BigTV English

This week OTT & Theatre Releases: ఈ వారం ఓటీటీలో, థియేటర్లలో అలరించే చిత్రాలివే!

This week OTT & Theatre Releases: ఈ వారం ఓటీటీలో, థియేటర్లలో అలరించే చిత్రాలివే!

This week Theatre & OTT Releases Movies List: ఎప్పటిలాగే ఈవారం కూడా పలు ఆసక్తికర సినిమాలు ఓటీటీలో, థియోటర్ లో సందడి చేసేందుకు సిద్ధంగా ఉన్నాయి. మరి ఈ వీక్ సందడి చేసేందుకు రాబోతున్న ఓటీటీ & థియేటర్స్ చిత్రాలపై ఓ లుక్కేద్దాం.


థియేటర్స్ లో రిలీజ్ అవుతున్న చిత్రాలు ఇవే..
వైవిధ్యమైన కథలు, భిన్నమైన పాత్రలతో ప్రేక్షకులను అలరిస్తున్న మలయాళ అగ్ర కథానాయకుడు మమ్ముట్టి. ఇప్పుడు మరో భిన్నమైన కథతో తెరపై సందడి చేయడానికి సిద్ధమవుతున్నాడు. ఆయన ప్రధాన పాత్రలతో నటిస్తున్న చిత్రం “భ్రమయుగం”. హార్రర్ థ్రిల్లర్ మూవీ .. ఈ చిత్రాన్ని రాహుల్ సదాశివన్ దర్శకత్వం వహించారు. తాజాగా విడుదల చేసిన ట్రైలర్, పోస్టర్స్ కి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది. ఫిబ్రవరి 15 న ఈ మూవీని మలయాళంతో పాటు, తెలుగులోను, విడుదల చేస్తున్నారు. నైట్ షిఫ్ట్ స్టూడియోస్ బ్యానర్ పై చక్రవర్తి రామచంద్ర, శశికాంత్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

కంఠంనేని రవిశంకర్ నిర్మాణంలో.. అఖిలన్, వీణ ప్రధాన పాత్రలుగా నటిస్తున్న చిత్రం “రాజధాని ఫైల్స్”.. వాస్తవ సంఘటనల ఆధారంగా రూపొందుతున్న ఈ చిత్రం బిడ్డని పొదిగే గర్భంలో గొడ్డలి దించిన కర్కశత్వానికి.. కోట్ల మంది కలల్ని, వేలాది మంది జీవితాల్ని కాలరాసిన నిరంకుశత్వానికి తెర రూపమే మా రాజధాని ఫైల్స్ .. మనసుల్ని కదిలించే కథ, కథనాలతో రూపొందుతోంది. భాను దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ మూవీ ఫిబ్రవరి 15న ప్రేక్షకుల ముందుకు రానుంది.


Read More : ఓటీటీలోకి సుహాస్ కొత్త సినిమా.. నెల రోజుల్లోపే స్ట్రీమింగ్..!

సందీప్ కిషన్ కథానాయకుడిగా వి.ఐ.ఆనంద్‌ తెరకెక్కించిన చిత్రం ఊరు పేరు “భైరవకోన”. థ్రిల్లర్, సోషియో ఫాంటసీ కథాంశంతో దీన్ని తీర్చిదిద్దారు. కావ్య థాపర్, వర్ష బొల్లమ్మ కథానాయికలు.”దర్శకుడు ఈ చిత్రంలో ప్రేక్షకులను ఓ ఫాంటసీ ప్రపంచంలోకి తీసుకెళతాడు” అని సినీవర్గాలు చెబుతున్నాయి.ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ మూవీ ఫిబ్రవరి 16న ప్రేక్షకుల ముందుకు రానుంది. ‘గరుడ పురాణంలో మాయమైన ఆ నాలుగు పేజీలు భైరవకోన’ అంటూ విడుదల చేసిన ప్రచార చిత్రాలు సినిమాపై ఆసక్తిని పెంచాయి.

జయం రవి, కీర్తి సురేష్ కీలక పాత్రల్లో నటిస్తున్న యాక్షన్ ప్యాక్డ్ ఎమోషనల్ డ్రామా చిత్రం సైరన్. 108.. అనేది ఉపశీర్షిక. ఆంటోని భాగ్యరాజ్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం ఫిబ్రవరి 16 న ప్రేక్షకుల ముందుకు రానుంది. అంబులెన్స్ డ్రైవర్ గా పనిచేసి క్రిమినల్ గా మారిన ఓ వ్యక్తి కథగా థ్రిల్లింగ్ కథనంతో అలరించనుందీ చిత్రం. కీర్తి ఇందులో పోలీస్ ఆఫీసర్ గా కనిపించనుంది. అనుపమ పరమేశ్వరన్ కీలక పాత్ర పోషించిన ఈ సినిమాకు జీవీ ప్రకాశ్‌ కుమార్‌ సంగీతం అందించారు.

ఓటీటీలో లీజ్ అవుతున్న చిత్రాలు ఇవే..
నెట్ ఫ్లిక్స్..
సండర్ లెండ్ టిల్ ఐ డీ (వెబ్ సిరీస్3)ఫిబ్రవరి 13
లవ్ ఈజ్ బ్లైండ్ (వెబ్ సిరీస్6) ఫిబ్రవరి 14
ప్లేయర్స్ (హాలీవుడ్) ఫిబ్రవరి 14
ఐన్ స్టీన్ అండ్ ది బాంబ్ (హాలీవుడ్) ఫిబ్రవరి 16
అమెజాన్ ప్రైమ్
ఫైవ్ బ్లైండ్ డేట్స్(వెబ్ సిరీస్3)ఫిబ్రవరి 13
దిస్ ఈజ్ మీ..నౌ(హాలీవుడ్) ఫిబ్రవరి 16
జీ5..
క్వీన్ ఎలిజిబెత్ (మలయాళం)ఫిబ్రవరి 14
ది కేరళ స్టోరీ (హిందీ డబ్బింగ్) ఫిబ్రవరి 16
డిస్నీ ప్లస్ హాట్ స్టార్
ట్రాకర్‌ (వెబ్‌సిరీస్‌) ఫిబ్రవరి 12
సబ నయగన్‌ (తమిళ) ఫిబ్రవరి 14
ఓజ్లర్‌ (మలయాళం) ఫిబ్రవరి 15
సలార్‌ (హిందీ) ఫిబ్రవరి 16
నా సామిరంగ (తెలుగు) ఫిబ్రవరి 17
సోనీ లివ్ రాయ్ సంఘాని వర్సెస్ రాయ్ సంఘాని(హిందీ సిరీస్) ఫిబ్రవరి 12
ఆహా..
వీరమారి లవ్ స్టోరీ (తమిళ) ఫిబ్రవరి 14
ఆపిల్ టీవి ప్లస్
ది న్యూ లుక్ (వెబ్‌సిరీస్‌) ఫిబ్రవరి 14

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×