Chanchalguda Jail: సాధారణంగా తప్పు చేసిన వాళ్లని సన్మార్గంలోకి తెచ్చేందుకు జైళ్లలో పెడతారు.కానీ సన్మార్గం అదీ పక్కన పెడితే ఓ రిమాండ్ ఖైదీ జైలు నుంచి తప్పించుకునేందుకు ఏకంగా నకిలీ బెయిల్ పత్రాలు సృష్టించి ఎస్కేప్ అయ్యాడు.
చంచల్‌గూడ జైలులో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. రెండురోజుల క్రితం నకిలీ బెయిల్ పత్రాలు సృష్టించి చంచల్ గూడ జైలు నుంచి విడుదలయ్యాడు రిమాండ్ ఖైదీ మీర్ సుజాథ్ అలీ ఖాన్.దీంతో దాబీర్ పుర పోలీసులకు ఫిర్యాదు చేశారు జైలు అధికారులు.దాబీర్ పుర పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
నార్సింగి పోలీస్ స్టేషన్ లో ల్యాండ్ గ్రాబింగ్ కేసులో నవంబర్ 2న సుజాథ్ అలీ ఖాన్ అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. అప్పటి నుంచి చంచల్‌గూడ జైల్లో రిమాండ్ ఖైదీగా సుజాథ్ అలీ ఖాన్ ఉన్నాడు. సుజాత్ ఆలీ ఖాన్ పై రెండు కేసులు ఉండడంతో మొదటి కేసులో బెయిల్ మంజూరు అయింది. మరో కేసులో బెయిల్ పెండింగ్లో ఉండడంతో జైలు అధికారులు విడుదల చేయలేదు.దీంతో నకిలీ బెయిల్ పత్రాలు సృష్టించి చంచల్ గూడ జైల్ డ్రాప్ బాక్స్ లో వేశారు సుజాథ్ అలీ ఖాన్ మనుషులు. జైల్లో ఉన్న సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా నకిలీ పత్రాలపై సుజాథ్ అలీ ఖాన్ విడుదల చేశారు అధికారులు. మూడ్రోజుల తర్వాత నార్సింగి పోలీసులు పిటీ వారెంట్ తో సుజాథ్ అలీ ఖాన్ ను తీసుకెళ్లేందుకు జైలుకు వచ్చారు.
Also Read: రాష్ట్రంలో తగ్గుతున్న నిరుద్యోగం.. ప్రజాపాలనలో భారీగా పెరిగిన ఉద్యోగాలు!
అప్పటికే జైలు నుంచి విడుదల అయ్యాడని జైలు అధికారులు చెప్పడంతో బయటపడ్డ నకిలీ బెయిల్ పేపర్ల విషయం వెలుగు చూసింది. దీంతో దబిర్ పుర పోలీసులకు చంచల్‌గూడ జైలు అధికారులకు ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం నకిలీ బెయిల్ పై విడుదలైన సుజాథ్ అలీ ఖాన్ కోసం గాలిస్తున్నారు పోలీసులు.