BigTV English

Sai Pallavi Rejected Movies List: సాయి పల్లవి ఇన్ని సినిమాలను రిజక్ట్ చేసిందా..? కారణం ఏంటో తెలిస్తే షాకవ్వాల్సిందే..!

Sai Pallavi Rejected Movies List: సాయి పల్లవి ఇన్ని సినిమాలను రిజక్ట్ చేసిందా..? కారణం ఏంటో తెలిస్తే షాకవ్వాల్సిందే..!

Sai Pallavi Rejected Movies List: హీరోయిన్ సాయి పల్లవి.. ఈమె గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. గ్లామర్‌తో పని లేకుండా యాక్టింగ్ టాలెంట్‌తో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది ఈ హీరోయిన్. కేవలం ప్రాధాన్యత ఉన్న పాత్రలపై ఫోకస్ పెడుతోన్న ఈ భామ బోల్డ్ పాత్రలను అస్సలు యాక్సెప్ట్ చేయడం లేదు.


ఇప్పటి వరకు టాలీవుడ్‌లో స్టార్ హీరోల సరసన నటించిన ఈ ముద్దుగుమ్మ అందరి మనసులను దోచేసుకుంది. అయితే కేవలం కంటెంట్‌కు మాత్రమే ప్రాధాన్యత ఇస్తున్న సాయి పల్లవి.. ఎంత పెద్ద స్టార్ హీరో సినిమాలో అవకాశం వచ్చినప్పటికీ టెంప్ట్ అవ్వడంలేదు.

ఆచితూచి అడుగులు వేస్తోంది. సినిమాలో తన పాత్రకు ప్రాధాన్యం ఉంటేనే చేస్తుంది. లేదంటే సున్నితంగా సినిమాలు రిజక్ట్ చేసేస్తోంది. ఇప్పటి వరకు తనకి నచ్చని ఎన్నో సినిమాలు వదులుకున్నట్లు తెలుస్తోంది. అందులో కొన్ని బ్లాక్ బస్టర్ హిట్లు అయితే.. మరికొన్ని డిజాస్టర్లుగా మిగిలాయి.


READ MORE: చెల్లి ఎంగేజ్‌మెంట్‌లో డ్యాన్స్ ఇరగదీసిన సాయి పల్లవి..!

ఇక సాయి పల్లవి ఇప్పటి వరకు రిజక్ట్ చేసిన సినిమాలెన్నో ఇప్పుడు తెలుసుకుందాం. తమిళ స్టార్ హీరో విజయ్‌తో నటించే అవకాశం వచ్చినా.. అందులో ఆమె పాత్రకు స్కోప్ లేదన్న కారణంతో తిరస్కరించిందని సమాచారం.

తమిళ స్టార్ హీరో విజయ్ – లోకేష్ కనగరాజ్ కాంబోలో తెరకెక్కిన చిత్రం ‘లియో’. ఈ మూవీలో హీరోయిన్‌గా ముందు సాయి పల్లవినే అనుకున్నారట. కానీ ఈ సినిమాకు ఆమె నో చెప్పడంతో.. ఆ తర్వాత త్రిష చేసింది. ఈ మూవీ మంచి హిట్ అయినప్పటికీ.. చాలా విమర్శలు ఎదుర్కొంది.

అలాగే మరో స్టార్ హీరో అజిత్‌తో జోడీగా ‘వాలిమై’ సినిమాలో నటించే ఛాన్స్ రాగా.. అందులో పాత్ర నచ్చకపోవడంతో దానికి కూడా నో చెప్పేసింది. ఈ రెండు సినిమాలలో కేవలం తన పాత్రకు ప్రాధాన్యత లేదనే కారణంతోనే సాయి పల్లవి నో చెప్పిందని సమాచారం.

READ MORE: ఫస్ట్ సిస్టర్స్.. నెక్స్ట్ మేము అంటున్న హీరోయిన్స్.. కొత్త ట్రెండ్ షురూ..?

దీంతోపాటు రౌడీ హీరో విజయ్ దేవరకొండ సరసన కూడా నటించే ఛాన్స్ వచ్చిందట. ‘డియర్ కామ్రేడ్’ సినిమాలో విజయ్‌తతో నటించే అవకాశం వచ్చినా.. అందులో ఎక్కువగా ముద్దు సీన్లు ఉన్నాయనే కారణంతో ఈ సినిమాను వదిలేసుకుందట.

అంతేకాకుండా రీసెంట్‌గా మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘భోళా శంకర్’ సినిమాలో కూడా అవకాశం వచ్చిందట.. అయితే దీనికి కూడా ఆమె నో చెప్పినట్లు తెలుస్తోంది. అలాగే ‘చంద్రముఖి2’లో కూడా ఛాన్స్ వచ్చినప్పటికీ.. అందులో పాత్ర నచ్చకపోవడంతో రిజక్ట్ చేసినట్లు సమాచారం. మొత్తానికి ఈ అమ్మడు చాలా సినిమాలనే రిజక్ట్ చేసింది.

Related News

Dharsha Guptha: ఇంస్టాగ్రామ్ ద్వారా నెలకు లక్షల్లో ఆదాయం..ఈ ముద్దుగుమ్మ పనే బాగుందే!

Vithika sheru: మట్టి వినాయకుడిని చేసిన హీరోయిన్.. వామ్మో ఈ టాలెంట్ కూడా ఉందా?

Dethadi Alekhya Harika: మన క్యారెక్టర్ ని డిసైడ్ చేసేది అదే.. బుల్లి కథతో హారిక పోస్ట్!

Big TV kissik talks : స్టేజ్ పై అమ్మాయిలతో పండు అలా.. అడ్డంగా పరువుతీసేసిన వర్ష…

Big TV kissik talks : శేఖర్ మాస్టర్ అలాంటి వాడే.. షాకింగ్ విషయాలను బయట పెట్టిన పండు..!

The Big Folk Night 2025 : జానపదంతో దద్దరిల్లిన ఎల్బీ స్టేడియం.. ఘనంగా బిగ్ టీవీ ఫోక్ నైట్

Big Stories

×