BigTV English

Kishan Reddy: మెరుపు ధర్నాతో బీజేపీకి బిగ్ మైలేజ్.. అంతా కేసీఆర్ స్కెచ్చేనా? రేవంత్ కోసమేనా?

Kishan Reddy: మెరుపు ధర్నాతో బీజేపీకి బిగ్ మైలేజ్.. అంతా కేసీఆర్ స్కెచ్చేనా? రేవంత్ కోసమేనా?
Kishan Reddy today news

Kishan Reddy today news(Breaking news updates in telangana) : KCR అంటే ‘కిషన్ చంద్రశేఖర్ రెడ్డి’ అంటూ ఇటీవల మీమ్స్ హోరెత్తాయి. కిషన్‌రెడ్డికి బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి ఇవ్వగానే.. సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోలింగ్ జరిగింది. కిషన్ ఫ్రెండ్లీ మ్యాచ్ అడుతారని.. బీజేపీకి బీఆర్ఎస్ బీ టీమ్ అని పంచ్‌లు పేలాయి. అన్నట్టుగానే అప్పటినుంచి బీజేపీ సైలెంట్ మోడ్ లోకి వెళ్లిపోయింది. ఇక కమలం పని ఖతం అనుకున్నారంతా.


ఇదే టైమ్‌లో కాంగ్రెస్ లైమ్‌ లైట్‌లోకి వచ్చింది. ఉచిత విద్యుత్‌పై రేవంత్‌రెడ్డి చుట్టూ రాజకీయం నడిచింది. వరుస ప్రెస్‌మీట్లతో రేవంత్, ధర్నాలతో కేడర్ కాక మీదుంది. కాంగ్రెస్, కారు.. నువ్వా నేనా అన్నట్టు పోరు జరుగుతుండగా.. సడెన్‌గా కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి రోడ్డు మీదకు ఊడిపడటం.. వర్షంలో బైఠాయించి హల్‌చల్ చేయడం.. మీడియా ఫుల్ కవరేజ్ ఇవ్వడం.. అంతా మెరుపు వేగంతో జరిగిపోయింది. గంటల వ్యవధిలోనే కాంగ్రెస్‌కు ధీటుగా బీజేపీ యాక్టివ్ అయినట్టు పొలిటికల్ మైలేజ్ వచ్చిపడింది. ఇంతకీ, ఇదంతా బీజేపీ చేస్తున్న రాజకీయమా? కిషన్‌రెడ్డితో కేసీఆర్ చేయిస్తున్న పాలి..ట్రిక్సా? అనే డౌటనుమానం వ్యక్తం అవుతోంది.

కొన్నిరోజులుగా కిషన్‌రెడ్డి అసలు ఇండియాలోనే లేరు. విదేశాల నుంచి వస్తూ గురువారం ఉదయమే ఫ్లయిట్ దిగారు. కేంద్రమంత్రిగా ఉండికూడా ఢిల్లీలో పార్లమెంట్ సమావేశాలకు వెళ్లకుండా.. నేరుగా హైదరాబాదే విచ్చేశారు. అదేంటోకానీ.. విమానం దిగీదిగగానే.. ఎయిర్‌పోర్టు నుంచి నేరుగా బాటసింగారం డబుల్ బెడ్‌రూమ్ ఇండ్ల బాట పట్టడం ఆశ్చర్యంగా ఉందంటున్నారు. ఆయనింకా పార్టీ అధ్యక్ష బాధ్యతలు కూడా స్వీకరించనే లేదు.. అయినా, మునుపెన్నడూ లేని ఉత్సాహం చూపించడం వెనుక ఏదో మతలబు ఉందని అంటున్నారు. పొలిటికల్‌ స్కెచ్ దాగుందని చెబుతున్నారు.


