్రియుడిపై యువతి రివేంజ్.. పోలీసులు సైతం షాక్!

ఎస్సీ, ఎస్టీ సంక్షేమ పార్లమెంటరీ కమిటీతో సీఎం రేవంత్ భేటీ.. ఆ అంశాలపై చర్చ!

సాగర్ జలాల దోపిడీపై మౌనమెందుకు? నిఘా వ్యవస్థ ఏం చేస్తోంది? కాంగ్రెస్‌పై కవిత ఫైర్!

పనిచేయడం చేతకాక బీజేపీపై విమర్శలా? కాంగ్రెస్, బీఆర్ఎస్‌పై రాంచందర్ రావు ఫైర్

స్నానం చేసి రాలేదని.. పిల్లలను బడి నుంచి గెంటేసిన హెచ్ఎం!

ఇందిరమ్మ కుటుంబ బీమా పథకం బిగ్ అప్డేట్.. కీలక ఉత్తర్వులు జారీ!

Big Stories

Advertisement
×