BigTV English

Samantha: సమంతకు డేంజరస్ వ్యాధి!.. క్లారిటీ ఇచ్చిన సామ్..

Samantha: సమంతకు డేంజరస్ వ్యాధి!.. క్లారిటీ ఇచ్చిన సామ్..

Samantha : సమంతకు ప్రమాదకర వ్యాధి.. ఆ రోజు చెప్పిందే నిజమైందా?

Samantha : తెలుగు ప్రజలను తన స్పైసీ స్మైల్ తో ఆకట్టుకునే సమంతకు పెద్ద కష్టమొచ్చింది. ఎప్పుడూ చలాకీగా కనిపించే ఈ అందాల భామ ప్రాణాంతక వ్యాధితో బాధపడుతోంది. ఆ విషయాన్ని ఆమే స్వయంగా చెప్పింది. సమంత వ్యాధితో బాధపడుతోందని.. కొంతకాలంగా అమెరికాలో చికిత్స తీసుకుంటోందని వదంతులు వచ్చాయి. కానీ వాటన్నింటికీ సామ్ తన స్టేట్ మెంట్ తో బ్రేక్ చెప్పింది. పంటిబిగువున బాధను అణుచుకుంటూనే యశోద సినిమా కోసం డబ్బింగ్ చెప్పింది. యశోద సినిమాకు డబ్బింగ్ చెప్పడానికి తాను ఎంత ఇబ్బందిపడుతోందో.. ఆమె షేర్ చేసిన మ్యాటర్, ఫోటోలే చెబుతున్నాయి. ఓవైపు చేతికి సెలైన్ ఎక్కించుకుంటూనే మరోవైపు డబ్బింగ్ చెబుతున్నగా ఉన్న ఫోటోను ఇన్ స్టాలో షేర్ చేసింది.


యశోద సినిమా ట్రైలర్ కు స్పందన చాలా బాగుందని.. కానీ ముగింపు లేని సవాళ్లను జీవితం తన ముందు ఉంచిందని ఆవేదన చెందింది సమంత. కానీ అభిమానులు చూపిస్తున్న ప్రేమ, అభిమానం, ఆప్యాయతలకు ఆమె కరిగిపోయింది. అందుకే అవన్నీ తనకు మరింత మనోబలాన్ని ఇస్తున్నాయని.. అడుగడుగునా ధైర్యం నూరిపోస్తున్నాయని చెప్పింది. కొన్ని నెలలుగా సమంత మయోసిటిస్ వ్యాధితో బాధపడుతోంది. ఇది ఆటో ఇమ్యూనిటీ కండిషన్ పరంగా సమస్యలు తీసుకువస్తుంది. అందుకే ఆ వ్యాధిని నయం చేసుకోవడానికి, ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ట్రీట్ మెంట్ తీసుకుంటోంది.

ఈ వ్యాధి నుంచి సమంత ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది. కాకపోతే.. ఇది నయం కావడం ఇప్పట్లో సాధ్యం కాకపోవచ్చు. మరికొంత సమయం పట్టవచ్చు. అన్నిసార్లూ ఇలాంటి పరిస్థితులను ఎదుర్కోవడం సాధ్యం కాకపోవచ్చు. అందుకే అడుగడుగున ఎదురైన సవాళ్లను స్వీకరిస్తూ ఒక్కో అడుగూ ముందుకు వేస్తోంది. వైద్యులు కూడా త్వరగా కోలుకుంటావని భరోసా ఇస్తున్నారని.. అందుకే ఆ నమ్మకంతోనే ఉన్నానని చెప్పుకొచ్చింది. జీవితంలో మంచి, చెడు రోజులను చాలా చూశానని.. ఇప్పుడీ పరిస్థితి కూడా అలాంటిదే అంది సమంత. జీవితంలో మరొక్క రోజును కూడా భరించలేని పరిస్థితులను ఎదుర్కొన్నానని.. అదే తనకు మనో ధైర్యాన్ని పెంచిందని చెప్పింది. తాను త్వరలోనే పూర్తిగా కోలుకుంటానంటూ అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పింది. ఐ లవ్ యూ అంటూ తన ఫ్యాన్స్ నిరాశపడకుండా ధైర్యం చెప్పింది సమంత.


Related News

Poster Talk Septmber : ఆగస్టు ఆగం అయింది… మరి సెప్టెంబర్ సేవ్ చేస్తుందా ?

Big Tv Folk Night: స్టేజ్ కాదు ఇల్లు దద్దరిల్లే టైం వచ్చింది.. ఫుల్ ఎపిసోడ్ ఆరోజే!

Kissik Talks Show : డైరెక్టర్స్ చేస్తుంది తప్పు.. ఆ పద్ధతి మార్చుకోండి.. గీతా సింగ్ సంచలన కామెంట్స్..

Kissik Talks Show : నటి గీతా సింగ్ ఫస్ట్ రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా..?

SivaJyothi: గుడ్ న్యూస్ చెప్పబోతున్న శివ జ్యోతి… బుల్లి సావిత్రి రాబోతోందా?

Movie Industry : ఇండస్ట్రీలో ఇవి మారాల్సిందే… లేకపోతే దుకాణం క్లోజ్ ?

Big Stories

×