Big Stories

Transfers in Panchayat Raj Department: పంచాయతీరాజ్‌ శాఖలో భారీగా బదిలీలు.. ఉత్తర్వులు జారీ చేసిన సీఎస్

Telangana today news

Transfers in Telangana Panchayat Raj Department: పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రంలో బదిలీల పర్వం కొనసాగుతోంది. తెలంగాణ పంచాయతీరాజ్‌ శాఖలో భారీగా బదిలీలు చేస్తున్నట్లు తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రూరల్‌ డెవలప్‌మెంట్‌ శాఖలో 105 మందిని బదిలీ చేసింది. సీఈవో, డీఆర్డీవో, అడిషనల్‌ డీఆర్డీవో, డీపీవోలకు ప్రభుత్వం స్థాన చలనం కల్పించింది.

- Advertisement -

మరోవైపు, తెలంగాణ ఆబ్కారీశాఖలో 14 మంది ఎక్సైజ్‌ సూపరింటెండెంట్లు, ఇద్దరు ఉప కమిషనర్లు, 9 మంది సహాయ కమిషనర్లను కూడా ప్రభుత్వం బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

- Advertisement -

ఇప్పటికే తెలంగాణలో తహశీల్దార్లను పెద్ద ఎత్తున ప్రభుత్వం బదిలీ చేసిన సంగతి తెలిసిందే. రాష్ట్రవ్యాప్తంగా 132 మంది తహశీల్దార్లు, 32 మంది డిప్యూటీ కలెక్టర్లను బదిలీ చేస్తూ రెవెన్యూ శాఖ కార్యదర్శి శనివారం ఉత్తర్వులు జారీ చేశారు.

ఎన్నికల కమిషన్‌ మార్గదర్శకాల మేరకే ప్రభుత్వం ఈ బదిలీలు చేపట్టినట్లు సమాచారం. అయితే 84 మంది మల్టీజోన్-1లో, 48 మంది మల్టీజోన్-2లో తహశిల్దార్లను బదిలీ చేశారు. రెవెన్యూ శాఖలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ తర్వాత ఇంత భారీ స్థాయిలో బదిలీలు జరగడం ఇదే తొలిసారి.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News