E-Paper
Advertisement

Air India Flight: ఎయిర్ ఇండియా ఫ్లైట్ కి బాంబ్ బెదిరింపు.. విమానంలో ఎంపీ క్రిష్ణయ్య, హైకోర్టు జస్టిస్

Air India Flight: ఎయిర్ ఇండియా ఫ్లైట్ కి బాంబ్ బెదిరింపు.. విమానంలో ఎంపీ క్రిష్ణయ్య, హైకోర్టు జస్టిస్
Advertisement

Air India Flight: ఎయిర్ ఇండియా ఫ్లైట్ కు బాంబ్ బెదిరింపు కాల్ వచ్చింది. ఈ విమానంలో ఎంపీ ఆర్ క్రిష్ణయ్య, హైకోర్టు జస్టిస్ నరసింహారెడ్డిలు ఉన్నట్లు సమాచారం. దిల్లీ నుంచి హైదరాబాద్ కు వచ్చిన ఎయిర్ ఇండియా విమానానికి బాంబ్ బెదిరింపు వచ్చినట్లు తెలుస్తోంది. ఈ విమానం శంషాబాద్ ఎయిర్ పోర్టులో ల్యాండ్ అవ్వగానే సిబ్బంది తనిఖీలు చేపట్టారు. 2879 నెంబర్ గల ఎయిర్ ఇండియా ఫ్లైట్ శంషాబాద్ ఎయిర్ పోర్టులో ల్యాండ్ అవ్వగానే.. ఫైరింజన్లతో సిబ్బంది విమానం దగ్గరకు చేరుకున్నారు. విమానం ల్యాండై అర గంటైనా ప్రయాణికులను కిందకు అనుమతించలేదు.

ఫ్లైట్ లో ఎంపీ క్రిష్ణయ్య

ప్రయాణికులు కిందికి దిగాక లగేజ్ ఎయిర్ పోర్ట్ సిబ్బందికి హ్యాండోవర్ చేయాలని ఫ్లైట్ లో అనౌన్స్ చేసినట్లు తెలుస్తోంది. తనిఖీల తర్వాతనే ఎయిర్ పోర్టు నుంచి వెళ్లాలని ఫ్లైట్ లో ప్రకటన చేసినట్లు సమాచారం. బాంబు బెదిరింపు రావడంతో మిగతా ఫ్లైట్స్ కి దూరంగా ఈ విమానాన్ని ల్యాండ్ చేశారు. ఫ్లైట్ లో ఎంపీ ఆర్ క్రిష్ణయ్య, హైకోర్టు జస్టిస్ నరసింహారెడ్డిలు ఉన్నట్లు సమాచారం. ప్రయాణికులను, లగేజ్ లను ఎయిర్ పోర్టు సిబ్బంది తనిఖీ చేస్తున్నారు.

Advertisement

Also Read: Indigo: ఇండిగో కావాలనే నిర్లక్ష్యం చేసింది.. పైలట్స్ అసోసియేషన్ ఆగ్రహం 

దుబాయ్ నుంచి వచ్చిన విమానానికి బాంబు బెదిరింపులు

శుక్రవారం ఉదయం దుబాయ్ నుంచి వచ్చిన ఎమిరేట్స్ విమానానికి బాంబు బెదిరింపు కలకలం రేపింది. శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు బాంబు బెదిరింపు ఈ మెయిల్ రాగానే సిబ్బంది అలర్ట్ అయ్యారు. దుబాయ్ నుంచి హైదరాబాద్ వస్తున్న ఎమిరేట్స్ విమానంలో బాంబు పెట్టినట్లు ఆగంతకులు బెదిరింపు మెయిన్ పంపారు. ఈ క్రమంలో శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ఎమిరేట్స్ విమానాన్ని అత్యవసర ల్యాండింగ్‌కు ఏర్పాటు చేశారు.

Advertisement

ఎమిరేట్స్ EK-526 విమానాన్ని పేల్చేస్తామని శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు దుండగులు బెదిరింపు ఈ-మెయిల్ పంపించారు. వెంటనే అప్రమత్తమైన ఎయిర్‌పోర్టు అధికారులు హెలిప్యాడ్ పరిసరాల్లో బాంబ్ స్క్వాడ్ తో తనిఖీలు చేపట్టారు. బాంబు స్క్వాడ్, పోలీసులు ఎయిర్‌పోర్టు పరిసరాలను పూర్తిగా పరిశీలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు ఎయిర్ పోర్టు పోలీసులు తెలిపారు.

ఇటీవల బాంబు బెదిరింపులు ఎక్కువకావడంతో ప్రయాణికులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. అసలు ఈ బెదిరింపులకు పాల్పడుతున్నారు అనే కోణంలో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

Related News

ప్రభుత్వ ఆధ్వర్యంలో జరిగే సదస్సులకు.. సర్కార్ కొత్త నిబంధనలు!

సోషల్ మీడియాలో వైరల్ వీడియోపై.. నిజామాబాద్ పోలీసులు యాక్షన్..!

కేసీఆర్‌ కుటుంబ ఆస్తులు స్వాధీనం చేసుకోవాలి! – మాజీ మంత్రి రవీంద్ర నాయక్

సాలార్ జంగ్ మ్యూజియంకు సరికొత్త రూపు.. ఓయూ విద్యార్థులకు కీలక పిలుపు!

దేశంలో అలజడులు సృష్టించే కుట్రలు సాగనివ్వం: రాంచందర్ రావు

కేజీబీవీ కాంట్రాక్ట్ ఉద్యోగులకు బిగ్ రిలీఫ్.. త్వరలో మళ్లీ ఆర్డర్లు?

ముక్కు మూసుకుని బతుకమ్మ నిమజ్జనం చేసిన మహిళలు.. ఎందుకో తెలుసా..?

మా తీర్పులు కాగితాలకే పరిమితమా..? పీరియడ్ హైజీన్ ఉత్తర్వుల అమలుపై సుప్రీం కోర్టు ఫైర్!

Big Stories

Advertisement
×