BigTV English

Man Beating a Guy for Money in Hyderabad: యువకుడిపై దాష్టీకం.. అప్పు తిరిగి ఇవ్వట్లేదని చితకబాదిన వడ్డీ వ్యాపారి!

Man Beating a Guy for Money in Hyderabad: యువకుడిపై దాష్టీకం.. అప్పు తిరిగి ఇవ్వట్లేదని చితకబాదిన వడ్డీ వ్యాపారి!
Viral Video
Viral Video

Man Beating a Guy for interest on Rs 5000 in Hyderabad: రోజురోజుకి వడ్డీ వ్యాపారుల ఆగడాలు మితిమీరిపోతున్నాయి. డబ్బుల కోసం వ్యక్తులను దారుణంగా హింసిస్తున్నారు. కొట్టడం, వేధించడం, వారిపై దాడికి పాల్పడడం వంటివి చేస్తున్నారు. తాజాగా ఓ వడ్డీ వ్యాపారి యువకుడు అని కూడా చూడకుండా అతనిపై దారుణంగా దాడికి పాల్పడ్డాడు. అవసరం ఉంది అన్నప్పుడు డబ్బులు ఇచ్చి.. తిరిగి ఇవ్వడానికి సమయం అడిగారంటే చాలు ఇంటికి వెళ్లి మరి ముక్కు పిండి వసూలు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. తాజాగా వికారాబాద్ జిల్లాలో దారుణ ఘటన వెలుగుచూసింది. ఇచ్చిన అప్పు తిరిగి ఇవ్వడం లేదని ఓ యువకుడిపై భౌతిక దాడికి పాల్పడ్డాడు. కడుపులో గుద్దుతూ, కాళ్లతో తన్నుతూ.. చిత్రహింసలకు గురిచేశాడు. దీనికి సంబంధించిన ఘటనను అక్కడి స్థానికులు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా ప్రస్తుతం వైరల్ అవుతోంది.


తెలంగాణలో వడ్డీ వ్యాపారుల తీరు రోజురోజుకి దారుణంగా మారుతుంది. తాజాగా వికారాబాద్ జిల్లాకు చెందిన ఓ యువకుడిపై వడ్డీల వ్యాపారి తన ప్రతాపాన్ని చూపించాడు. ఎంత చెప్పినా, బ్రతిమిలాడినా వినకుండా దాడికి పాల్పడ్డాడు. వివరాల్లోకి వెళితే.. తాండూరులోని రాజీవ్ కాలనీకి చెందిన బాలయ్య అనే యువకుడు తన అవసరాల కోసం అప్పు చేయాల్సి వచ్చింది. ఈ క్రమంలో మేతరి రవి అనే ఓ వడ్డీ వ్యాపారి వద్ద రూ. 5వేలు అప్పుడు తీసుకున్నాడు. అయితే అప్పు తీసుకుని మూడు నెలలు గడుస్తున్నా ఇంకా తిరిగి ఇవ్వలేదు. ఈ క్రమంలో అప్పు తిరిగి ఇవ్వకుండా తప్పించుకుని తిరుగుతున్నాడని మేతరి రవి బాలయ్య ఇంటికి వెళ్లాడు. బాలయ్యను బయటికి పిలిచి తన అప్పు ఎప్పుడిస్తావంటూ నిలదీశాడు. అప్పు తీసుకున్నప్పటి నుంచి వడ్డీ కూడా ఇవ్వడం లేదని మండిపడ్డాడు.

అనంతరం యువకుడు బాలయ్యను తన ఇంటికి తీసుకెళ్లాడు. అప్పు ఎప్పుడు ఇస్తావు, వడ్డీ ఎప్పుడు ఇస్తావని రవి నిలదీశాడు. బాలయ్య ఇప్పుడే ఫోన్ చేసి అడిగి కడతానని అన్నాడు. అయితే బాలయ్య మాటలను రవి వినిపించుకోలేదు. ఇప్పటికే అప్పు తీసుకుని మూడు నెలలు అవుతుంది అన్నాడు. ఇక సహించలేక యువకుడిని చితకబాదాడు. కడుపులో కొడుతూ, కాళ్లతో తన్నుతూ చిత్ర హింసలు చేశాడు. అయితే వడ్డీ వ్యాపారి కొడుతున్న సమయంలో పక్కనే ఉన్నవారు కొట్టొద్దంటూ ఆపడానికి ప్రయత్నించారు.


మేతరి రవి బాలయ్యపై దాడి చేస్తున్న క్రమంలో రవి కొడుకు చూశాడు. దీంతో వెంటనే కొట్టొద్దు నాన్న అంటూ ప్రాధేయపడ్డాడు. చాలా సేపటి నుండి కొడుతున్నావు.. అతడిని వదిలిపెట్టాలని బ్రతిమిలాడిన కూడా రవి వినిపించుకోకుండా బాలయ్యపై చేయి చేసుకున్నాడు. అయితే బాలయ్యను రవి కొడుతున్న వీడియోను అక్కడే ఉన్న పలువురు వీడియో తీశారు. దీనిని సోషల్ మీడియాలో పెట్టడంతో వైరలవ్ అవుతోంది. వీడియో చూసిన నెటిజన్లు వడ్డీ వ్యాపారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

Related News

NTR: సారీ నన్ను క్షమించండి.. ఈవెంట్ తర్వాత ఎన్టీఆర్ స్పెషల్ వీడియో

Mother’s Love: అమ్మకు ప్రేమతో.. హ్యాపీ మదర్స్ డే..!

Cm Revanth Reddy: నేడు పాల‌మూరుకు సీఎం.. రూ.110 కోట్ల‌తో ఎలివేటెడ్ కారిడార్ రోడ్డుకు శంకుస్థాప‌న‌!

Pawan Kalyan: ఇష్టం వ‌చ్చిన‌ట్టు మాట్లాడితే తొక్కిప‌ట్టి నార‌ తీస్తాం.. రోజా, కోడాలికి ప‌వ‌న్ స్ట్రాంగ్ వార్నింగ్!

Chadrababu Naidu vs YS Jagan: తిరుమల డిక్లరేషన్ రగడ.. గెలిచిందెవరు?

Chiranjeevi: చిరు చేసిన పనికి గుండె ఆగిపోయినంత పనైంది- తెలుగు హీరోయిన్..!

Big Stories

×