BigTV English

Worm in Dairy Milk Chocolate: డైరీ మిల్క్ చాక్లెట్స్ తింటున్నారా..? ఈ వీడియో చూస్తే తినటమే మానేస్తారులే!

Worm in Dairy Milk Chocolate: డైరీ మిల్క్ చాక్లెట్స్ తింటున్నారా..? ఈ వీడియో చూస్తే తినటమే మానేస్తారులే!

Live Worm found in Dairy Milk Chocolate: చాక్లెట్స్ అంటే పిల్లలే కాదు పెద్దలు కూడా అమితంగా ఇష్టపడుతుంటారు. ప్రేముకులకైతే ఈ చాక్లెట్స్ గురించి ప్రత్యేకంగ చెప్పనకర్లేదు. బుధవారం వాలంటైన్స్ డే వస్తుండటంతో చాకెట్లకు మరింత డిమాండ్ పెరిగిపోయింది. ఈ సందర్భంగా ఓ వ్యక్తి ఎంతో ఇష్టంగా కొనుగోలు చేసిన క్యాడ్‌బరీ డైరీ మిల్క్‌ చాక్లెట్‌లో పురుగు కనిపించింది. అందులో సజీవంగా ఉన్న పురుగును చూసి సదరు వ్యక్తి కంగు తిన్నాడు. తనకు ఎదురైన ఈ అనుభవాన్ని సోషల్ మీడియాలో షేర్ చేయడంతో విషయం బయటకు వచ్చింది.


హైదరాబాద్‌కు చెందిన రాబిన్ జాచెయస్ అనే వ్యక్తి అమీర్‌పేట్ మెట్రో స్టేషన్‌లో రత్నదీప్ రిటైల్ స్టోర్‌లో రూ.45 క్యాడ్బరీ డైరీ మిల్క్ చాక్టెట్ కొన్నారు. చాక్లెట్‌ను ఓపెన్ చేశారు.. అందులో పురుగు పాకుతుడటం గమనించి కంగు తిన్నారు. దానికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు ట్విట్టర్‌లో పంచుకున్నారు. ‘అమీర్ పేట్ మెట్రో స్టేషన్‌లోని రత్నదీప్ షాప్‌లో నేను కొన్న క్యాడ్‌బరీ చాక్లెట్‌లో పురుగు కనిపించింది. గడువు ముగిసే ఉత్పత్తులకు నాణ్యత తనిఖీ చేస్తున్నారా? ప్రజల అనారోగ్యానికి ఎవరు బాధ్యులు?’ అంటూ ట్వీట్ చేశారు.

Read More: నేను రాను బిడ్డో కామారెడ్డి దవాఖానకు.. ఐసీయూలో రోగిని కరిచిన ఎలుకలు..


దీనిపై హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ స్పందిస్తూ.. సంబంధిత ఆహార భద్రత అధికారులను అప్రమత్తం చేశామని.. సమస్యను సాధ్యమైనంత వరకు పరిష్కారిస్తామని తెలిపింది. క్యాడ్‌బెరీ డెయిరీ మిల్క్‌ అధికారులు సైతం స్పందిస్తూ… మాండెలెజ్ ఇండియా ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ (గతంలో క్యాడ్బరీ ఇండియా లిమిటెడ్) అత్యున్నత నాణ్యతా ప్రమాణాలను మెయింటెన్ చేయడానికి ప్రయత్నిస్తుదన్నారు. సదరు వ్యక్తికి ఎదురైన ఈ చేదు అనుభవానికి చింతిస్తునట్లు తెలిపారు. వారి ఫిర్యాదును పరిష్కరించేందుకు పేరు, చిరునామ, ఫోన్ నెంబర్‌తో పాటు కొనుగోలు వివరాలను మెయిల్ ద్యారా అందించమని కోరారు.

Tags

Related News

Hyderabad News: జీహెచ్ఎంసీ నిఘా.. ఆ పని చేస్తే బుక్కయినట్టే, అసలు మేటరేంటి?

Weather News: కొన్ని గంటల్లో ఈ ఏరియాల్లో భారీ వర్షం.. ఇక రాత్రంతా దంచుడే

Nagarjunasagar flood: నాగార్జునసాగర్‌ గేట్లు ఎత్తివేత.. సందర్శకులకు బిగ్ అలర్ట్!

Hyderabad Rains: అమీర్‌పేట ముంపు ప్రాంతాల్లో సీఎం రేవంత్ పర్యటన.. అధికారులకు కీలక ఆదేశాలు

Malreddy Ranga Reddy: రంగారెడ్డి ఎమ్మెల్యే మల్‌రెడ్డి కుటుంబంలో రాఖీ పండుగ రోజే విషాదం

Rain News: భారీ వర్షం.. ఈ జిల్లాల్లో కుండపోత వాన.. ఇళ్ల నుంచి బయటకు రావొద్దు

Big Stories

×