Man Burnt His Bike: ఫైనాన్స్ సంస్థల వేధింపులు మాటల్లో వర్ణించలేం. ఆపదలో ఆదుకున్నా ఆ తరవాత వడ్డీ, చక్రవడ్డీలతో వసూలు చేస్తారు. డబ్బులు చెల్లించలేదంటూ ఇంటికి వచ్చి పరువు తీస్తుంటారు. డబ్బు కట్టేవరకు ఏజెంట్లు నిద్ర కూడా పోనివ్వరు. ఏజెంట్ల టార్చర్ భరించలేక ఆత్మహత్యలు చేసుకున్న ఘటనలు కూడా ఉన్నాయి. ఇక తాజాగా ఓ యువకుడు ఏజెంట్లు పెట్టే ఇబ్బందులు భరించలేక తన బైకును తగలబెట్టేశాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
వివరాల్లోకి వెళితే… ఈ ఘటన మెదక్ జిల్లా శివంపేటలో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన ఓ యువకుడు ఒకేసారి డబ్బులు చెల్లించలేక ఈఎంఐలో బైక్ కొనుగోలు చేశాడు. అయితే కొద్దిరోజులుగా ఆర్థిక ఇబ్బందులతో ఈఎంఐ కట్టలేకపోతున్నాడు. దీంతో ఫైనాన్స్ ఇచ్చిన సంస్థ ఏజెంట్లు డబ్బులు కట్టాలని తరచూ ఫోన్లు చేయడం మొదలుపెట్టారు. ఎంతకీ ఫైనాన్స్ కట్టకపోవడంతో విసుగు చెంది ఇంటికి వెళ్లారు. వెంటనే ఫైనాన్స్ కట్టాలని లేదంటే బైక్ తీసుకునివెళతామని చెప్పడంతో ఇరువురి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది.
ఈ క్రమంలో యువకుడు వారి ముందే తన బైకును తగలబెట్టేశాడు. ఏజెంట్ల ముందే బైకుకు నిప్పు పెట్టగా అది పూర్తిగా కాలి దగ్దమైపోయింది. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవ్వడంతో నెటిజన్లు తమ స్టైల్ లో కామెంట్లు పెడుతున్నారు. ఆవేశంలో చేసే పనుల వల్ల ఎక్కువ అనార్థాలు జరుగుతాయని అంటున్నారు. బైకును తగలబెట్టడం వల్ల అది పోవడంతో పాటూ ఇప్పుడు ఈఎంఐ కూడా కట్టక తప్పదని అంటున్నారు.
ఫైనాన్స్ సంస్థ ఆగడాలు భరించలేక బైక్ తగలబెట్టిన యువకుడు
మెదక్ జిల్లా శివంపేటలో ఘటన
ఇంటికి వచ్చి యువకుడిని EMI కట్టాలని బెదిరించిన ప్రైవేట్ ఫైనాన్స్ సంస్థ ఏజెంట్లు
మనోవేదనకు గురై ఫైనాన్స్ సంస్థ ఏజెంట్ల ముందే బైక్‌కి నిప్పు పెట్టడంతో పూర్తిగా దగ్ధం#Medak #Bike #Bigtv pic.twitter.com/4NguXDquO0
— BIG TV Breaking News (@bigtvtelugu) November 24, 2024