Malkajgiri : నకిలీ నోట్లను చెలామనీ చేస్తూ ప్రజలను మోసం చేస్తున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటన మల్కాజగిరిలో జరిగింది. ఈ కేసులో ముగ్గురు నిందితులను ఎల్బీ నగర్ పోలీసులు సహాయంతో అదుపులోకి తీసుకున్నారు.
నకిలీ నోట్లను చలామణి చేస్తూ.. ప్రజలను మోసం చేస్తున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటన మల్కాజగిరిలో జరిగింది. ఈ కేసులో ముగ్గురు నిందితులను ఎల్బీ నగర్ పోలీసులు సహాయంతో అదుపులోకి తీసుకున్నారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆదిలాబాద్ ప్రాంతానికి చెందిన మొహమ్మద్ బహూద్దీన్ గతంలో ఫారెస్ట్ డిపార్ట్మెంట్ లో సీనియర్ అసిస్టెంట్ గా పనిచేస్తున్నాడు. ఉద్యోగంలో ఉంటూ అనేక మోసాలకు పాల్పడటంతో ఉన్నతాధికారులు విధుల నుండి తొలగించారు. సస్పెండ్ అయిన తర్వాత కూడా అధిక డబ్బు సంపాదించాలని శంషాబాద్ విమానశ్రయంలో టాక్సీ డ్రైవర్లుగా పనిచేస్తున్న ఇద్దరు వ్యక్తులను పరిచయం చేసుకుని.. నకిలీ నోట్ల చలామణికి తెరతీశాడు. దొంగ నోట్ల నేరాలకు పాల్పడ్డాడు.
పక్కా సమాచారం అందుకున్న పోలీసులు.. నిందితులు వద్ద నుండి రూ.60 లక్షల దొంగ నోట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో మరికొంత మందిని అదుపులోకి తీసుకున్నామని రాచకొండ సీపీ సుధీర్ బాబు తెలిపారు. ఈ కేసును చేధించిన పోలీసులను రాచకొండ సీపీ అభినందించారు.