బుధవారం రాత్రి మంత్రి కేటీఆర్ డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల పంపిణీకి కార్యచరణ ప్రకటించారు. GHMC పరిధిలోని 70 వేల ఇళ్లను.. 6 విడతలుగా పంపిణీ చేయాలని అధికారులను ఆదేశించారు. ఆగస్టు మొదటివారం నుంచి.. అక్టోబర్‌ వరకు.. ఇళ్ల పంపిణీ పూర్తి చేయాలని చెప్పారు. బుధవారం రాత్రి ఈ ప్రకటన వస్తే.. రాత్రంతా జోరుగా వాన పడుతుంటే.. గురువారం ఉదయం కల్లా కిషన్‌రెడ్డి అదే డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల పరిశీలన పేరుతో హడావుడి చేయడం వాట్ ఏ టైమింగ్ అనుకోవాలా? అంతా ప్రీషెడ్యూల్డ్ ప్రోగ్రామ్ అని అనుమానించాలా?

ఏ విషయంలోనైనా వేగంగా స్పందించే రేవంత్‌రెడ్డికి అసలేమాత్రం ఛాన్స్ ఇవ్వకుండా.. రాత్రి ప్రకటన వస్తే.. ఉదయం కల్లా బీజేపీ యాక్షన్‌లోకి దిగిపోవడం.. ఈటల లాంటి వాళ్లను ముందే హౌజ్‌అరెస్ట్ చేయడం.. కిషన్‌రెడ్డి విదేశాల నుంచి వస్తున్నట్టు పోలీసులకు సమాచారం అందడం.. వారంతా పక్కాగా కేంద్రమంత్రినే టార్గెట్ చేయడం.. ఆయన జోరు వానలో రోడ్డు మీద బైఠాయించడం.. ఇలాంటివి కిషన్‌రెడ్డి కెరీర్‌లో నెవ్వర్ బిఫోర్ అంటున్నారు.

అయితే, బీజేపీ ప్రోగ్రామ్ వారం ముందే ఫిక్స్ అయిందని కూడా అంటున్నారు. ఆ ప్రకారం చూసినా.. బీజేపీ కార్యక్రమానికి సరిగ్గా కొన్ని గంటల ముందు.. కావాలనే ప్రభుత్వం డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల పంపిణీకి ఉత్తర్వులు ఇచ్చిందా? అనే డౌట్ వ్యక్తం అవుతోంది. ఆ రెండు పార్టీలు ములాకత్ అయ్యాయా? కాంగ్రెస్‌కు ధీటుగా మళ్లీ బీజేపీని యాక్టివ్ చేస్తున్నారా? బండిని మరిపించేలా కిషన్‌రెడ్డిని హైప్ చేసి.. కావాలనే ఆయనకు మైలేజ్ ఇస్తున్నారా? తెలంగాణలో ట్రయాంగిల్ ఫైట్ ఉన్నట్టు సీన్ క్రియేట్ చేయాలని ప్రయత్నిస్తున్నారా? ఇన్నాళ్లూ స్తబ్దుగా ఉన్న కమలదళం సడెన్‌గా దూకుడు పెంచిందా? పెరిగేలా చేశారా? టోటల్ ఎపిసోడ్‌లో కిషన్‌రెడ్డి హీరో అయితే.. మరి డైరెక్షన్? కేసీఆరేనా? ఏమో.. రాజకీయాల్లో ఏదైనా సాధ్యమేగా.

Related News

Gold: బంగారాన్ని ఆర్టిఫీషియల్ గా తయారు చెయ్యొచ్చా? పరిశోధకులు ఏం చెప్తున్నారంటే?

AP Politics: ఆ టీం మనకొద్దు.. జగన్ కొత్త ప్లాన్..

Siddipet Congress: ఆ జిల్లా కాంగ్రెస్‌లో కుమ్ములాటలు?

Trump tariff: ట్రంప్ టారిఫ్ దెబ్బ.. ఆంధ్రా రొయ్యలు విల విల.. సీ ఫుడ్ ఇండస్ట్రీపై పడే ఎఫెక్ట్ ఎంత?

AP Politics: టీడీపీలోకి గల్లా రీఎంట్రీ? ఎప్పుడంటే?

Chennur Politics: చెన్నూరులో బాల్క సుమన్ చేతులెత్తేశారా?

Big Stories

×