Big Stories

Farmhouse MLAs : అమిత్ షా అరెస్టుకు డిమాండ్.. ఆపరేషన్ లోటస్..

Farmhouse MLAs : మొయినాబాద్ ఫామ్ హౌజ్ కేసు ఢిల్లీలో ప్రకంపణలు సృష్టిస్తోంది. ఇక్కడి ఆడియోలకు.. అక్కడ రీసౌండ్ వస్తోంది. ఎమ్మెల్యేలను కొనాలనుకున్న ముగ్గురు మధ్యవర్తులు రెడ్ హ్యాండెడ్ గా దొరకడం.. వారి ఫోన్ కాల్ రికార్డ్స్ లో అమిత్ షా, సంతోష్ ల పేర్లు ఉండటం.. హాట్ టాపిక్ గా మారింది. నేషనల్ మీడియాలో ఫుల్ కవరేజ్ రావడంతో జాతీయ రాజకీయాల్లో ఈ ఎపిసోడ్ సంచలనంగా మారింది. బీజేపీని టార్గెట్ చేస్తూ ప్రతిపక్ష పార్టీలు మాటల దాడి మొదలుపెట్టాయి. ఆప్ సీనియర్ నేత, ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా ఏకంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షాను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేయడం కలకలం రేపుతోంది.

- Advertisement -

ఆపరేషన్ లోటస్ పేరుతో పలు రాష్ట్రాల్లో బీజేపీ వికృత క్రీడ ఆడుతోందని మండిపడ్డారు మనీష్ సిసోడియా. ప్రత్యర్థి పార్టీల ఎమ్మెల్యేలను కొనేసి.. ప్రజాస్వామ్య ప్రభుత్వాలను కూల్చేయడానికి ఆపరేషన్ లోటస్ చేపట్టారని ఆరోపించారు. ఆ ప్రక్రియలో భాగంగా ముగ్గురు మధ్యవర్తులు పట్టుబడటంతో బీజేపీ బండారం బయటపడిందన్నారు. ఢిల్లీలో ఆప్ ఎమ్మెల్యేలను కూడా కొనే ప్రయత్నం జరిగిందని.. తమ పార్టీకి చెందిన 43 మంది ఎమ్మెల్యేలను ట్రాప్ చేయాలని చూశారని.. కేజ్రీవాల్ సర్కారును కూల్చే ప్రయత్నం చేశారని.. కాకపోతే ఆ ప్రయత్నాలేవీ ఫలించలేదని సిసోడియా చెప్పారు.

- Advertisement -

ఒక్కో ఎమ్మెల్యేలకు 100 కోట్లు ఇస్తామన్నారంటే.. బీజేపీ దగ్గర అంత డబ్బు ఎక్కడిదని ప్రశ్నించారు. కేంద్ర హోంమంత్రిగా ఉంటూ ఎమ్మెల్యేలను కొనే పని చేస్తున్నారా? అంటూ షా ను నిలదీశారు సిసోడియా. మొయినాబాద్ ఫామ్ హౌజ్ కేసులో అమిత్ షా పేరు ఉండటం వల్ల ఆయన హోంమంత్రిగా కొనసాగే అర్హత లేదని అన్నారు. పంజాబ్, తెలంగాణలో జరుగుతున్న పరిణామాలు దారుణమన్నారు.

ఫామ్ హౌజ్ ఘటనపై ఆప్ స్పందించడంతో కేసీఆర్ కు మరింత బలం చేకూరినట్టైంది. ఆయనకు కావలసింది కూడా ఇదే. జాతీయ స్థాయిలో బీజేపీకి ఎంత డ్యామేజ్ జరిగితే బీఆర్ఎస్ కు అంత మైలేజ్ అని భావిస్తున్నారు. వరుస ఆడియో లీకులు, వాట్సాప్ చాట్ లతో నేషనల్ మీడియా అటెన్షన్ డ్రా చేస్తున్నారు. ఆ స్కెచ్ లో కేసీఆర్ సక్సెస్ అయినట్టే అనిపిస్తోంది. ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా రియాక్షనే అందుకు నిదర్శనం అంటున్నారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News